Dandruff: చుండ్రు అనేది సాధారణ సమస్య. దీని కారణంగా అనేక మంది చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కొందరు చుండ్రు కారణంగా నల్లని బట్టలు ధరించడం కూడా మానేస్తారు. ఎందుకంటే చుండ్రు ఆ దుస్తులపై పడినప్పుడు చాలా అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరింత పెరుగుతుంది. చుండ్రును తొలగించడానికి అనేక రకాల జుట్టు సంరక్షణ చికిత్సలు అందుబాటులో ఉన్నప్పటికీ ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి.
అందుకే కొన్ని రకాల హోం రెమెడీస్ పాటించడం మంచిది. వీటిని ఉపయోగించడం వల్ల తలపై ఉన్న చుండ్రు ఒక వారంలో తగ్గుతుంది. మీ తలపై చుండ్రు ఎక్కువగా ఉంటే.. వీటిని తప్పకుండా పాటించండి. మరి వారంలోనే తలలోని చుండ్రు తగ్గించేందుకు ఎలాంటి హోం రెమెడీస్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మ రసం, కొబ్బరి నూనె:
2-3 చెంచాల కొబ్బరి నూనెలో సగం నిమ్మకాయ రసాన్ని కలపండి. దీన్ని మీ తలకు పట్టించి సున్నితంగా మసాజ్ చేయండి. 30 నిమిషాల తర్వాత షాంపూతో జుట్టును తలస్నానం చేయండి. మ్మరసం ఫంగస్‌ను తొలగించడంలో సహాయపడుతుంది . అంతే కాకుండా కొబ్బరినూనె తలకు తేమను అందిస్తుంది. వారం రోజుల పాటు ఇలా చేయడం వల్ల దాదాపు చుండ్రు తగ్గుతుంది.
టీ ట్రీ ఆయిల్ వాడకం:
టీ ట్రీ ఆయిల్‌ను ఎప్పుడూ జుట్టుకు నేరుగా అప్లై చేయవద్దు.టీ ట్రీ ఆయిల్ షాంపూలో 2-3 చుక్కలను కలపండి. తర్వాత జుట్టును వాష్ చేయండి. టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును వేగంగా తగ్గిస్తాయి.
ఆపిల్ సైడర్ వెనిగర్ :
వెనిగర్ ఉపయోగించి కూడా మీ తలపై చుండ్రుని తగ్గించుకోవచ్చు. దీని కోసం, సమాన పరిమాణంలో నీరు , ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక బౌల్ లో తీసి మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని తలపై స్ప్రే చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత వాష్ చేయండి.
మెంతి గింజల పేస్ట్, పెరుగు:
మెంతి పేస్ట్, పెరుగు రెండూ తలను శుభ్రపరిచడంతో పాటు తలపై ఉన్న చుండ్రు పొరను తొలగించే మూలకాలను కలిగి ఉంటాయి. దీన్ని ఉపయోగించడానికి, 2 చెంచాల మెంతి గింజలను రాత్రంతా నానబెట్టి వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. అందులో 2 చెంచాల పెరుగు మిక్స్ చేసి తలకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత వాష్ చేయండి. ఇది చుండ్రు పొరను తొలగించడంలో సహాయపడుతుంది.
Also Read: రైస్ వాటర్‌తో.. మచ్చలేని చర్మం మీ సొంతం
అలోవెరా జెల్:
మీ ఇంట్లో అలోవెరా మొక్క ఉంటే అంతకంటే మంచి ఎంపిక మరొకటి ఉండదు. తలలో చుండ్రును తొలగించేందుకు తాజా కలబంద జెల్‌ను తలకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల చుండ్రు తగ్గుతుంది.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.