E-Paper
Advertisement

Railway Ticket Rates Hike: పండుగ ముందు రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన టికెట్ ఛార్జీలు

Railway Ticket Rates Hike: పండుగ ముందు రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన టికెట్ ఛార్జీలు
Advertisement

Railway Ticket Rates Hike: భారతీయ రైల్వే ప్రయాణికులకు షాకిచ్చే న్యూస్ చెప్పింది. రైల్వే ప్రయాణ ఛార్జీలు పెంచింది. పెరిగిన ఛార్జీలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి రానున్నాయి. పెరుగుతున్న ఖర్చులను బ్యాలెన్స్‌ చేసేందుకు, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఛార్జీలు సవరించినట్లు రైల్వే అధికారులు ప్రకటన చేశారు. లోకల్‌, స్వల్ప దూర ప్రయాణాల టికెట్‌ ధరల్లో ఎలాంటి మార్పుచేయలేదు. ఆర్డినరీ క్లాస్‌లో 215 కి.మీల కంటే తక్కువ దూరం ప్రయాణాలకు ఛార్జీలు పెంచలేదని రైల్వే శాఖ తెలిపింది. అంతకంటే ఎక్కువ దూరం వెళ్లే ఆర్డినరీ రైలు టికెట్‌ ధరను కిలో మీటరకు 1 పైసా చొప్పన పెంచింది.

టికెట్ల పెంపుతో రూ.600 కోట్ల ఆదాయం

మెయిల్, ఎక్స్‌ప్రెస్‌ ఏసీ, నాన్‌-ఏసీ రైళ్లకు కిలోమీటరకు 2 పైసలు చొప్పున ఛార్జీలు పెంచారు. నాన్‌ ఏసీ రైళ్లలో 500 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించే వారు అదనంగా రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. ఛార్జీల పెంపుతో రైల్వేకు దాదాపు రూ.600 కోట్ల మేర ఆదాయం సమకూరనుంది. డిసెంబర్ 26 నుండి రైల్వేలు ఛార్జీల పెంపు అమల్లోకి రానున్నాయి. సబర్బన్ రైలు ప్రయాణ ఛార్జీలు పెంచనప్పటికీ, దూర ప్రయాణాలు భార ఎక్కువ ఖర్చు అవుతుంది.

Advertisement

215 కిలోమీటర్ల దూరం వరకు జనరల్ క్లాస్ టిక్కెట్ల ధర పెంచలేదు. కానీ 215 కిమీ కంటే ఎక్కువ దూరాలకు కి.మీకి 1 పైసా చొప్పున పెంచారు. మెయిల్ లేదా ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఎయిర్ కండిషన్ లేని కోచ్‌లకు, కి.మీకి 2 పైసలు పెంచారు. ఏసీ కోచ్‌లకు కి.మీకి 2 పైసల చొప్పున పెరిగింది. నాన్ ఏసీ కోచ్‌లలో 500 కి.మీ ప్రయాణానికి రూ. 10 అదనపు భారం పడనుంది.

రైల్వే ఖర్చు

భారతీయ రైల్వే ఖర్చులో ఉద్యోగులకు రూ.1,15,000 కోట్లు, పెన్షన్ కు రూ.60,000 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రైల్వే కార్యకలాపాలకు మొత్తం రూ.2,63,000 కోట్లు ఖర్చు చేసింది. అంతకుముందు, ఈ ఏడాది జులైలో ఛార్జీలు పెంచింది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఎయిర్ కండిషన్ లేని తరగతిలో ఛార్జీని కి.మీ.కు 1 పైసలు పెంచింది. ఏసీ తరగతుల్లో కి.మీ.కు 2 పైసలు పెంచింది.

Advertisement

Also Read: Madurai-Rameswaram train: రైలులో టిక్కెట్ లేకుండా 300 మంది ప్రయాణం.. అధికారులు తనిఖీలు చేయగా.. పరుగో పరుగు..

గతంలో 2020 జనవరి 1న రైలు ఛార్జీలను పెంచారు. 2020లో ఆర్డినరీ, మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సెకండ్ క్లాస్ ఛార్జీలు వరుసగా కి.మీ.కు 1 పైసా, 2 పైసలు పెంచింది. స్లీపర్ తరగతులు, అన్ని ఏసీ తరగతుల ఛార్జీలు వరుసగా కి.మీ.కు 2 పైసలు, 4 పైసలు పెరిగాయి.

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×