E-Paper
Advertisement

మందు కొడితే ఇంత మంచిగా మారిపోతారా? బ్యాంకాక్ వీధుల్లో విదేశీయుడి వింత ప్రవర్తన!

మందు కొడితే ఇంత మంచిగా మారిపోతారా? బ్యాంకాక్ వీధుల్లో విదేశీయుడి వింత ప్రవర్తన!
Advertisement

Bangkok Tourist: సాధారణంగా మద్యం మత్తులో ఉన్నవారు గొడవలు చేయడం, దాడులకు పాల్పడటం వంటివి చూస్తుంటాం. కానీ ఒక విదేశీ పర్యాటకుడు మాత్రం మత్తులో ఏకంగా ఇళ్ల ముందు ఆరేసిన బట్టలను తీసి ఎంతో శ్రద్ధగా మడతపెడుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగిందంటే..?

బ్యాంకాక్‌లోని సోయ్ బ్యాంగ్ వేక్ 2 ప్రాంతంలో బుధవారం (నవంబర్ 25) మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన జరిగింది. ఓ విదేశీ టూరిస్ట్.. మద్యం మత్తులో వీధిలో నడుస్తుండగా అతడికి దండెంపై ఆరేసిన బట్టలు కనిపించాయి. దీంతో అక్కడే ఆగిపోయిన అతడు.. దండెంపై ఒక్కో బట్టను తీసి ఎంతో ఓపికగా, పద్ధతిగా మడతపెట్టడం మొదలుపెట్టాడు.

Advertisement

రెండు ఇళ్ల దగ్గర..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ వ్యక్తి వీధి చివరన ఉన్న ఓ ఇంటి ముందు బట్టలను కూడా ఇలాగే మడతపెట్టాడు. అక్కడ పని పూర్తయ్యాక కొంచెం ముందుకు నడిచి మరో ఇంటి ముందు ఉన్న బట్టలను కూడా అదే విధంగా నీట్‌గా మడతపెట్టి వెళ్లిపోయాడు. ఇంటి బయట ఆరేసిన బట్టల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఫన్నీగా హెచ్చరిస్తూ ఓ వ్యక్తి పెట్టిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

నెటిజన్ల ఫన్నీ కామెంట్స్

Advertisement

అయితే ఈ వీడియోను చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఆ పర్యాటకుడి మంచితనాన్ని చూసి నెటిజన్లు సరదా కామెంట్లు పెడుతున్నారు. ‘ఇలాంటి వాళ్లు మా ఇంటి వైపు కూడా ఒకసారి నడుచుకుంటూ వస్తే బాగుండు’ అని ఒకరు కామెంట్ చేశారు. ‘మందు తాగినా సరే.. ఇతరులకు ఉపయోగపడే పని చేశాడు. మిగతా వారు కూడా ఇతడిని చూసి నేర్చుకోవాలి’ అని మరొకరు ప్రశంసించారు.

Also Read: గుజరాత్ మోడల్‌ను కాపీ కొట్టాల్సిన అవసరం లేదు.. తెలంగాణ మోడల్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

అతడు నిజంగానే తాగి ఉన్నాడా?

అయితే ఈ వీడియోను చూసి మరికొందరు నెటిజన్లు అతడు నిజంగానే మద్యం మత్తులో ఉన్నాడా? అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘వీడియోను చాలాసార్లు చూశాను. అతడు తాగినట్లు అస్సలు కనిపించడం లేదు. అడుగులు కూడా ఎక్కడా తడబడలేదు. పైగా ఓ పద్ధతి ప్రకారం బట్టలు మడతపెట్టాడు. బహుశా అవి అతడి సొంత బట్టలేమో? అందుకే ఇంకా తడిగా ఉన్న ఒక బట్టను మడతపెట్టకుండా వదిలేశాడు’ అంటూ ఒక యూజర్ తన సందేహాన్ని వ్యక్తం చేశాడు.

Also Read: లంచ్ బ్రేక్ స్కిప్.. గంట ముందే ఇంటికి.. ఉద్యోగికి కంపెనీ బిగ్ షాక్!

Tags

Related News

భక్తులు ఇచ్చే విరాళాలతో ఇన్ని సేవలా? టీటీడీ గురించి ఆసక్తికర విషయాలు!

శ్రీవారికి విరాళం ఇస్తే జీవితకాలం దర్శనమా? TTD కల్పించే ప్రత్యేక సౌకర్యాలు ఇవే!

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల తేదీలు వచ్చేశాయ్!

తిరుమల దర్శనం టికెట్ దొరకలేదా? ఇలా చేస్తే వీఐపీ దర్శనం!

ఫోటోలు దిగుదామని గుహలోకి వెళ్లింది.. చివరకు అక్కడే ఇరుక్కుపోయింది!

రైలు కోచ్‌ల మధ్య ప్రమాదకర ప్రయాణం.. వైరల్ వీడియో చూస్తే షాకవుతారు!

ఆహా అనిపించేలా వందేభారత్ ప్రయాణం.. అంజి ఖాడ్ బ్రిడ్జిపై అద్భుత వీడియో వైరల్!

Big Stories

Advertisement
×