E-Paper
Advertisement

వరుస మర్డర్స్ తో పోలీసులను పరుగులు పెట్టించే సైకో… రియల్ సీరియల్ కిల్లర్ కథ

వరుస మర్డర్స్ తో పోలీసులను పరుగులు పెట్టించే సైకో… రియల్ సీరియల్ కిల్లర్ కథ
Advertisement

Korean Crime Thriller: సైకో థ్రిల్లర్ సినిమాలు అంటేనే పోలీసులను టెన్షన్ పెట్టి, ఆడియన్స్ ను నిమిషానికో ట్విస్ట్ తో థ్రిలర్ చేస్తాయి. అందులోనూ ఈ జానర్లో వచ్చే కొరియన్ సినిమాలు, సిరీస్ లు పిచ్చెక్కిస్తుంటాయి. మీరు గనుక ఓటీటీలో ఇలాంటి ఓ మంచి సీరియల్ కిల్లర్ కథ గురించి వెతుకుతుంటే ఈ మూవీ సజెషన్ మీ కోసమే. 2026లో విడుదలైన దక్షిణ కొరియా క్రైమ్-మిస్టరీ థ్రిల్లర్ The Scarecrow గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చు ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఇందులో మన హీరో పేరు కాంగ్ తే-జూ. ఒకప్పుడు సియోల్‌ లో టాప్ డిటెక్టివ్‌ గా పేరు పొందిన వ్యక్తి. ఒక పెద్ద ఇన్సిడెంట్ వల్ల అతని కెరీర్ దెబ్బతిని, సొంత ఊరైన గాంగ్‌సింగ్‌కు బదిలీ అయ్యాడు. ఇక్కడికి వచ్చేసరికి అతను ఒంటరిగా ఫీల్ అవుతాడు. నిరాశతో, గతం తాలూకూ భారంతో బాధపడుతుంటాడు. అతని పాత స్నేహితుడు…. కాదు కాదు, స్కూల్ రోజుల నుంచి శత్రువు అయిన చా సి-యంగ్ మాత్రం అక్కడే పవర్‌ఫుల్ ప్రాసిక్యూటర్‌ గా ఉన్నాడు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో ఉంటుంది.

Advertisement

తే-జూ తన సొంత ఊరికి తిరిగి వచ్చిన కొద్దీ గ్రామంలో వింతైన హత్యలు మళ్లీ మొదలవుతాయి. బొమ్మలాగా శవాలను అమర్చి, భయంకరంగా వదిలేసే ఈ హత్యలను స్థానికులు ‘స్కేర్‌క్రో కిల్లింగ్స్’ అని పిలుస్తారు. ఇవి అచ్చం 1980ల చివర్లో జరిగిన హ్వాసియోంగ్ సీరియల్ మర్డర్స్ లాగే ఉంటాయి. 33 సంవత్సరాల తర్వాత అదే పద్ధతిలో హత్యలు జరగడం తే-జూను కదిలిస్తుంది. తన పోయిన గౌరవాన్ని తిరిగి సంపాదించుకోవాలనే తపనతో అతను ఈ కేసును తన చేతుల్లోకి తీసుకుంటాడు. దర్యాప్తు ముందుకు సాగుతుండగా తే-జూ తన పాత శత్రువు చా సి-యంగ్‌తో కలిసి పని చేయాల్సి వస్తుంది.

ఒకరినొకరు ఎదిరించుకుంటూ, వాదించుకుంటూ కూడా బలమైన టీమ్‌గా మారతారు. వారితో పాటు సియో జి-వాన్ అనే ధైర్యవంతురాలైన అధికారిణి కూడా ఈ ఇన్వెస్టిగేషన్‌లో కీలక పాత్ర పోషిస్తుంది. మూడు వేర్వేరు వ్యక్తిత్వాలు కలిసి ఈ మిస్టరీని వెలికితీస్తారు. ఇన్వెస్టిగేషన్ డెప్త్ గా వెళ్లేసరికి, ఇది సాధారణ సీరియల్ కిల్లర్ కేసు కాదని అర్థమవుతుంది. హత్యల వెనక గతం నుంచి కొనసాగుతున్న ఒక పెద్ద కుట్ర, ఉన్నత స్థాయి వ్యక్తులు, పోలీసు వ్యవస్థలోని అవినీతి ఉన్నట్టు తెలుస్తుంది. కిల్లర్ ప్రతిసారీ పోలీసుల కంటే ఒక అడుగు ముందే ఉంటూ వారితో మైండ్ గేమ్ ఆడుతుంటాడు.

Advertisement

ఈ ప్రయాణంలో ప్రతి ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్ ఉంటుంది. క్లైమాక్స్‌లో వచ్చే బిగ్ రివీల్ ప్రతి ఒక్కరినీ షాక్‌కు గురి చేస్తుంది. ఈ సీన్‌ లో తే-జూ తను వేటాడుతున్న వ్యక్తి వెనక ఉన్న అసలు సూత్రధారిని చూసి మెంటల్ గా డిస్టర్బ్ అవుతాడు. మరి ఇంతకీ ఆ కిల్లర్ ఎవరు ? పోలీసులు అతడిని ఎలా పట్టుకున్నారు ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటి ? అన్నది తెలియాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయాల్సిందే.

తెలుగులో చూడొచ్చా ?

ది స్కేర్ స్క్రో సిరీస్‌ లో ప్రతి అంశం ఎడ్జ్ ఆఫ్ ది సీట్‌లో కూర్చోబెడుతుంది. ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. ‘టాక్సీ డ్రైవర్’ దర్శకుడు పార్క్ జూన్-వూ తెరకెక్కించిన ఈ 12 ఎపిసోడ్‌ల సిరీస్ తెలుగు డబ్బింగ్ అందుబాటులో ఉంది. కొరియన్ భాషలో ఉన్న ఈ సిరీస్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమ్ అవుతోంది.

Read Also : నరకంలో ఉన్న పేరెంట్స్ కోసం దేవుడితో ఒప్పందం… మెంటలెక్కించే సూపర్ నేచురల్ థ్రిల్లర్

Related News

విషమిచ్చి చంపబోతే 300 ఏళ్ల ఫ్యూచర్లోకి వచ్చి పడే అమ్మాయి…

పెళ్లి కాకుండానే చచ్చి దెయ్యంగా… అబ్బాయిలు కన్పిస్తే వదలని ఆడ పిశాచి

హైవే యాక్సిడెంట్లలో హెల్ప్ చేసేవాళ్ల ప్రాణాలు తీసే పిశాచి… ఇలాంటి హర్రర్ మూవీని ఎప్పుడూ చూసుండరు భయ్యా

అడవిని డెడ్లీ డెత్ గేమ్ లా మార్చే సైకో… టూరిస్టులను టార్చర్ చేసి చంపే కిల్లర్

మనుషుల బ్రెయిన్ ను మటన్ లా తినేసే మాన్స్టర్స్… ఈ కొరియన్ సై-ఫై సిరీస్ లో ఒక్కొక్క ట్విస్ట్ ఉంటది భయ్యా

ఘోస్ట్ షిప్లో వెంటాడి వెంటాడి చంపే మాస్క్ కిల్లర్… టెర్రీఫయింగ్ టైమ్ లూప్ సైకలాజికల్ థ్రిల్లర్

అనాథాశ్రమం అమ్మాయిలను బలిచ్చే వార్డెన్… తినేటప్పుడు మాత్రం ఈ మూవీని అస్సలు చూడొద్దు

Big Stories

Advertisement
×