Goa Tour: గోవా భారతదేశంలోని అతి చిన్న రాష్ట్రం. ఇది అరేబియా సముద్రం మధ్యలో పశ్చిమ తీరంలో ఉంటుంది. ఈ ప్రదేశం ఇండియాలోని ఒక ప్రధాన పర్యాటక కేంద్రం అని చెప్పొచ్చు. ఇక్కడ బీచ్‌లు, చర్చిలు, పచ్చని తాటి చెట్లు, జీడిపప్పు తోటలు, కార్నివాల్‌లు, ఫ్లీ మార్కెట్లు, వివిధ రకాల వంటకాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. గోవాలో ప్రతిరోజూ ఒక కార్నివాల్ జరుగుతుండటంతో.. గోవా నైట్ లైఫ్‌కు కూడా చాలా ఫేమస్.
612 లో నిర్మించిన ఫోర్ట్ అగ్వాడా:
ఇది సింక్వెరిమ్ బీచ్ దగ్గరలో ఉంటుంది. ఇక్కడి నుండి.. అరేబియా సముద్రం యొక్క అందాలను ఆస్వాదించవచ్చు. ఇది ఈవినింగ్ సమయంలో చూడటానికి చాలా బాగుంటుంది. కోట యొక్క పురాతన నిర్మాణం, ప్రశాంతమైన పరిసరాలు మీకు చిరస్మరణీయ అనుభవాన్ని అందిస్తాయి.
ఫోంటైన్‌హాస్:
పనాజీలోని ఈ ప్రదేశంలోని వీధులు, పోర్చుగీస్ శైలిలో నిర్మించిన భవనాలు, సాంస్కృతిక వారసత్వానికి ప్రసిద్ధి చెందాయి. ఇక్కడి ఇరుకైన వీధుల గుండా చేయి చేయి కలిపి నడవడం, ఒక కేఫ్‌లో కూర్చుని గోవా సంస్కృతిని ఆస్వాదించడం ప్రత్యేక అనుభవం.
మాండోవి నది క్రూయిజ్:
మాండోవి నదిలో క్రూయిజ్ ఎంజాయ్ చేయడానికి చాలా మంది వస్తుంటారు. ఈవినింగ్ టైమ్ లో ఇక్కడ లైవ్ మ్యూజిక్ , డ్యాన్సులు, సాంప్రదాయ గోవా కార్యక్రమాలతో క్రూయిజ్ రైడ్ మంచి అనుభవాన్ని అందిస్తుంది.
పలోలెం బీచ్ :
దక్షిణ గోవాలో ఉన్న పలోలెం బీచ్ యొక్క సహజ సౌందర్యం , ప్రశాంత వాతావరణం ఎంతటి వారినైనా ఆకట్టుకుంటుంది. ఇక్కడ మీరు మీ ఫ్యామిలీతో కలిసి డిన్నర్ ఎంజాయ్ చేయొచ్చు. లేదా బీచ్‌లో షికారు చేయవచ్చు. ఈ బీచ్ ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్.
Also Read: రాజస్థాన్‌లో ఈ ప్రదేశాలను చూడకపోతే.. లైఫ్‌లో చాలా మిస్స్ అవుతారు !
బటర్ ఫ్లై బీచ్:
ఈ బీచ్ వివిధ రకాల సీతాకోకచిలుకలకు, సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ప్రశాంత వాతావరణంలో మీరు మీ ఫ్యామిలీతో సమయం గడపవచ్చు. అంతే కాకుండా సముద్రపు అలలను ఆస్వాదించవచ్చు.
చపోరా కోట:
‘దిల్ చాహ్తా హై’ సినిమా తర్వాత ప్రసిద్ధి చెందిన ఈ కోటకు దగ్గరలోనే చపోరా నది, పరిసర ప్రాంతాలు చాలా బాగుంటాయి. ఇక్కడ ఫ్యామిలీతో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించడం ఒక ప్రత్యేక అనుభవం అవుతుంది.