Samsung Galaxy S25 Ultra Discount| కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్స్‌లో S సిరీస్ ఫోన్లు ప్రీమియం ఫ్లాగ్‌షిప్ మోడల్స్. వీటిలో లేటెస్ట్‌గా S25 సిరీస్ ఫోన్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ సిరీస్‌లో గెలాక్సీ S25 అల్ట్రా హై ఎండ్ మోడల్. స్టైలస్ పెన్సిల్ సపోర్ట్‌తో వచ్చే ఈ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ లో మరింత అందుబాటు ధరలో లభిస్తోంది. శాంసంగ్ త్వరలో గెలాక్సీ S26 అల్ట్రా ఫిబ్రవరి 2026 లో లాంచ్ చేయనుంది. ఈ కారణంగానే ఇప్పుడు గెలాక్సీ S25 అల్ట్రా ధరను తగ్గించింది. ఈ పవర్‌ఫుల్ ఫోన్‌లో ప్రీమియం పర్‌ఫామెన్స్, అడ్వాన్స్ కెమెరాలు, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్ ఉన్నాయి. ఫ్లాగ్‌షిప్ ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలనుకుంటే ఇది సరైన సమయం.
గెలాక్సీ S25 అల్ట్రా 5G ఫ్లిప్‌కార్ట్‌లో గణనీయంగా తక్కువ ధరకు లభిస్తోంది. 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో రూ.1,29,999కి అమ్ముడైంది. ఇప్పుడు అదే మోడల్ రూ.1,07,990కి లభిస్తోంది. ఈ ఒక్క తగ్గింపు వల్ల రూ.22,009 ఆదా అవుతుంది. అదనంగా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్, SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే రూ.4,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తర్వాత ఎఫెక్టివ్ ధర రూ.1,03,990కి దిగివస్తుంది. ఈ ఫోన్ టైటానియం బ్లాక్, టైటానియం గ్రే, టైటానియం సిల్వర్‌బ్లూ, టైటానియం వైట్ సిల్వర్ అనే నాలుగు ప్రీమియం కలర్లలో లభిస్తుంది.
గెలాక్సీ S25 అల్ట్రాలో పెద్ద 6.9 ఇంచ్ డైనమిక్ LTPO AMOLED 2X డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. బయట ఎండలో కూడా స్పష్టంగా కనిపించేలా 2600 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. డిజైన్ చాలా ప్రీమియం, బలమైనది, దీర్ఘకాలిక వినియోగానికి అనుకూలంగా ఉంది. హై-క్వాలిటీ మెటీరియల్స్ ఉపయోగించారు.
గెలాక్సీ S25 అల్ట్రా లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్. గ్రాఫిక్స్ టాస్క్‌లకు అడ్రినో 830 GPU సహాయపడుతుంది. హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్, రోజువారీ యాప్‌లు స్మూత్‌గా రన్ అవుతాయి. ఫోన్ Android 15తో లాంచ్ అయింది. శాంసంగ్ ఈ ఫ్లాగ్‌షిప్‌కు ఏడు మేజర్ Android అప్‌డేట్స్ ఇస్తుంది. దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ సపోర్ట్, మంచి రీసేల్ వాల్యూ కూడా లభిస్తుంది.
గెలాక్సీ S25 అల్ట్రాలో వర్సటైల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 200MP ప్రైమరీ కెమెరా డీటెయిల్డ్ ఫోటోలు తీస్తుంది. 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంది. 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ల్యాండ్‌స్కేప్ షాట్స్‌కు సహాయపడుతుంది. 10MP టెలిఫోటో కెమెరా ఆప్టికల్ జూమ్‌కు ఉపయోగపడుతుంది. సెల్ఫీలకు 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. డేలైట్, లో-లైట్‌లో బాగా పని చేస్తాయి.
అడ్వాన్స్‌డ్ AI ఫీచర్లు, ఇమేజ్ ప్రాసెసింగ్ టూల్స్ ఉన్నాయి.
Also Read: మ్యూజికల్ లాలిపాప్.. నోట్లో పెట్టుకోగానే మ్యూజిక్ వినిపిస్తుంది.. ఇయర్‌బడ్స్ అవసరం లేదు
గెలాక్సీ S25 అల్ట్రా బలమైన బ్యాటరీ పనితీరు ఇస్తుంది. హెవీ యూజ్‌తో కూడా ఒక రోజు పూర్తిగా ఉపయోగించవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల ఛార్జింగ్ టైమ్ తక్కువగా ఉంటుంది. ప్రొఫెషనల్స్, గేమర్లు, కంటెంట్ క్రియేటర్లకు ఇది సరిపోతుంది. AI ఫీచర్లు ప్రొడక్టివిటీ, ఫోటోగ్రఫీని మెరుగుపరుస్తాయి.
గెలాక్సీ S25 అల్ట్రా ఇప్పటికీ ఫ్లాగ్‌షిప్ లెవల్ ఆండ్రాయిడ్ ఫోన్‌గా ఉంది. ఈ డిస్కౌంట్ వల్ల ఇది మరింత సరసమైన ధరకు వచ్చింది. ప్రీమియం కెమెరాలు, బలమైన పనితీరు, దీర్ఘకాలిక అప్‌డేట్స్ లభిస్తాయి. కొత్త ప్రాసెసర్ డిజైన్ అవసరం లేకపోతే ఈ ఫోన్ చాలా మంచి వాల్యూ ఇస్తుంది. ప్రస్తుత ధర తగ్గింపుతో ఈ ఫోన్ కొనడనాకి ఇదే బెస్ట్ ఆఫర్ గా చెప్పొచ్చు.