BigTV English

Secret Caves: కొత్తగూడెం అడవుల్లో దాక్కున్న ఈ గుహల గురించి తెలుసా?

Secret Caves: కొత్తగూడెం అడవుల్లో దాక్కున్న ఈ గుహల గురించి తెలుసా?

Secret Caves: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దట్టమైన అడవుల్లో దాక్కున్న చింతలగూడెం గుహలు ఒక సీక్రేట్ టూరిస్ట్ స్పాట్. సాహసం, ప్రకృతి ఇష్టపడేవాళ్లకి ఇది అద్దిరిపోయే ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. చింతలగూడెం గ్రామం దగ్గర ఉన్న ఈ గుహల గురించి స్థానిక గిరిజనులకి తప్ప ఎవరికీ ఎక్కువ తెలీదు. టూరిస్ట్ రద్దీ లేని ఈ గుహలు సీక్రెట్, నేచురల్ స్పాట్ కావాలంటే పర్ఫెక్ట్.


ఈ గుహలు అడవిలో దాగిన చిన్న చిన్న సహజ గదుల సమూహం. ఇందులో లైమ్‌స్టోన్‌తో ఏర్పడిన స్టాలక్టైట్ స్ట్రక్చర్స్ సూపర్ అట్రాక్షన్. శతాబ్దాలుగా నీటి చుక్కలతో గుహల సీలింగ్ నుంచి వేలాడే ఈ స్ట్రక్చర్స్ చూడ్డానికి అద్భుతంగా ఉంటాయి. గుహల లోపల చల్లగా, పీస్‌ఫుల్‌గా ఉంటుంది. చిన్న రంధ్రాల నుంచి సూర్యకాంతి లీక్ అవుతూ రాళ్లపై మెరుపులు పడతాయి. చుట్టూ ఉన్న అడవిలో పక్షుల కిలకిల, ఆకుల సవ్వడి సూపర్ రిలాక్సింగ్‌గా ఉంటాయి.

ఎందుకు స్పెషల్?
చింతలగూడెం గుహలు అందరికీ కాదు. ఫేమస్ టూరిస్ట్ స్పాట్స్ లాగా ఇక్కడ కంఫర్ట్ ఫెసిలిటీస్ ఉండవు, జర్నీ కాస్త టఫ్. కానీ అదే దీని స్పెషాలిటీ. ప్రకృతితో క్లోజ్‌గా ఉండే ఛాన్స్, జనాల రద్దీ లేని రేర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. లోకల్ గైడ్‌ల కథలు వినడం చాలా ఆసక్తికరమైన అనుభవాన్ని ఇస్తుంది. పురాతన స్టాలక్టైట్ స్ట్రక్చర్స్ చూడొచ్చు.


ఈ ట్రిప్‌కి ప్రిపరేషన్ మస్ట్. అక్కడ రెస్ట్‌రూమ్స్, ఫుడ్ స్టాల్స్, షాపులు ఏమీ ఉండవు. సో, బాగా నీళ్లు, స్నాక్స్, ఫస్ట్-ఎయిడ్ కిట్ క్యారీ చేయాలి. ట్రెక్కింగ్ షూస్ తప్పనిసరి, ఎందుకంటే అడవి దారి గరుకుగా, రాతితో ఉంటుంది. గుహల్లో డార్క్ ఏరియాస్ చూడ్డానికి ఫ్లాష్‌లైట్ హెల్ప్ అవుతుంది. గుహలు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కంట్రోల్‌లో ఉండొచ్చు, కాబట్టి కొత్తగూడెంలోని ఫారెస్ట్ ఆఫీస్‌లో పర్మిషన్ తీసుకోవాలి. కొన్ని ఏరియాలకు ఎన్విరాన్‌మెంట్ సెన్సిటివిటీ వల్ల అడ్వాన్స్ పర్మిషన్ కావాలి.

ఎప్పుడు వెళ్లాలి?
అక్టోబర్ నుంచి మార్చి వరకు బెస్ట్ టైమ్, వెదర్ చల్లగా, ప్లెజెంట్‌గా ఉంటుంది. ఒక రోజు ట్రిప్‌గా ప్లాన్ చేస్తే బెటర్, మార్నింగ్ తొందరగా స్టార్ట్ అయితే డేలైట్‌లో ఎక్కువ టైమ్ యూజ్ చేయొచ్చు. గుహలకు ట్రెక్ చేయడానికి ఒక గంట పట్టొచ్చు. గుహలు ఎక్స్‌ప్లోర్ చేయడానికి, అడవిలో రిలాక్స్ అవ్వడానికి బాగా టైమ్ ఉంటుంది.

ఇంకా ఏం చూడొచ్చు?
చింతలగూడెం గుహలే మెయిన్ అట్రాక్షన్ అయినా, భద్రాద్రి కొత్తగూడెంలో ఇంకా కొన్ని కూల్ స్పాట్స్ ఉన్నాయి. పాల్వంచ నుంచి 12 కీ.మీ. దూరంలో ఉన్న కిన్నెరసాని వైల్డ్‌లైఫ్ సాంక్చ రీలో చిరుతలు, జింకలు, కలర్‌ఫుల్ పక్షులు చూడొచ్చు. 40 కీ.మీ. దూరంలో ఉన్న భద్రాచలం శ్రీరామ టెంపుల్‌తో ఫేమస్ స్పిరిచువల్ స్పాట్. ఈ ప్లేసెస్‌ని కూడా గుహల ట్రిప్‌లో కవర్ చేస్తే ఫుల్ ఎక్స్‌పీరియన్స్ పొందొచ్చు.

ఎలా వెళ్లాలి?
చింతలగూడెం గుహలకు వెళ్లడం ఒక మినీ అడ్వెంచర్ అనే చెప్పాలి. కొత్తగూడెం టౌన్ నుంచి దాదాపు 30 కీ.మీ. దూరంలో ఈ గుహలు ఉంటాయి. కొత్తగూడెంకి రోడ్డు, రైలు కనెక్షన్స్ బాగుంటాయి. అక్కడి నుంచి చింతలగూడెం గ్రామానికి టాక్సీ లేదా ఆటోలో వెళ్లొచ్చు. గుహలకు డైరెక్ట్ రోడ్స్ లేవు, సో అడవిలో ట్రెక్ చేయాల్సి ఉంటుంది. సైన్‌బోర్డులు ఉండవు కాబట్టి లోకల్ గైడ్ సహాయం తీసుకోవడం తప్పనిసరి. గ్రామస్తులు ఫ్రెండ్లీగా ఉంటారు, తక్కువ ఫీజు తీసుకుని గైడ్ చేస్తారు. వాళ్లు చెప్పే లోకల్ స్టోరీస్ వింటూ వెళ్తే జర్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది.

Related News

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Train Travel: రైలు ప్రయాణీకులకు ఇన్ని రైట్స్ ఉంటాయా? అస్సలూ ఊహించి ఉండరు!

Big Stories

×