Bengaluru To Chennai Vande Bharat Express: వందేభారత్ రైళ్లు నెమ్మదిగా వేగాన్ని పెంచుకుంటున్నాయి. భద్రత దృష్ట్యా ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు తక్కువ వేగంగా ప్రయాణించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు వేగాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్నిచోట్ల వందేభారత్ రైళ్ల వేగాన్ని గంటకు 160 కిలో మీటర్లకు పెంచగా, ప్రస్తుతం మరికొన్ని రైళ్ల వేగాన్ని పెంచబోతున్నారు. అందులో భాగంగా ఇకపై వందేభారత్ ఎక్స్ ప్రెస్ కేవలం 4 గంటల్లోనే బెంగళరూరు నుంచి చెన్నైకి చేరుకోబోతోంది. ప్రస్తుత ప్రయాణ సమయంతో పోల్చితే 25 నిమిషాల పాటు తగ్గనుంది.
బెంగళూరు- చెన్నై మధ్య పెరగనున్న రైళ్ల వేగం
తాజాగా బెంగళూరు- జోలార్ పేట సెక్షన్ లో సౌత్ వెస్ట్రన్ రైల్వే అధికారులు బెంగళూరు డివిజన్ స్పీడ్ ట్రయల్ నిర్వహించారు. వేగ పరిమితిని 110 కిలో మీటర్ల నుంచి 130 కిలో మీటర్లకు పెంచేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. అదే సమయంలో శతాబ్ది ఎక్స్ ప్రెస్ రూట్ లో వేగాన్ని పెంచడం వల్ల కనీసం 20 నిమిషాల ప్రయాణ సమయం సేవ్ కానుంది. ఇప్పటికే రైళ్ల వేగాన్ని పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు SWR అధికారులు వెల్లడించారు. అధిక డిమాండ్ ఉన్న కారిడార్ లో రైళ్ల వేగాన్ని పెంచాలని భావిస్తున్నట్లు తెలిపారు. రైల్వే భద్రతా కమిషనర్ ఆమోదం పొందిన తర్వాత సవరించిన వేగం అమల్లోకి రానుంది.
చెన్నై-జోలార్ పేట సెక్షన్ లో ఇప్పటికే గంటకు 130 కిలో మీటర్ల వేగంతో ప్రయాణికంచే అవకాశం ఉన్నందున ఈ అప్ గ్రేడ్ మొత్తం బెంగళూరు-చెన్నై మార్గంలో అందుబాటులోకి రానుంది. ఎక్కువ డిమాండ్ ఉన్న ఈ కారిడార్ లో ప్రతి రోజూ నడిచే రెండు వందే భారత్ రైళ్లు, రెండు శతాబ్ది రైళ్లకు ఈ అప్ గ్రేడ్ చేసిన వేగ పరిమితులు అందుబాటులోకి రానున్నాయి. బెంగళూరులోని టెక్, స్టార్టప్ హబ్‌లను చెన్నైలోని ఆటోమొబైల్ తయారీ, పారిశ్రామిక జోన్ లతో అనుసంధానించడంలో ఈ రైళ్లు కీలక పాత్ర పోషించనున్నాయి.
Read Also: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి, దీని ప్రత్యేకతలు తెలిస్తే షాకవ్వాల్సిందే!
ఈ ఏడాది ఆగష్టులో 3 వందేభారత్ రైళ్ల ప్రారంభం
ఇక బెంగళూరు- చెన్నై నడుమ రైల్వే కనెక్టివిటీని పెంచేందుకు గాను, ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఏడాది ఆగస్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మూడు కొత్త వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. వీటిలో ఒకటి చెన్నై సెంట్రల్ నుంచినాగర్ కోయిల్ వరకు, రెండవది మధురై నుంచి బెంగళూరు కంటోన్మెంట్ వరకు మూడవది మీరట్ సిటీ నుంచి-లక్నో వరకు నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక మధ్య ఈ రైళ్లు సేవలను అందించనున్నాయి.
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సుమారు 135కు పైగా వందేభారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లు దేశ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు వేగవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలోని సుమారు 300 జిల్లాల్లో వందేభారత్ రైళ్లు తమ సేవలను అందిస్తున్నాయి.
Read Also: వచ్చేస్తోంది.. బుల్లెట్ ట్రైన్, నెక్ట్స్ ఈ రూట్లలోనే పరుగు.. మన తెలుగు రాష్ట్రాలు?