Biggest Banana: ప్రపంచంలో చాలా మంది ఇష్టపడే పండ్లలో అరటిపండు ఒకటి. తియ్యగా, తినడానికి తేలికగా ఉంటాయి. చాలా మందికి నచ్చుతాయి. అరటి పండు సాధారణంగా చిన్నగా ఉంటాయి. ఒక్కరు రెండు, మూడు పండ్ల వరకు తినవచ్చు. కానీ, ప్రపంచంలోనే అతిపెద్ద అరటి పండు గురించి మీకు తెలుసా? దాని పేరు ఏంటో తెలుసా? ఇంతకీ అది ఎంత పొడవు ఉంటుందంటే..
ప్రపంచంలోనే అతిపెద్ద అరటి పండు ముసా ఇంజెన్స్
ముసా ఇంజెన్స్ అరటి పండు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అరటిపండు. దీనిని జెయింట్ హైలాండ్ బనానా అని కూడా పిలుస్తారు. ఇది అతిపెద్ద రకం అరటి మొక్క. న్యూ గినియాలోని ఉష్ణమండల అడవులలో పెరుగుతుంది. సూడోస్టెమ్ అని పిలువబడే ఈ మొక్క కాండం ఏకంగా 15 మీటర్ల వరకు పెరుగుతుంది. అంటే ఐదు అంతస్తుల భవనం పొడవు అన్నమాట, ఆకులు కూడా ఒక్కోటి 20 మీటర్ల వరకు విస్తరించి ఉంటాయి. ఈ మొక్క నుంచి వచ్చే అరటిపండ్లు దుకాణాలలో దొరికే వాటిలా ఉండవు. ఒకే గుత్తిలో దాదాపు 300 అరటిపండ్లు ఉంటాయి. 60 కేజీల బరువు ఉంటుంది. ప్రతి అరటిపండు దాదాపు 18 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. కొన్ని 30 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి.
రికార్డు సృష్టించిన అరటిపండ్ల గుత్తి
ఇప్పటి వరకు గుర్తించిన అతిపెద్ద అరటిపండ్ల గుత్తి స్పెయిన్ లోని కానరీ దీవులలో కబానా SA, టెకోరోన్ SL మొక్కలకు ఏర్పడ్డాయి. ఈ గుత్తిలో 473 అరటిపండ్లు ఉన్నాయి. ఒక్కో గుత్తి 130 కేజీలు ఉంది. దీనిని జూలై 11, 2001లో పండించారు. ఇది అతిపెద్ద అరటిపండ్ల గుత్తిగా ప్రపంచ రికార్డును కలిగి ఉంది.
ఈ అరటిపండ్లు ఎందుకు అంత పెద్దవి?
ముసా ఇంజెన్స్ చాలా వర్షం, వెచ్చని వాతావరణంతో ప్రత్యేక ప్రదేశంలో పెరుగుతుంది. ఈ వాతావరణం ఆ చెట్టు పెద్దదిగా పెరగడానికి సాయపడుతుంది. స్పెయిన్ లో పెరిగిన అతిపెద్ద అరటి గెలను మంచి నేల, సరైన వాతావరణంతో పెంచారు. అరటిపండ్లు బలంగా, ఆరోగ్యంగా పెరిగేలా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.
Read Also: అమ్మాయికి అచ్చుగుద్దినట్లు తండ్రి పోలికలు.. అదెలా సాధ్యం?
పెద్ద అరటిపండ్ల గురించి ఆసక్తికర విషయాలు
ముసా ఇంజెన్స్ అరటిపండ్లు పెద్దవిగా ఉంటాయి. రుచి భిన్నంగా ఉంటాయి. వీటిని సాధారణ దుకాణాల్లో కొనలేరు. ఇవి మారుమూల అడవులలో పెరుగుతాయి. 130 కిలోల అరటిపండ్ల గుత్తిని తీసుకెళ్లడానికి ముగ్గురు, నలురుగు మనుషులు అవసరం అవుతారు. మొత్తంగా ముసా ఇంజెన్స్ అరటిపండ్లలో రాజుగా పిలుస్తారు. భారీ మొక్కలు, బరువైన గుత్తులతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సో, ఇకపై మిమ్మల్ని ఎవరైనా ప్రపంచంలోనే అతిపెద్ద అరటి పండు గురించి అడిగితే, వెంటనే ముసా ఇంజెన్స్ బనానా అని చెప్పేయండి! అది ఎంత పెద్దదో కూడా వివరించే ప్రయత్నం చేయండి!
Read Also: బీరు తాగుతూ పరుగు పందెం.. ఏం ఫీల్ ఉంది మామా!