E-Paper
Advertisement

Secunderabad Railway Station: సంక్రాంతి వేళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్తున్నారా? అయితే, మీకో అలర్ట్!

Secunderabad Railway Station: సంక్రాంతి వేళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్తున్నారా? అయితే, మీకో అలర్ట్!
Advertisement

Secunderabad Railway Station Exit Changed: సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ భారీగా పెరగడంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు పలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా వాహనాల పార్కింగ్ ప్రాంతం, స్టేషన్ నుంచి బయటకు వెళ్లే మార్గాలను మార్చుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఉన్న మార్గంలో కాకుండా, ప్రస్తుతం ప్రయాణికులు ప్లాట్‌ ఫారమ్ నంబర్ 10 వైపు నుంచి ఎగ్జిట్ కావాల్సి ఉంటుందని తెలిపారు. ఈ మార్పుల గురించి ముందుగానే తెలుసుకుని సహకరించాలని ప్రయాణికులను కోరారు.

రైల్వే స్టేషన్లకు పోటెత్తిన ప్రయాణీకులు

స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో సికింద్రాబాద్‌తో పాటు కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో నిండిపోయాయి. ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి సహా ఏపీకి వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. సంక్రాంతి రద్దీ నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పటికే 150 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రద్దీ కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్టేషన్ పరిసరాల్లో రైల్వే భద్రతా సిబ్బందిని పెంచారు.

తాత్కాలిక హాల్ట్ లు ఏర్పాటు చేసిన అధికారులు

Advertisement

సికింద్రాబాద్ స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు రైల్వే అధికారులు  కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 7 నుంచి 20 వరకు సుమారు 27 ఎక్స్‌ ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీ, చర్లపల్లి స్టేషన్లలో తాత్కాలిక హాల్ట్‌ లు ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయంతో ఐటీ  ఉద్యోగులు సికింద్రాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా తమకు సమీపంలోని స్టేషన్ల నుంచే రైలు ఎక్కే అవకాశం ఉంది.  ప్రయాణికులకు సమయం ఆదా చేయడంతో పాటు ప్రధాన స్టేషన్లలో రద్దీని భారీగా తగ్గించనుంది.

రైల్ వన్ లో టికెట్లు బుక్ చేసుకుంటే 3 శాతం రాయితీ!

అటు పండుగ సమయంలో టికెట్ కౌంటర్ల దగ్గర భారీ క్యూలను నివారించేందుకు రైల్వే శాఖ డిజిటల్ సేవలను ప్రోత్సహిస్తోంది. అన్‌ రిజర్వ్‌డ్ టికెట్లు తీసుకునే ప్రయాణికులు రైల్ వన్  మొబైల్ యాప్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే 3 శాతం వరకు రాయితీ పొందవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. అలాగే స్టేషన్‌లో మారిన పార్కింగ్, ఎగ్జిట్ మార్గాల కారణంగా ప్రయాణికులు తమ రైలు సమయానికి కనీసం గంట ముందుగానే స్టేషన్‌కు చేరుకోవడం మంచిదని సూచించారు.

Advertisement

Read Also:  రైల్వే పాస్ ను UTS నుంచి RailOneకు మార్చుకోవాలా? సింపుల్ గా ఇలా చేస్తే చాలు!

ప్రయాణీకులకు అధికారుల అలర్ట్

అటు పండుగ వేళ రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో ప్రయాణికులు తమ లగేజీ, విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రైల్వే అధికారులు సూచించారు. పరిసరాల్లో ఏవైనా అనుమానాస్పద వస్తువులను, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే భద్రతా సిబ్బందికి చెప్పాలన్నారు. సంక్రాంతి ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగేందుకు తీసుకుంటున్న ఈ ఏర్పాట్లను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.

Read Also:  సంక్రాంతికి మరో రెండు ప్రత్యేక రైళ్లు, గుడ్ న్యూస్ చెప్పిన సౌత్ సెంట్రల్ రైల్వే!

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×