E-Paper
Advertisement

జస్ట్ రూ. 21 లక్షల్లోనే టాటా లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సు, పోటీ కంపెనీలకు చుక్కలే!

జస్ట్ రూ. 21 లక్షల్లోనే టాటా లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సు, పోటీ కంపెనీలకు చుక్కలే!
Advertisement

Tata Intercity EV 2.0 Luxury Electric Bus Launch: టాటా మోటార్స్ సరికొత్త ఎలక్ట్రిక్ బస్సును డెవలప్ చేస్తోంది. ఇంటర్‌సిటీ EV 2.0 పేరుతో ఆధునిక లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సును తయారు చేస్తోంది. సుదూర ప్రయాణాలకు అనువుగా, ప్రయాణికులకు అత్యాధునిక సౌకర్యం, భద్రతను అందించేలా రూపొందిస్తోంది. పర్యావరణానికి హాని తగ్గించేలా ఈ బస్సు పూర్తిగా ఎలక్ట్రిక్ టెక్నాలజీపై పని చేస్తుంది.

ఒకే ఛార్జ్ తో 400 కి.మీ ప్రయాణం

ఈ బస్సులో 450 kWh సామర్థ్యం ఉన్న పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 400 కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుంది. ఇది ఇంటర్‌ సిటీ ప్రయాణాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే, ఒకే ఛార్జ్‌ తో ఎక్కువ దూరం వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ బస్సు ఛార్జింగ్ వ్యవస్థ కూడా వేగంగా పని చేస్తుంది. కేవలం 2 గంటల్లోనే పూర్తిగా ఛార్జ్ అయ్యే సామర్థ్యం ఉంది. ట్రావెల్ ఆపరేటర్లకు సమయాన్ని ఆదా చేస్తుంది. ఇక ఈ బస్సు పనితీరును పరిశీలిస్తే..  335 హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 864 Nm టార్క్‌ ను అందిస్తుంది. ఈ శక్తివంతమైన పనితీరు వల్ల బస్సు హైవేల్లో సాఫీగా, స్థిరంగా ప్రయాణిస్తుంది. భారీగా బరువు ఉన్నప్పటికీ మంచి వేగం, నియంత్రణను కలిగి ఉంటుంది.

బస్సులో మొత్తం 47 సీట్లు

Advertisement

ఇక ఈ ఎలక్ట్రిక్ బస్సు సీటింగ్ ఏర్పాట్ల విషయానికొస్తే, ఇందులో మొత్తం 47 సీట్లు ఉన్నాయి. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని పుష్ బ్యాక్ సీట్లు ఏర్పాటు చేశారు. ప్రతి సీటుకు మొబైల్ హోల్డర్, స్నాక్ ట్రే లాంటి సదుపాయాలు  ఉన్నాయి. దీని వల్ల సుదూర ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా కొనసాగుతాయి.

అత్యాధునిక భద్రతా వ్యవస్థ

భద్రత పరంగా ఈ బస్సులో అత్యాధునిక ADAS 2.0 ఫీచర్లు ఉన్నాయి. సుమారు 20 రకాల సేఫ్టీ అసిస్టెంట్ ఫీచర్లు డ్రైవర్‌ కు అసిస్ట్ చేస్తాయి. డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇది డ్రైవర్ అలసటను గుర్తించి హెచ్చరిస్తుంది. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్, స్టెబిలిటీ కంట్రోల్ టెక్నాలజీ కూడా ఉన్నాయి. ఇవి ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయి.

ధర ఎంత అంటే?

Advertisement

ధర విషయానికి వస్తే.. ఈ లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సు సుమారు రూ. 21 లక్షల (ఎక్స్ షోరూమ్)తో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫీచర్లతో అందుబాటులో ఉన్న బస్సుల ధరకు ఒక్కోదానికి ఏకంగా రూ. 1 కోటికి పైగా ఉంది. కానీ, టాటా నుంచి అత్యంత చౌకగా ఈ ఎలక్ట్రిక్ బస్సు విడుదల కాబోతోంది. మొత్తంగా టాటా ఇంటర్‌సిటీ EV 2.0 ఆధునిక, పర్యావరణ హితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించే ప్రీమియం ఎలక్ట్రిక్ బస్సుగా గుర్తింపు తెచ్చుకోబోతోంది. అధునాతన టెక్నాలజీ, శక్తివంతమైన పనితీరు, ప్రయాణికుల సౌకర్యం కారణంగా భవిష్యత్తు రవాణా రంగంలో ముఖ్యమైన మైలురాయిగా మారనుంది.

Read Also: సీఎన్జీ వాడితే నిజంగా మనీ సేవ్ అవుతుందా? ఇదీ అసలు కథ!

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×