Sankranti Special Trains: సంక్రాంతి పండుగ రద్దీ కారణంగా దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల మధ్య మరిన్ని ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. విశాఖ-విజయవాడ మధ్య 12 జన్ సాధారణ్(Unreserved) రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. అలాగే చర్లపల్లి-కాకినాడ టౌన్, చర్లపల్లి-తిరుపతి మధ్య అదనపు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.
జనవరి 12, 13, 14, 16, 17, 18 తేదీల్లో విశాఖ-విజయవాడ మధ్య జన్ సాధారణ్ రైళ్లు అందుబాటులో ఉంటాయి. విశాఖ-విజయవాడ జన్‌సాధారణ్ ఎక్స్‌ప్రెస్ ( రైలు నెం.08567) ను నిర్ణీత తేదీల్లో నడపనున్నారు. ఈ రైలు విశాఖలో ఉదయం 10 గంటలకు బయల్దేరి సాయంత్రం 4 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. విజయవాడ-విశాఖ రైలు (నెం.08568) విజయవాడలో సాయంత్రం 6.30 గంటలకు బయల్దేరి రాత్రి 12.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఏలూరు, గన్నవరం స్టేషన్లలో ఆగనున్నాయి.
1. రైలు నెం. 07480 – చర్లపల్లి టు కాకినాడ టౌన్ -జనవరి 19న
2. రైలు నెం.07481- కాకినాడ టౌన్ టు చర్లపల్లి – జనవరి 19న
చర్లపల్లి-కాకినాడ టౌన్-చర్లపల్లి స్పెషల్ ట్రైన్.. నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట స్టేషన్లలో రెండు వైపులా ఆగుతుంది. ఈ ట్రైన్ లో 1AC, 2AC, 3AC, స్లీపర్ క్లాస్ అందుబాటులో ఉన్నాయి.
1. రైలు నెం. 07482 – చర్లపల్లి టు తిరుపతి – జనవరి 18న
2. రైలు నెం.07483 – తిరుపతి టు చర్లపల్లి -జనవరి 18న
Also Read: హైదరాబాద్-విజయవాడ మధ్య 10 ప్రత్యేక రైళ్లు.. సగానికి పైగా జనరల్ బోగీలు
చర్లపల్లి-తిరుపతి-చర్లపల్లి స్పెషల్ ట్రైన్.. జనగాం, కాజీపేట, వరంగల్, కేసముద్రం, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో రెండు వైపులా ఆగుతుంది. ఈ ట్రైన్ లో 1AC, 2AC, 3AC, స్లీపర్ క్లాస్ అందుబాటులో ఉన్నాయి.