Animal Movie OTT : అర్జున్ రెడ్డి (Arjun Reddy) సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఏం చేసినా నిర్భయంగా చేసే అతి తక్కువ మంది దర్శకులలో రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) తర్వాత ఒకరిగా పేరు సొంతం చేసుకున్నారు. మరి ఈ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా యాక్షన్ డ్రామాగా ‘యానిమల్’ అంటూ సినిమాను రూపొందించారు. రణబీర్ కపూర్ (Ranbir Kapoor)హీరోగా , రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్గా , త్రిప్తి డిమ్రీ (Tripti dimri) కీలక పాత్ర పోషించిన ఈ సినిమా 2024 డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చి.. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. యువతను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.900 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించింది.
తెలుగు స్ట్రీమింగ్ ఆపేసిన నెట్ ఫ్లిక్స్..
ఇక ఇలాంటి సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎదురు చూడగా.. 2025 జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కి వచ్చింది. థియేటర్లలో చూసిన సినిమా కంటే మరింత సర్ప్రైజ్ జోడించి, ఓటీటీ వెర్షన్ విడుదల చేశారు. అంతేకాదు 8 నిమిషాల సన్నివేశాన్ని జోడించి మరీ విడుదల చేశారు. ఒక థియేటర్లలో సినిమా చూడలేని వారికి కూడా ఓటీటీ ద్వారా అవకాశాన్ని కల్పించారు. దాంతో సినిమా 3 గంటల 29 నిమిషాల రన్ టైం తో ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. యాక్షన్ ప్రియులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ కూడా అందించింది. ఇక అంతా బాగున్నా ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంచకపోవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ సినిమాను తీసింది కూడా తెలుగు డైరెక్టర్.. కానీ ఏ కారణం చేత తెలుగు డబ్బింగ్ ను నిలిపివేశారు అన్నది తెలియడం లేదు. ఇప్పటికే వివిధ భాషలలో ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఒక్క తెలుగులో మాత్రమే లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
also read:Kajal Agarwal: జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ లో మెరిసిన కాజల్.. ఫోటోలు వైరల్..!
నెటిజన్స్ ఫైర్..
తెలుగు లో యానిమల్ సినిమా అందుబాటులో లేకపోయేసరికి కొంతమంది నెటిజెన్స్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరుగుతోంది..? యానిమల్ మూవీ తెలుగులో లేకపోవడం ఏమిటి? తెలుగు డైరెక్టర్ సినిమా అయ్యుండి.. తెలుగులో లేకపోవడం ఏంటి..? దయచేసి సమాధానం ఇవ్వండి అంటూ డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫారం ను ట్యాగ్ చేస్తూ మరీ ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై నెట్ఫ్లిక్స్ ఏదైనా స్పందిస్తుందేమో చూడాలి. ఇకపోతే సినిమా విడుదలయ్యి దాదాపు 6 నెలలకు పైగానే అవుతున్నా.. ఇప్పటికీ యానిమల్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో వివిధ భాషలలో స్ట్రీమింగ్ అవుతూనే ఉంది. వీక్షకుల సంఖ్య రోజుకూ పెరుగుతోంది. మరి ఇలాంటి సమయంలో తెలుగులో లేకపోవడం నిజంగా ఆందోళన కలిగించే అంశం అనే చెప్పాలి. మరి దీనిపై చిత్ర బృందం, అటు నెట్ ఫ్లిక్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
@NetflixIndia @imvangasandeep what the he'll is going on…animal movie is not there in telugu version..what is this? Telugu director film telugu lo lekapovadam enti?????? Please answer this?
— Bunny Swaradeep (@BunnySwaradeep) May 3, 2025