Hyderabad To Goa Vande Bharat Express: దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో కీలకమైనది గోవా. అక్కడ ఎంజాయ్ చేసేందుకు దేశ నలుమూలలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటకులు తరలి వస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ప్రతి ఏటా లక్షలాది మంది యువత గోవా టూర్ కు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా సికింద్రాబాద్ నుంచి గోవాకు ఓ రైలును ప్రారంభించింది సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ రైలుకు సికింద్రాబాద్ – వాస్కోడిగామా ఎక్స్ ప్రెస్ గా పేరు పెట్టింది. వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు మరో గుడ్ న్యూస్ చెప్పబోతోంది రైల్వే సంస్థ. హైదరాబాద్ నుంచి గోవాకు వందేభారత్ రైలును నడిపేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది.
వందేభారత్ రైళ్ల రాకపోకలకు అనుకూలంగా డిస్టెన్స్
ఇప్పటి వరకు ప్రారంభం అయిన అన్ని వందేభారత్ రైళ్లు కేవలం 800 కిలో మీటర్ల పరిధిలో ఉండే నగరాల మధ్యే కొనసాగుతున్నాయి. హైదరాబాద్-గోవా నడుమ కూడా 833 కిలో మీటర్ల దూరం ఉంటుంది. డిస్టెన్స్ కూడా వందే భారత్ రైళ్ల రాకపోకలకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో త్వరలోనే ఈ గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం. ఇప్పటికే ముంబై నుంచి గోవాకు వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కూడా నడిస్తే మన కుర్రవాళ్ల కల నెరవేరినట్లే అవుతుంది. ఈ రైలు విషయంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ చూపుతున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్లను పునర్నిర్మాణం చేయించడంతో పాటు అదనపు రైళ్లను నడిపేలా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్-గోవా నడుమ వందేభారత్ రైలు నడిపేలా అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది.
Read Also: జస్ట్ 13 గంటల్లో ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు.. వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం ఎప్పుడంటే!
సికింద్రాబాద్ నుంచి గోవాకు నేరుగా రైలు
ఈఏడాది అక్టోబర్ 6న సికింద్రాబాద్-గోవా రైలు ప్రారంభం అయ్యింది. వాస్కోడిగామా పేరుతో ఈ రైలును ప్రారంభించారు. ఈ రైలు బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరుతుంది. ఆ తర్వాతి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా స్టేషన్ కు చేరుకుంటుంది. అటు వాస్కోడిగామా స్టేషన్ నుంచి సికింద్రాబాద్ స్టేషన్ కు గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. అక్కడ ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంటుంది. ఇక ప్రతి ఏటా గోవాకు 80 లక్షల మంది భారతీయులు వెళ్తారు. వారిలో సుమారు 20 శాతం మంది తెలుగువాళ్లే ఉన్నారు. వందేభారత్ ఎక్స్ ప్రెస్ కూడా అందుబాటులోకి వస్తే పర్యాటకుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. గోవా వెకేషన్ కు వెళ్లాలనుకునే వాళ్లు ఇక ఈజీగా ప్లాన్ చేసుకోచ్చు.
Read Also: ఈ ఏడాది ఇన్ని వందేభారత్ రైళ్లు ప్రారంభం అయ్యాయా? వచ్చే ఏడాది ఇండియన్ రైల్వేలో మరింత జోష్!