E-Paper
Advertisement

కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసింది హరీష్ రావే..! – ఎంపీ చామల

కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసింది హరీష్ రావే..! – ఎంపీ చామల
Advertisement

Chamala Kiran: కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోవడంపై నిజాన్ని మాట్లాడితే మాజీ మంత్రి హరీష్ రావుకు ఎక్కడ లేని కోపం వస్తోందని భువనగిరి లోక్‌సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లోని నీటి మట్టాల గురించి తాము వాస్తవాలు మాట్లాడితే.. తట్టుకోలేక బిఆర్‌ఎస్ నాయకులు దుష్ప్రచారానికి దిగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు.

బిఆర్ఎస్ దుష్ప్రచారం..

Advertisement

మేడిగడ్డ బ్యారేజ్ నుంచి రోజూ 20 వేల క్యూసెక్కుల నీళ్లు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయని బిఆర్‌ఎస్ నాయకులు పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఎంపీ చామల విమర్శించారు. బిఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయి, దెబ్బతిన్న విషయం తెలంగాణ ప్రజలందరికీ స్పష్టంగా తెలుసన్నారు. మేడిగడ్డ వద్ద గతంలో నీళ్లు లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు, ఇప్పుడు కూడా ఆ అవకాశం లేకుండా పోయిందని స్పష్టం చేశారు. అయితే దేవాదుల, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా పంపులు నిరంతరాయంగా నడుస్తున్నాయనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.

హరీష్ రావు పాపమే గోదావరి నీళ్ల జారవిడుపు

Advertisement

హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో చేసిన దరిద్రపు పనుల వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు కాస్తా కూలేశ్వరం గా మారిందని కిరణ్ రెడ్డి విమర్శించారు. గోదావరి నీళ్లన్నీ కిందకు జారిపోవడానికి, ప్రాజెక్టు ఈ దుస్థితికి చేరడానికి కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అక్రమాలే కారణమని ఆయన దుయ్యబట్టారు.

కాళేశ్వరం అంటే హరీష్ రావుకు ఎందుకంత కోపం?

కాళేశ్వరం పేరు వినగానే లేదా మేడిగడ్డ గురించి మాట్లాడగానే హరీష్ రావుకు కోపం రావడం వెనుక ఆయన తప్పులే కారణమని, తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Also Read: గ్రీన్‌ఫీల్డ్ హైవేపై గ్రానైట్ లారీ బీభత్సం.. క్యాబిన్‌పై పడిన భారీ గ్రానైట్ రాళ్లు, డ్రైవర్ మృతి!

Tags

Related News

అమీర్ అలీ ఖాన్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలంటూ డిమాండ్.. గాంధీభవన్ వద్ద పోస్టర్లు

హైదరాబాద్‌లో విషాదం.. దుర్గం చెరువులో దూకి వైజాగ్ టెక్కీ ఆత్మహత్య

క్యాప్.. ఆ స్టూడెంట్ ప్రాణాలు తీసింది.. హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం, ఎలా జరిగింది?

గ్రీన్‌ఫీల్డ్ హైవేపై గ్రానైట్ లారీ బీభత్సం.. క్యాబిన్‌పై పడిన భారీ గ్రానైట్ రాళ్లు, డ్రైవర్ మృతి!

ఉద్యోగం పేరుతో నమ్మించి రిసార్ట్ కు తీసుకెళ్లి… ఘట్కేసర్‌లో దారుణం!

బండ్లగూడలో విషాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనుమానాస్పద మృతి!

వేగంగా దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. అర్ధరాత్రి నుంచి ఏపీలో భారీ వర్షాలు, తెలంగాణలో మారిన వాతావరణం

Big Stories

Advertisement
×