BigTV English

Allu Arjun: త్రివిక్రమ్ ను బన్నీ అంత మోసం చేశాడా.. ?

Allu Arjun: త్రివిక్రమ్ ను బన్నీ అంత మోసం చేశాడా.. ?

Allu Arjun:  ఎన్నో  వివాదాల మధ్య పుష్ప 2 రిలీజ్ అయినా కూడా భారీ విజయాన్ని అందుకుంది. పుష్ప 2 తరువాత బన్నీ 1000 కోట్ల క్లబ్ లో చేరాడు. ఇక ఈ సినిమా తరువాత బన్నీ  .. త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఇండస్ట్రీలో కొన్ని కాంబోస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి కాంబోస్ లో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ఒకటి.  ఇప్పటికే  వీరి కాంబోలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో లాంటి సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి.


 

ఇక వీరి కాంబోలో ఇంకో సినిమా వస్తుంది అంటే.. అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. రూమర్ గా ఉన్నప్పుడే భారీ అంచనాలను పెట్టుకున్న అభిమానులు.. మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక దీంతో ఇండస్ట్రీ మొత్తం మరోసారి మారుమ్రోగుతుందని అనుకున్నారు. పుష్ప 2 రిలీజ్ అయ్యింది. హిట్ అయ్యింది.. ఎన్నని రోజులకు బన్నీ- త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. ఈలోపు అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇక దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు. త్రివిక్రమ్ సినిమా క్యాన్సిల్ అయ్యిందా.. ? అని అనుమానాలు వెల్లువెత్తాయి.


 

సరే అట్లీ సినిమా తరువాత అయినా  గురూజీ సినిమా మొదలవుతుందేమో అని చూస్తే.. అది జరిగేలా లేదు. ప్రస్తుతం గురూజీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ మూడింటిలో బన్నీ ప్రాజెక్ట్ లేదు అని తెలుస్తోంది. అట్లీ – బన్నీ సినిమా పూర్తికావడానికి ఏడాది సమయం అన్నా పడుతుంది. ఈలోపు గురూజీ.. వెంకటేష్ తో ఒక సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఇప్పటికే కథను కూడా లాక్ చేశాడని టాక్. ఇక దీని తరువాత అయినా  బన్నీ – గురూజీ తెరకెక్కుతుందేమో అనుకుంటే పొరపాటే. దీని తరువాత. వరుసగా త్రివిక్రమ్.. రామ్ చరణ్ తో ఒక సినిమా, రామ్ తో ఒక సినిమాను పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. మరి బన్నీ సినిమా పరిస్థితి ఏంటి.. ? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

 

బన్నీని త్రివిక్రమ్ ఇంతలా మోసం చేస్తాడా.. ?  అట్లీ సినిమా ముగిసాక అయినా గురూజీతో సినిమా పట్టాలెక్కిస్తాడు అనుకుంటే.. అసలు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఇప్పట్లో అవ్వదు అంటే ఈ సినిమా క్యాన్సిల్ అయ్యినట్లే అని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. కానీ, ఇంకోపక్క మాత్రం వీరి సినిమా పట్టాలెక్కుతోంది అని నిర్మాత బన్నీ వాస్ చెప్పుకొచ్చాడు. కచ్చితంగా డైనమిక్ డ్యూ పట్టాలెక్కుతోందని ఆయన  తెలిపాడు.  ఏడాదిలో అట్లీ సినిమాను పూర్తి చేసి బన్నీ వచ్చినా.. ఆ సమయానికి త్రివిక్రమ్ ఈ మూడు సినిమాలను ఫినిష్ చేస్తాడా.. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబో కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది నిరాశపర్చే వార్త అని చెప్పొచ్చు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ లోనైనా ఈ సినిమా వస్తుందేమో అని చూడడం తప్ప చేసేదేమి లేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ డైనమిక్ డ్యూ ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×