E-Paper
Advertisement

Lower Berth: లోయర్ బెర్త్ త్యాగం చేయకపోవడం పాపమా? ప్రయాణికుడికి చేదు అనుభవం

Lower Berth: లోయర్ బెర్త్ త్యాగం చేయకపోవడం పాపమా? ప్రయాణికుడికి చేదు అనుభవం
Advertisement

రైల్లో లోయర్ బెర్త్ లేదా సైడ్ లోయర్ బెర్త్ దొరికిన కొంతమందికి సంతోషం ఉండదు. రైలు ఎక్కి, నిద్రపోయే వరకు ఏదో తెలియని సందేహం వారిని వెంటాడుతుంది. ‘‘లేక లేక లోయర్ బెర్త్ దొరికింది.. దేవుడి దయవల్ల ఈ సీటు మాకు కావాలని ఎవరూ అడగకపోతే బాగున్ను’’ అని మనసులో అనుకుంటారు. రైలు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరి అనుభవం ఇది. మీకు కూడా ఎప్పుడో ఇది ఎదురయ్యే ఉంటుంది. మిడిల్, అప్పర్ బెర్త్‌ ఎక్కలేని పెద్దవాళ్లకు, గర్బినీలకు సాయం చేసినా తప్పులేదు. కానీ, కొందరు పక్కవారి సీటును కూడా లాక్కోవడాన్ని హక్కుగా ఫీలవుతారు. ఆ సీటు ఇవ్వడానికి ఒప్పుకోని వ్యక్తిని విలన్‌లా చూస్తారు. పాపం.. ఆ సీటు కోసం ఎంత ఉదయాన్నే లేచి ఆన్‌లైన్‌లో ఆపసోపాలు పడి ఆ టికెట్ బుక్ చేసుకున్నాడో అని ఎవ్వరూ ఆలోచించరు. తాజాగా ఓ ప్రయాణికుడికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. అదంతా సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.

చాలా సిగ్గుగా ఉంది

‘‘నేను నా సైడ్ లోయర్ బెర్త్.. రుతుక్రమంతో బాధపడుతోన్న మహిళకు ఇవ్వనందుకు చాలా సిగ్గుగా, బాధగా ఉంది’’ అంటూ ఓ ప్రయాణికుడు రైల్లో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చాడు. ‘‘నాకు దాదాపు మూడేళ్ల తర్వాత రైలులో సైడ్ లోయర్ బెర్త్ దొరికింది. చాలాసార్లు బుకింగ్ టైమ్‌లో ఆ సీటును ఎంచుకున్నా.. ఆటోమెటిక్‌గా వేరే సీటు వచ్చేది. కానీ, ఈసారి సైడ్ లోయర్ దొరికింది. ఇక ఎవరి డిస్ట్రబెన్స్ లేకుండా రైలు కిటికీ నుంచి చూస్తూ ప్రయాణం చేయొచ్చని అనుకున్నాను. కానీ, ఓ జంట దాన్ని నాశనం చేశారు. వారు నా దగ్గరకు వచ్చి నా బెర్త్ కావాలని అడిగారు. తన భార్య రుతుక్రమంతో బాధపడుతోందని, ఆమె సైడ్ అప్పర్ బెర్త్ ఎక్కలేదని చెప్పాడు. రిక్వెస్టింగ్‌గా అడిగితే పర్వాలేదు. ఆ సీటు ఇవ్వాల్సిందే అన్నట్లు అడిగారు’’ అని తెలిపాడు.

ఇవ్వనని చెప్పినా.. వదల్లేదు

Advertisement

‘‘నాకు ఆ సీటును వదులుకోవడం ఇష్టం లేదు. ఇదే విషయాన్ని వారికి చెప్పాను. లోయర్ బెర్త్‌ ఎవరైనా ఇస్తారేమో అడగండి. నేను ఇది ఇవ్వలేను అని చెప్పాను. సున్నితంగానే తిరస్కరించా అంతే. కానీ, ఆ తర్వాత కోచ్‌లో పరిస్థితి ఒక్కసారిగా అసౌకర్యంగా మారిపోయింది. ఆ జంట నా వైపే అదోలా చూడటం మొదలుపెట్టారు. నన్ను చూస్తూ తిట్టుకున్నారు. పక్కవాళ్లకు కూడా ఆ విషయం చెప్పి.. నన్ను అక్కడ విలన్‌గా మార్చేశారు. అయితే, ఎవరూ నన్ను ఆ సీటు ఇవ్వమని సలహా ఇవ్వలేదు. కానీ, వారి చూపులు చూస్తే నాకు చాలా సిగ్గుగా అనిపించింది’’ అని తెలిపాడు.

అతని అనుభవంపై నెటిజన్స్ స్పందన ఇదే

ఆ ప్రయాణికుడు ఈ విషయాన్ని రెడిట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై పలువురు నెటిజన్స్ స్పందిస్తూ.. ‘‘నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావు. అది నీ సీటు. అది ఇవ్వాలా వద్దా అనేది పూర్తిగా నీ ఇష్టం’’ అని అన్నారు. మరొకరైతే.. ‘‘ఒక్కసారి నువ్వు ‘నో’ చెప్పిన తర్వాత వాళ్లు అలా నీ వెంట పడకూడదు. వేరే ఆఫ్షన్స్ వెతుక్కోవాలి’’ అని అన్నారు. ‘‘నువ్వ తిరస్కరించిన తర్వాత.. వారిని అస్సలు పట్టించుకోకూడదు. మొబైల్ ఫోన్ చూసుకోవాలి. లేదా ఏదో నీ పనిలో బిజీగా ఉన్నట్లు నటించాలి. అసలు వాళ్లను చూడకూడదు’’ అని అన్నారు. మరి, దీనిపై మీ అభిప్రాయం ఏమిటీ?

Advertisement

Also Read: ఐఆర్సీటీసీ ఫుడ్ ధరల లిస్ట్ ఇదే.. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ కాస్ట్ ఏంతో తెలుసా?

Related News

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే

‘మిర్చి’ సాంగ్ లోని ఈ ప్లేస్ గుర్తుందా? అది ఇప్పుడు ఘోస్ట్ టౌన్, జనాలంతా ఏమయ్యారు?

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

Big Stories

Advertisement
×