E-Paper
Advertisement

బుల్లెట్ రైలు ప్రయాణానికి ముహూర్తం ఖరారు.. రైల్వే మంత్రి ఏమన్నారంటే!

బుల్లెట్ రైలు ప్రయాణానికి ముహూర్తం ఖరారు.. రైల్వే మంత్రి ఏమన్నారంటే!
Advertisement

India Bullet Train Launch Date: దేశంలో బుల్లెట్ రైలు ప్రయాణం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న ప్రశ్నకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక విషయం చెప్పారు. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య నిర్మిస్తున్న హైస్పీడ్ రైలు ప్రాజెక్టును వచ్చే ఏడాది ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు. అయితే, ప్రారంభానికి సంబంధించి కచ్చితమైన తేదీని మాత్రం ఆయన ప్రకటించలేదు. తాజాగా ఓ జాతీయ మీడియా సంస్థ సమ్మిట్ లో పాల్గొన్న ఆయన.. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురైన సవాళ్లు, పనుల్లో జాప్యానికి గల కారణాలను వివరించారు.

డిజైన్ పనులకే రెండేళ్ల సమయం..

బుల్లెట్ రైలు ప్రాజెక్టు నిర్మాణం సాధారణ రైల్వే పనుల్లా ఉండదని అశ్విని వైష్ణవ్ చెప్పుకొచ్చారు. ఇందులో ఉపయోగించే సాంకేతికత, నిర్మాణ పద్ధతులు ఎంతో సంక్లిష్టంగా ఉంటాయని చెప్పారు. ప్రాజెక్టు డిజైన్‌ను పూర్తి చేయడానికి సుమారు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం పట్టిందని వివరించారు. 2017లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగ్గా, 2021లో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. డిజైన్ ప్రక్రియతో పాటు కరోనా మహమ్మారి కూడా పనుల వేగాన్ని ప్రభావితం చేసిందని మంత్రి చెప్పుకొచ్చారు.

మహారాష్ట్రలో అనుమతులతో జాప్యం

Advertisement

మహారాష్ట్రలో బుల్లెట్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించిన అనుమతులు కూడా ఆలస్యానికి కారణమయ్యాయని అశ్విని వైష్ణవ్ తెలిపారు. అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే హయాంలో ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ముందుకు సాగడంలో సమస్యలు ఎదురయ్యాయని చెప్పారు. మొత్తం ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు లభించే వరకు నిర్మాణం ప్రారంభించేందుకు జపాన్ అంగీకరించలేదని ఆయన వివరించారు. ఈ కారణాలతో పనులు ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుతం ప్రాజెక్టు ముందుకు సాగుతోందని తెలిపారు. జాప్యానికి ఏ ఒక్కరినో బాధ్యులుగా చేయడం సరికాదని మంత్రి అభిప్రాయపడ్డారు.

జపాన్ ఇంజినీర్ల ప్రశంసలు

భారత్‌-జపాన్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు కీలక భాగస్వామ్యంగా నిలిచింది. ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న జపాన్ ఇంజినీర్లు ఇక్కడ ఉపయోగించిన కొన్ని సాంకేతికతలను తమ భవిష్యత్తు హైస్పీడ్ రైలు ప్రాజెక్టుల్లోనూ ఉపయోగించాలనుకుంటున్నట్లు చెప్పారని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. అలాగే, ప్రాజెక్టు పనుల పురోగతి, నిర్మాణ నాణ్యతను చూసి జపాన్‌కు చెందిన పలువురు ప్రతినిధులు ప్రశంసించినట్లు తెలిపారు.

ముంబై నుంచి అహ్మదాబాద్‌కు హైస్పీడ్ ప్రయాణం

Advertisement

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పూర్తయితే దేశంలో హైస్పీడ్ రైలు రవాణాకు కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ మార్గం ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ఆధునిక రవాణా సదుపాయాలకు మార్గం ఈజీ చేయనుంది. వచ్చే ఏడాది ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించినప్పటికీ, ప్రయాణికులకు కమర్షియల్ సర్వీసులు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయన్నది ఇంకా స్పష్టంగా వెల్లడించలేదు. అయితే, బుల్లెట్ రైలు అధికారిక ప్రకటన వచ్చే వరకు ప్రారంభ తేదీపై స్పష్టత కోసం వేచి చూడాల్సిందే.

Read Also: రైల్వే ట్రాక్ పై మూడు మృతదేహాలు.. ఏకంగా 80 రైళ్లు రద్దు!

Tags

Related News

కేరళలో రైళ్లపై రాళ్లు విసిరిన ఏపీ వ్యక్తి.. చివరకు ఏమైందంటే?

అర్నాబ్ తుఫాను ఎఫెక్ట్.. విమాన ప్రయాణికులకు కీలక అలర్ట్!

హాస్టల్ లేదా పీజీలో చేరాలనుకుంటున్నారా? పొరపాటున ఈ తప్పులు చేయకండి

అర్నబ్ తుఫాను ఎఫెక్ట్.. 60కి పైగా రైళ్లు రద్దు!

రైల్వే ట్రాక్ పై మూడు మృతదేహాలు.. ఏకంగా 80 రైళ్లు రద్దు!

అమెరికాలో అట్టహాసంగా బతుకమ్మ, దసరా వేడుకలు.. ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు!

మన ఆటోను వదల్లేకపోయారు.. ఏకంగా సముద్రం దాటించి బ్రిటన్‌కు తీసుకెళ్లారు!

Big Stories

Advertisement
×