E-Paper
Advertisement

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ఛార్జీలు ఖరారు.. నో RAC, నో వెయిటింగ్ లిస్ట్

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ఛార్జీలు ఖరారు.. నో RAC, నో వెయిటింగ్ లిస్ట్
Advertisement

Vande Bharat Sleeper: వందే భారత్ స్లీపర్ ట్రైన్.. త్వరలో పట్టాలెక్కనుంది. అధిక వేగం, మెరుగైన సౌకర్యం, భద్రతాతో తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ కోల్ కతా-గువహటి మధ్య పరుగులు పెట్టనుంది. ఈ ట్రైన్ టికెట్ ఛార్జీలను రైల్వే శాఖ ఖరారు చేసింది. అధికారిక వర్గాల ప్రకారం.. 400 కి.మీ వరకు 3AC టికెట్ ధర రూ.960 నుంచి 3,500 కి.మీ వరకు.. 1AC టికెట్ ధర రూ.13,300 వరకు ఉంటుంది. 400 కి.మీ వరకు 3AC ఛార్జీలు రూ.960, 2AC ఛార్జీలు 1,240, 1AC ఛార్జీలు 1,520 నుండి ప్రారంభమవుతాయి.

నో RAC, నో వెయిటింగ్ లిస్ట్

దూర ప్రాంత ప్రయాణాలను తక్కువ సమయంలో చేరుకునేందుకు వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ ను అందుబాటులో తెస్తు్న్నారు. వందే భారత్ చైర్ కార్ కు భిన్నంగా.. వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ ను వందల కిలోమీటర్ల దూరం.. రాత్రిపూట ప్రయాణాల కోసం రూపొందించారు. వందే భారత్ స్లీపర్‌ ప్రీమియం ఛార్జీలు భారీగా ఉన్నాయి. అయితే ఈ ట్రైన్ లో RAC, వెయిటింగ్ లిస్ట్‌ సదుపాయం లేదని రైల్వే శాఖ తెలిపింది. దూర ప్రాంత ప్రయాణాలకు వందే భారత్ స్లీపర్ అనుకూలంగా ఉంటుంది. ప్రయాణికుడు తక్కువ దూరం ప్రయాణించినప్పటికీ.. 400 కి.మీ దూరం ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.

వందే భారత్ స్లీపర్ ఛార్జీలు

Advertisement

AC 3-టైర్: కి.మీ.కు రూ. 2.4
AC 2-టైర్: కి.మీ.కు రూ. 3.1
AC ఫస్ట్ క్లాస్: కి.మీ.కు రూ. 3.8

కనీస ఛార్జీలు (400 కి.మీ వరకు)

AC 3-టైర్: రూ. 960
AC 2-టైర్: రూ. 1,240
AC ఫస్ట్ క్లాస్: రూ. 1,520

800 కి.మీ వరకు ఛార్జీలు

Advertisement

AC 3-టైర్: రూ.1,920
AC 2-టైర్: రూ. 2,480
AC ఫస్ట్ క్లాస్: రూ.3,040

1600 కి.మీ వరకు ఛార్జీలు

AC 3-టైర్: రూ.3,840
AC 2-టైర్: రూ.4,960
AC ఫస్ట్ క్లాస్: రూ.6,080

3500 కి.మీ ప్రయాణానికి 1ఏసీ ఛార్జీలు రూ.13,300గా నిర్ణయించారు.

Also Read:  ఒడియమ్మ.. టికెట్ లేకుండా ఏకంగా వందే భారత్ రైల్లో ప్రయాణం, వామ్మో ఇంత మందా?

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×