E-Paper
Advertisement

చెన్నైకి కాంగ్రెస్ అగ్రనేతలు.. రాజకీయ పార్టీల అధినేతలతో మంతనాలు, చివరికి జగన్‌తో కూడా!

చెన్నైకి కాంగ్రెస్ అగ్రనేతలు.. రాజకీయ పార్టీల అధినేతలతో మంతనాలు, చివరికి జగన్‌తో కూడా!
Advertisement

Delimitation Bill: సోమవారం పార్లమెంటు ముందుకు రెండు కీలక బిల్లులు రానుండడంతో వేగంగా అడుగులు వేస్తోంది కాంగ్రెస్. బీజేపీకి మద్దతు ఇస్తామని ప్రకటించిన పార్టీల అధినేతలతో మంతనాలు సాగించేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ ఆదివారం మధ్యాహ్నం చెన్నై, ముంబైకి పయనమైంది. పాత మిత్రులను కలిసి ఈ బిల్లుపై చర్చించనుంది. అటు వైసీపీ అధినేత జగన్‌ను కాంగ్రెస్ హైకమాండ్ కలిసే అవకాశం ఉన్నట్లు సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

డీలిమిటేషన్ బిల్లుపై పావులు కదుపుతున్న కాంగ్రెస్

డీ లిమిటేషన్ బిల్లు ఎలాగైనా ఆపాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే ఇండి కూటమిలోని పలు పార్టీలు బీజేపీకి మద్దతు ప్రకటించాయి. మహారాష్ట్రలోని శరద్ పవర్ వర్గ, తమిళనాడులోని డీఎంకె, ఏపీలోని వైసీపీ పార్టీలు. దీనిపై శనివారం కేంద్రమంత్రి అమిత్ షాతో ఆ పార్టీ నేతలు భేటీ అయ్యారు. డీలిమిటేషన్ జరిగితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కష్టమని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ.

Advertisement

ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలు చెన్నైకి రానున్నారు. వారితోపాటు కర్ణాటక, కేరళ, తెలంగాణ సీఎంలు కూడా వెళ్లనున్నారు. వారంతా డీఎంకె అధినేత స్టాలిన్‌తో భేటీ కానున్నారు. ఎలాగైనా బిల్లు ఆపకుంటే వచ్చే కష్టాలను వివరించారు. ఇప్పటికే బీజేపీకి మద్దతు ప్రకటించిన స్టాలిన్, ఈ విషయంలో వెనక్కి తగ్గుతారా? అన్నది అసలు ప్రశ్న.

చెన్నైని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాక

అదే సమయంలో ఏపీ మాజీ సీఎం జగన్‌తో కూడా మంతనాలు చేయాలని ఆలోచన చేస్తోందట కాంగ్రెస్ హైకమాండ్. ఈ విషయంలో ఆయనతో నేరుగా భేటీ కాకున్నా.. ఫోన్ ద్వారా మంతనాలు సాగించాలని భావిస్తోంది. ఆ బాధ్యతలను మూడు రాష్ట్రాల సీఎంలకు అప్పగించినట్టు తెలుస్తోంది. కొన్నాళ్లుగా కాంగ్రెస్ మాదిరిగా వైసీపీ కూడా ఓపెన్‌గా కాక్రోచ్ జనతాపార్టీకి మద్దతు ఇచ్చింది. ఈ క్రమంలో ఆయనతో కూడా ఓ మాట మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

Advertisement

ఆదివారం మధ్యాహ్నం చెన్నైలో స్టాలిన్‌ను కలవనున్నారు. భేటీ తర్వాత అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత రాత్రి ముంబైలోని శరద్ పవార్‌తో ఇండీ కూటమి ముఖ్యనేతలు భేటీ కానున్నారు. కేంద్ర కేబినెట్‌లో శరద్ పవార్ వర్గానికి ఓ కేబినెట్ పదవి ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో శరద్ పవార్, స్టాలిన్, జగన్‌కు ఆపగలిగితే కచ్చితంగా విజయం సాధించినట్టేనని లెక్కలు వేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్.

ALSO READ:  నుజ్జయిన స్కార్పియో వాహనం.. స్పాట్‌లో 13 మంది మృతి, రాంచీ-పాట్నా హైవేపై ఘోర ప్రమాదం

Related News

నుజ్జయిన స్కార్పియో వాహనం.. స్పాట్‌లో 13 మంది మృతి, రాంచీ-పాట్నా హైవేపై ఘోర ప్రమాదం

తిరుప్పరంకుండ్రం కొండపై ఎట్టకేలకు వెలిగిన కార్తీక దీపం!

మన అన్నమయ్య పాటకు విదేశాల్లో అరుదైన గౌరవం.. అదిరిపోయిందిగా!

మహిళా రిజర్వేషన్లపై మోదీ కీలక ప్రకటన.. నారీ శక్తికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని హామీ!

గతంలో వ్యతిరేకం.. ఇప్పుడు అనుకూలం.. డీలిమిటేషన్‌పై డీఎంకే యూటర్న్ వెనుక అసలు కథ ఇదే!

బెంగళూరు లాడ్జిలో దారుణం.. కేరళ యువతి దారుణ హత్య.. పోలీసుల అదుపులో ప్రియుడు!

సుప్రీంకోర్టు తీర్పు ఎఫెక్ట్.. సీఎం విజయ్‌పై స్టాలిన్ ఫైర్.. ‘స్టాండప్ కమెడియన్‌’లా మారారంటూ ఘాటు వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×