Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి వచ్చి తమ ప్లాన్ మొత్తం చెడగొట్టిందని అంజు మిగతా పిల్లలు అనుకుంటారు. వెంటనే అంజు తనకు జ్వరం రాలేదని స్కూల్ డుమ్మా కొట్టేందుకు అలా చెప్పానని అంటుంది. దీంతో మిస్సమ్మ, రాథోడ్ కలిసి అంజుకు జ్వరం ఏం లేదు కదా మనోహరి నువ్వు ఇక ఆశ్రమానికి వెళ్లిపో అంటారు. మనోహరి వినకున్నా బలవంతంగా అమర్‌కు చెప్పి మనోహరిని ఆశ్రమానికి సాగనంపుతారు.
మనోహరి గురించి షాకింగ్ నిజాలు తెలుసుకున్న వైజయంతి.. కారులో అమర్ ఇంటికి వెళ్తూ పోలీసులు చెప్పిన మనోహరి విషయాలు గుర్తు చేసుకుంటుంది. ఇంటికి వెళ్లాక పిల్లలు గార్డెన్‌లో ఆడుకుంటుంటే దగ్గరకు వెళ్లి అంజును పలకరిస్తుంది. అంజు గుడ్ మార్నిగ్ మేడం అంటూ విష్ చేస్తారు. అంజును దగ్గరకు తీసుకుని హగ్ చేసుకుంటే.. నాకు జ్వరం అంటే మీరు నమ్మేశారా ఆంటీ.. నాకు జ్వరం ఏమీ లేదు.. మమ్మీ డాడీలను కలిపేందుకు జ్వరం అని నాటకం ఆడామని ఇంతలో మనోహరి వచ్చి మా ప్లాన్ మొత్తం చెడగొట్టింది అంటారు. అందుకే తాను జ్వరం రాలేదన్న నిజం చెప్పానని అంటుంది.
అప్పుడే అమర్ వస్తాడు. ఏమైంది మేడం.. కన్నీళ్లు పెట్టుకుంటున్నారేంటి..? అని అడుగుతూ పిల్లలను లోపలికి పంపిస్తాడు.. పిల్లలు వెళ్లిపోయాక అమర్ మళ్లీ ఏంటి మేడం చెప్పండి.. ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు అని అడిగితే.. అంజు మీ కూతురు కాదు కదా అంటుంది. అమర్ షాక్ అవుతారు. మీకెలా తెలుసు మేడం అని అమర్ అడిగితే.. ఎంక్వైరీలో తెలిసింది అన వైజయంతి చెబితే.. అంజు మీద ఏంక్వైరీ చేశారా..? అని అమర్ అడిగితే.. లేదు వేరే ఎంక్వైరీ చేస్తుంటే ఈ విషయం తెలిసింది అని వైజయంతి చెప్పగానే.. అమర్ నిజం చెప్తాడు. తాను ఆరు కలిసి దత్తత తీసుకున్నామని ఆరుకు అనాథ పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి అందుకే దత్తత తీసుకున్నాం అని చెబితే..
మరి అంజు అమ్మా నాన్న ఎవరో తెలుసా..? అని వైజయంతి అడిగితే.. రణవీర్ అని తెలుసు అతను కోల్కతాలో ఉంటాడు అని అమర్ చెబితే మథర్ గురించి తెలుసా.. అంటే తెలియదు మేడం అంటాడు. తెలుసుకోవాలని ట్రై చేయలేదా..? అంటూ వైజయంతి అడిగితే.. అమర్ ట్రై చేశామని అంజు వాళ్ల మథరే అరుంధతిని చంపిందని తనే రణవీర్ వైఫ్ అని తెలిసింది. తను ఎవరో తెలుసుకునే లోపే నాకు యాక్సిడెంట్ అయింది. మెమెరీ లాస్ అయ్యింది. తర్వాత పార్థు రావడం ఇలా జరగడం అంటాడు అమర్. దీంతో వైజయంతి మీరు చాలా గ్రేట్ అమర్.. అవును ఈ విషయాలన్నీ భాగీకి తెలుసా..? అని వైజయంతి అడుగుతుంది.
మిస్సమ్మకు కూడా నాకు తెలిసిన వరకే తెలుసు మేడం.. అని అమర్ చెబితే.. ఏమో తనకు ఇంకా ఏవైనా కొత్త విషయాలు తెలుసేమో అని వైజయంతి అంటే ఏమో మేడం తెలుసా…? లేదా అనేది నాకు తెలియదు అంటాడు అమర్. దీంతో భాగీ ఎక్కడ అని వైజయంతి అడిగితే.. ఇందాకే గుడికి వెళ్లింది అంటూ అమర్ చెప్పగానే.. వైజయంతి ఆలోచిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.