E-Paper
Advertisement

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టు.. స్విస్ విమానానికి తప్పిన ప్రమాదం, ఆరుగురికి గాయాలు

Delhi Airport: ఢిల్లీ ఎయిర్‌పోర్టు.. స్విస్ విమానానికి తప్పిన ప్రమాదం, ఆరుగురికి గాయాలు
Advertisement

Delhi Airport: ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి జ్యూరిచ్ వెళ్లాల్సిన స్విస్ ఎయిర్‌లైన్స్ విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఫలితంగా టేకాఫ్ రద్దు చేసుకుంది. ఫలితంగా విమానాన్ని అత్యవసరంగా ఖాళీ చేయిస్తుండగా ఆరుగురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. అసలు ఏమి జరిగింది?

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో స్విస్ విమానానికి తప్పిన ప్రమాదం

Advertisement

ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి జూరిచ్‌కు వెళ్తున్న స్విస్ విమానం ఇంజన్లలో సమస్యలు తలెత్తాయి. ఫలితంగా టేకాఫ్‌ను రద్దు చేసుకుంది ఆ విమానం. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అర్ధరాత్రి 1.08 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. LX147 విమానం రన్‌వేపై టేకాఫ్ కోసం వెళ్తుండగా ఇంజిన్‌లో సమస్యను గుర్తించారు అందులోని సిబ్బంది. వెంటనే టేకాఫ్‌ను నిలిపి వేసి విమానాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించారు. ఆ సమయంలో విమానంలో దాదాపు 232 మంది ప్రయాణికులు ఉన్నారు.

Advertisement

టేకాఫ్‌ను రద్దు చేసిన విమానం.. , ఆరుగురు ప్రయాణికులకు గాయాలు

అందులో నలుగురు చిన్నారులతోపాటు సిబ్బంది ఉన్నారు. చివరకు ప్రయాణికులను ఎమర్జెన్సీ గేటు ద్వారా కిందకు దించారు. ఈ ప్రక్రియలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటనపై స్విస్ ఎయిర్‌లైన్స్ ఓ ప్రకటన చేసింది. ఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

విమానాన్ని పరిశీలించేందుకు ఢిల్లీకి సాంకేతిక నిపుణుల బృందాన్ని పంపుతున్నామని పేర్కొంది. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, హోటల్ వసతి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలియజేసింది. ప్రయాణీకులు, సిబ్బంది భద్రత మాకు ఎల్లప్పుడూ ప్రథమ ప్రాధాన్యత అని అందులో పేర్కొంది.

ALSO READ: ఏసీ కోచ్‌లో చెత్త టాయిలెట్లు, రైల్వేకు భారీ జరిమానా!

 

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×