E-Paper
Advertisement

iPhone Duo స్క్రీన్ క్రాక్స్ మిస్టరీ వీడింది.. రిపేర్ చేయడం కూడా చాలా కష్టమని తేల్చేసిన నిపుణులు!

iPhone Duo స్క్రీన్ క్రాక్స్ మిస్టరీ వీడింది.. రిపేర్ చేయడం కూడా చాలా కష్టమని తేల్చేసిన నిపుణులు!
Advertisement

iPhone Foldable Screen Cracks: ప్రముఖ అమెరికా దిగ్గజం యాపిల్ నుంచి వచ్చిన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ ఐఫోన్ డ్యూయోపై టెక్ ప్రపంచంలో ప్రస్తుతం ఒకటే చర్చ నడుస్తోంది. ఇప్పుడు iFixit టీమ్ ఈ ఫోన్‌ను పూర్తిగా విడదీసి లోపల ఏముందో బయటపెట్టింది. ఫోన్ మడతపెట్టే దగ్గర స్క్రీన్ ఎందుకు పగిలిపోతుందనే మిస్టరీకి చాలావరకు సమాధానం దొరికింది. అదే సమయంలో ఈ ఫోన్‌ను రిపేర్ చేయడం ఎంత కష్టమో కూడా క్లియర్ చేశారు.

క్రీజ్ మాయం చేసే ట్రిక్..

ఫోన్‌ను సగానికి మడతపెట్టినప్పుడు మధ్యలో గీత లేదా మడత పడిన గుర్తులు ఎక్కువగా కనిపిస్తాయి. దీన్ని కవర్ చేయడానికి యాపిల్ చాలా పెద్ద కసరత్తే చేసింది. ఫోన్ లోపల ఉండే హింజ్ డిజైన్‌లో చిన్న చిన్న రౌండ్ గైడ్స్‌ను అమర్చారు. మనం ఫోన్ ఓపెన్ చేసినప్పుడు అవి లోపలికి వెళ్తాయి, క్లోజ్ చేసినప్పుడు బయటకు వస్తాయి. అంతేకాకుండా.. మధ్యలో ఉండే పిక్సెల్స్‌ను కూడా ఒక ప్రత్యేకమైన డిజైన్‌లో అడ్జస్ట్ చేసి, ఆ మడత అసలు బయటికి కనిపించకుండా యాపిల్ చాలా జాగ్రత్తలు తీసుకుంది.

Advertisement

Also Read: తక్కువ నెట్‌తో హై-క్లారిటీ వీడియోస్.. యూట్యూబ్ తీసుకొస్తున్న కొత్త టెక్నాలజీ ఇదే!

స్క్రీన్ పగిలేదెందుకు?

మధ్యలో ఉండే ఆ సపోర్ట్ బార్ ఒక్కోసారి సరిగ్గా కిందికి వెళ్లకపోవడమే ఈ ప్రాబ్లమ్‌కి అసలు కారణం అని తేలింది. iFixit రిపేర్ స్టోర్ దీనికి సంబంధించి కొన్ని సీటీ స్కాన్‌లు, 3డీ మోడల్స్ తయారు చేసి చూశారు. ఫోన్ మడతపడే సమయంలో ఆ సెంటర్ బార్ సరిగ్గా అడ్జస్ట్ కాకపోతే.. స్క్రీన్ మీద విపరీతమైన ప్రెజర్ పడి పగుళ్లు వస్తున్నాయని గుర్తించారు. ఇదొక పెద్ద డిజైన్ లోపంగా కనిపిస్తోంది.

ధూళి పడితే అంతే సంగతులు..

Advertisement

ఈ ఫోన్‌కు ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ ఉందని కంపెనీ చెప్పినప్పటికీ.. చిన్న చిన్న ఇసుక రేణువులు లేదా దుమ్ము ఆ హింజ్ మెకానిజం లోపలికి వెళ్లే అవకాశం ఉంది. ఒకసారి దుమ్ము లోపలికి వెళ్తే ఫోన్ మడతపెట్టేటప్పుడు గలగలా శబ్దాలు రావడం, స్క్రీన్‌పై పచ్చటి గీతలు రావడం జరుగుతుంది. లోపలి పార్ట్స్ సేఫ్‌గా ఉన్నా, ఆ మడతపెట్టే భాగంలో మాత్రం దుమ్ము నుంచి పూర్తి రక్షణ దొరకడం లేదని తెలుస్తోంది.

రిపేర్ చాలా కష్టం..

ఈ ఫోన్ లోపల ఉండే బ్యాటరీస్, బయటి స్క్రీన్ మార్చడం పెద్ద కష్టమేం కాదు. కానీ లోపలి మెయిన్ డిస్‌ప్లే, ఆ హింజ్ సిస్టమ్‌ను మార్చడం మాత్రం చాలా పెద్ద టాస్క్. అందుకే ఈ ఫోన్ రిపేరబిలిటీ స్కోర్‌కు పదికి ఐదు మాత్రమే ఇచ్చారు. భవిష్యత్తులో ఈ ఫోన్ కొనేవారు లేదా వాడేవారు కచ్చితంగా యాపిల్ కేర్ తీసుకోవడం మంచిది. లేదంటే స్క్రీన్ రిపేర్ ఖర్చు తలకు మించిన భారమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read: ఒప్పో నుంచి మరో మాస్టర్‌పీస్.. Find X10 సిరీస్ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి!

Tags

Related News

చివరకు ఆ కోరిక తీరిందిగా.. అద్భుతమైన ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో Apple iPad Mini వచ్చేసింది!

ఈ గూగుల్ సెట్టింగ్ ఆఫ్‌ చేశారా? లేదంటే మీ పర్సనల్ డేటా టార్గెటెడ్ యాడ్స్ పరం అయినట్టే!

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ 5 తప్పులు చేస్తే.. ఆర్థికంగా సర్వనాశనమే!

సైబర్ నేరగాళ్లు వాట్సాప్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అసలు కారణాలు ఇవే!

బిఏ కుర్రాడి అద్భుతం.. యూట్యూబ్ చూసి ఎగిరే కారు ఆవిష్కరణ.. యావత్ దేశమే షాక్!

సినిమా థియేటర్‌ను ఇంటికే తెచ్చుకోండి..రూ.5వేలలోపే బెస్ట్ ప్రొజెక్టర్లు

ఆన్‌లైన్ క్లాసులు,ఆఫీస్ వర్క్ కోసం ఏసర్ క్రోమ్‌బుక్ లాంచ్- ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×