SWR Special Trains: ప్రయాణీకులకు ఇబ్బందులు కలగకుండా రైల్వే అధికారులు ఎప్పటికప్పడు కీలక చర్యలు తీసుకుంటున్నారు. రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు అందులో భాగంగానే సౌత్ వెస్ట్రన్ రైల్వే (SWR) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ (ఆగస్టు 5న) కీలక మార్గాల్లో అదనపు రైలు సర్వీసులను నడిపిస్తున్నట్లు తెలింది. ఈ మేరకు ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో కీలక నిర్ణయం
ఆగస్టు 5 నుంచి కర్ణాటకలోని నాలుగు ప్రభుత్వ రవాణా సంస్థల ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండటానికి ఎంపిక చేసిన మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు బెంగళూరు డివిజన్ రైల్వే అధికారులు తెలిపారు. సాధారణ బస్సు సర్వీసులు లేకపోవడం వల్ల ప్రభావితమైన ప్రయాణికులకు సేవలు అందించేందుకు అదనపు రైలు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు SWR సీనియర్ అధికారులు తెలిపారు. ఆగస్టు 5న SWR ప్రకటించిన ప్రత్యేక రైలు సర్వీసుల్లో తుమకూరు (TK)-KSR బెంగళూరు (SBC), KSR బెంగళూరు- మైసూరు (MYS), బెంగళూరు కంటోన్మెంట్ (BNC)- బంగారుపేట (BWT)తో పాటు KSR బెంగళూరు౦౦ సత్య సాయి ప్రశాంతి నిలయం (SSPN) మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు తెలిపారు. “ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రోజువారీ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఈ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. ప్రజా రవాణాకు ఎలాంటి సమస్యలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. అదనపు రైల్వే సేవనలు వినియోగించుకోవాలని ప్రయాణీకులను కోరుతున్నాం” అని SWR అధికారులు తెలిపారు.
Additional special train services have been arranged between
1) Tumakuru(TK)- KSR Bengaluru (SBC)
2) KSR Bengaluru – Mysuru (MYS)
3) Bengaluru Cantonment (BNC) – Bangarapet (BWT)
4) KSR Bengaluru – Satya Sai Prashanti Nilayam (SSPN)
on 05.08.2025: #SWRupdates pic.twitter.com/Pm4KjzhqCD— DRM Bengaluru (@drmsbc) August 4, 2025
ఇవాళ్టి నుంచి ఆర్టీసీ కార్మికుల నిరవధిక సమ్మె
కర్ణాటక హైకోర్టు సమ్మెను కనీసం ఒక రోజు వాయిదా వేయాలని ఆదేశించినప్పటికీ, KSRTC, BMTC, NWKRTC, KKRTC ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) సమ్మెను కొనసాగించింది. వేతనాల పెంపు, బకాయిల పరిష్కారం లాంటి డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ కారార్మిక యూనియన్లు వెల్లడించాయి. ఆగస్టు 4న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రవాణా మంత్రి రామలింగారెడ్డితో జరిగిన చివరి రౌండ్ చర్చలు ఎటువంటి పురోగతిని సాధించకుండానే ముగిశాయి.
అదే సమయంలో కర్ణాటకలో బస్సు సేవలను నిర్వహించడానికి రవాణా శాఖ ప్రైవేట్ బస్సు ఆపరేటర్లను తీసుకువచ్చింది. కర్ణాటక రాష్ట్ర ప్రైవేట్ రవాణా సంఘాల సమాఖ్య అదనపు బస్సులను నడపడానికి అంగీకరించింది. కొన్ని జిల్లాల్లో సర్వీస్ అంతరాలను తగ్గించడానికి స్కూల్స్, ఇతర పారిశ్రామిక బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. సర్కారు తీరును నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు మరింత బలంగా సమ్మె కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులను సమ్మె విరమించేలా చేయాల్సిన ప్రభుత్వం, పుండు మీద కారం చల్లనిట్లు వ్యవహరిస్తోంది విమర్శలు వస్తున్నాయి. ప్రైవేటు బస్సు ఆపరేట్లను రంగంలోకి దించడంపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: బెట్, ఈ బనానాను ఒక్కరే తినలేరు.. చరిత్రలో అత్యంత పెద్ద అరటి పండు పొడవు ఎంతో తెలుసా?