E-Paper
Advertisement

రైల్వే ట్రాక్ పై మూడు మృతదేహాలు.. ఏకంగా 80 రైళ్లు రద్దు!

రైల్వే ట్రాక్ పై మూడు మృతదేహాలు.. ఏకంగా 80 రైళ్లు రద్దు!
Advertisement

Mumbai Railway Disruption: ముంబైలో సెంట్రల్ రైల్వే సబర్బన్ మార్గంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. రైల్వే ట్రాక్ పై మృతదేహాలు,  కంజుర్‌మార్గ్‌లోని సిగ్నలింగ్ గదిలో అగ్నిప్రమాదం,  ములుంద్‌-థానే మధ్య ఓవర్‌హెడ్ విద్యుత్ వైర్‌ లో లోపంతో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. సుమారు 80 సబర్బన్ రైలు సర్వీసులను రద్దు చేయగా, మరికొన్ని రైళ్లు 90 నిమిషాల వరకు ఆలస్యంగా నడిచాయి. దీంతో వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సిగ్నలింగ్ గదిలో మంటలు.. నిలిచిపోయిన రైళ్లు

సోమవారం ఉదయం 9.30 గంటల సమయంలో కంజుర్‌మార్గ్‌ లోని సిగ్నలింగ్ రిలే గదిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో 24 సిగ్నళ్లు పనిచేయలేదు. కంజుర్‌మార్గ్, భాండూప్, విక్రోలి ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు, ములుంద్‌-థానే మధ్య ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలపై ఓ ఇనుప తీగ పడటంతో డౌన్ లైన్‌లోని ఇన్సులేటర్ దెబ్బతింది. ఈ రెండు ఘటనలు రైల్వే సేవలపై ప్రభావం చూపాయి. సిగ్నలింగ్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో భద్రతా నిబంధనల ప్రకారం రైళ్లను నెమ్మదిగా నడపాల్సి వచ్చింది.

ట్రాక్‌లపై నడిచిన ప్రయాణికులు

Advertisement

రైళ్లు ఆలస్యంగా నడవడంతో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ పెరిగిపోయింది. కొన్ని రైళ్లు దాదాపు 30 నిమిషాల పాటు నిలిచిపోగా, మరికొన్ని గంటకు పైగా ఆలస్యమయ్యాయి. దీంతో కొందరు ప్రయాణికులు రైళ్ల నుంచి దిగి సమీప స్టేషన్లకు చేరుకునేందుకు పట్టాల వెంట నడిచారు.

ట్రాక్‌లపై ముగ్గురి మృతదేహాలు

ఈ అంతరాయాల మధ్య భాండూప్ స్టేషన్‌లో సాహిల్ థైట్ (21) అనే యువకుడు రైలు ఢీకొని మృతి చెందాడు. ములుంద్ కాలనీకి చెందిన అతను సాయంత్రం 5.39 గంటలకు ప్లాట్‌ఫామ్ 4 నుంచి ప్లాట్‌ఫామ్ 2కు వెళ్లేందుకు పట్టాలు దాటుతుండగా ఏసీ లోకల్ రైలు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. అటు ఘట్‌కోపర్‌-విక్రోలి మధ్య ట్రాక్‌లపై మరో ఇద్దరి మృతదేహాలు గుర్తించారు. మోటర్‌ మెన్లు వాటిని గుర్తించినట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ ఇద్దరు ఎవరు అనే అంశంపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సాహిల్ మృతిని పోలీసులు ప్రమాదవశాత్తు మరణంగా కేసు నమోదు చేశారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. రైళ్ల అంతరాయాలకు, అతను పట్టాలు దాటడానికి మధ్య సంబంధం ఉందా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

దశలవారీగా పునరుద్ధరించిన సేవలు

Advertisement

రైల్వే సిబ్బంది మరమ్మతులు చేపట్టి సర్వీసులను దశలవారీగా పునరుద్ధరించారు. సాయంత్రం 4.10 గంటలకు ఒక లైన్‌ను, 4.46 గంటలకు అప్ త్రూ లైన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. డౌన్ స్లో లైన్‌ను 5.30 గంటలకు, అప్ స్లో లైన్‌ను 6.18 గంటలకు పునరుద్ధరించారు. సిగ్నలింగ్ రూమ్ లో అగ్నిప్రమాదానికి కచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు సెంట్రల్ రైల్వే విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే ప్రమాదానికి గల అసలు కారణం వెల్లడికానుంది.

Read Also: నీలగిరి మౌంటైన్ రైల్వే అలర్ట్.. మెట్టుపాళయం–ఊటీ రైళ్లు రద్దు, ఎందుకంటే?

Tags

Related News

బుల్లెట్ రైలు ప్రయాణానికి ముహూర్తం ఖరారు.. రైల్వే మంత్రి ఏమన్నారంటే!

అమెరికాలో అట్టహాసంగా బతుకమ్మ, దసరా వేడుకలు.. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు!

మన ఆటోను వదల్లేకపోయారు.. ఏకంగా సముద్రం దాటించి బ్రిటన్‌కు తీసుకెళ్లారు!

సరదాగా వదిలిన కుందేళ్లు.. ఒక దేశాన్నే ఎలా ముంచేశాయో తెలుసా?

నో సిగ్నల్స్, నో వెహికల్స్.. అయినా ఈ ద్వీపానికి పర్యాటకుల క్యూ.. అసలు ఏముందిక్కడ?

నీలగిరి మౌంటైన్ రైల్వే అలర్ట్.. మెట్టుపాళయం–ఊటీ రైళ్లు రద్దు, ఎందుకంటే?

పారిస్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇండియన్ ఎంబసీ ఏం చెప్పిందంటే?

Big Stories

Advertisement
×