E-Paper
Advertisement

Vande Bharat Express: గంటకు 180 కిమీల వేగంతో దూసుకెళ్లిన వందే భారత్ స్లీపర్ రైలు, వీడియో షేర్ చేసిన రైల్వే మంత్రి

Vande Bharat Express: గంటకు 180 కిమీల వేగంతో దూసుకెళ్లిన వందే భారత్ స్లీపర్ రైలు, వీడియో షేర్ చేసిన రైల్వే మంత్రి
Advertisement

Vande Bharat Express: జపాన్, చైనా బుల్లెట్ ట్రైన్లు గంటకు 350 నుంచి 450 కి.మీ వేగంతో దూసుకుపోతుంటాయి. ఇంత స్పీడులో కూడా ఎలాంటి కుదుపులు ఉండవని, చుక్క కాఫీ కూడా కింద పడదనే వీడియో చూసే ఉంటారు. భారత్ లో ఇంత స్పీడ్ తో రైళ్లు సాధ్యమా? అనే స్టేజ్ నుంచి సాధ్యమే అని నిరూపించింది భారతీయ రైల్వే. ఇండియన్ బుల్లెట్ ట్రైన్.. ‘వందే భారత్’ పట్టాలెక్కించింది. వందే భారత్ స్పీడులో తన రికార్డులు తానే బద్దలుకొడుతోంది. తాజాగా వందే భారత్ స్లీపర్ ట్రైన్ 180 కి.మీ స్పీడును అందుకుని వాటర్ టెస్ట్ లో పాసైంది. ఈ వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ లో పోస్టు చేశారు.

“ఈరోజు కమిషనర్ రైల్వే సేఫ్టీ వందే భారత్ స్లీపర్‌ను పరీక్షించారు. ఇది కోట నగ్డా సెక్షన్ మధ్య 180 కి.మీ. వేగంతో నడిచింది. అలాగే వాటర్ టెస్ట్ చేసి, ఈ కొత్త తరం రైలు సాంకేతికత పరీక్షించారు” -కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్

తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్

Advertisement

సరికొత్త టెక్నాలజీ, స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయ రైల్వేను ప్రపంచ స్థాయి నెట్‌వర్క్‌గా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. అమృత్ భారత్ రైళ్ల ద్వారా నాన్ ఏసీ ప్రయాణికులకు లగ్జరీ ప్రయాణాన్ని కల్పించింది. త్వరలో తొలి వందే భారత్ స్లీపర్‌ను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ నెల 26 నాటికి దేశంలో మొత్తం 164 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయని రైల్వే శాఖ తెలిపింది. ఈ ఏడాది ప్రధాని మోదీ 42 రైల్వే ప్రాజెక్టులు జాతికి అంకితం చేశారని, 13 ప్రాజెక్టులు ప్రారంభం కాగా.. రూ. 25 వేల కోట్లకు పైగా విలువైన 21 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని మంత్రిత్వ శాఖ తెలిపింది.

Advertisement

272 కి.మీ ప్రాజెక్టు పూర్తి

272 కిలోమీటర్ల ప్రాజెక్ట్ ధాంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ 2025లోనే పూర్తి చేశారు. ఇది 36 సొరంగాలు, 943 వంతెనలను కలిగిన భారీ ప్రాజెక్టు. ప్రపంచంలోని అత్యంత సవాలుతో కూడిన భూభాగాలలో అసాధారణ ఇంజినీరింగ్‌ను ప్రతిభకు ఈ ప్రాజెక్టు నిదర్శనం. మిజోరాంలో 51 కిలో మీటర్ల బైరాబి-సైరాంగ్ బ్రాడ్-గేజ్ లైన్ ను సెప్టెంబర్ లో ప్రారంభించారు. ఐజ్వాల్‌ను తొలి రైల్వే లైన్ ఇదే.

Also Read: Dangerous Roads: ఖర్దుంగ్ లా To సేలా పాస్.. ఈ రోడ్ల మీద ప్రయాణం అంటే ప్రాణం మీద ఆశ వదిలేయాల్సిందే!

ఆధార్ అథెంటికేషన్

రవాణా కారిడార్‌లు, ప్రభుత్వ పెట్టుబడులకు అనుబంధంగా ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం ఈ ఏడాది రైల్వే రంగంలో చోటుచేసుకున్నాయి. రైల్వే ప్రయాణికుల ఆధార్ ధృవీకరణ ఈ ఏడాది కీలక సంస్కరణగా రైల్వే మంత్రి తెలిపారు. ఈ-టికెటింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి ఆధార్ ధృవీకరణ ఉపయోగపడుతుందని ఐఆర్సీటీసీ తెలిపింది. అనుమానాద్ప లావాదేవీలు చేస్తున్న 5.73 కోట్ల ఐఆర్సీటీసీ ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×