Ayodhya Cricket Stadium: గతేడాది 2023 సెప్టెంబర్ 23వ తేదీన ఉత్తర ప్రదేశ్ లోని వారణాసి గంజరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రూపకల్పనకు ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ లతోపాటు బీసీసీఐ ప్రెసిడెంట్ రోజన్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల, సెక్రటరీ జైషా సహ బీసీసీఐ అధికారులు కూడా ప్రధాని నరేంద్ర మోడీతో ఈ స్టేడియానికి శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read: MS Dhoni: ధోని క్రికెట్ ప్రస్థానానికి నేటితో 20 ఏళ్లు!
వారణాసిలోని ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి భూసేకరణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. 121 కోట్లను వెచ్చించింది. ఇక బిసిసిఐ ఈ స్టేడియం నిర్మాణానికి 330 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. కాన్పూర్, లక్నో తరువాత ఉత్తరప్రదేశ్ లో ఇది మూడవ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియాన్ని అధునూతనంగా నిర్మించారు.
ఫ్లడ్ లైట్ లను త్రిశూల ఆకారంలో ఏర్పాటు చేశారు. అలాగే వీఐపీ గ్యాలరీని డమరుకం ఆధారంలో తీర్చిదిద్దారు. అయోధ్య – సుల్తాన్ పూర్ రహదారిపై ఏర్పాటుచేసిన ఈ స్టేడియం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇది డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ లో భాగమని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ స్టేడియంలో 40,000 మంది ప్రేక్షకులు ఒకేసారి కూర్చునే అవకాశం ఉంటుంది.
ఇక అహ్మదాబాద్ లోని సబర్మతి నది సమీపంలో ఉన్న మోతేరా ప్రాంతంలో నిర్మించిన నరేంద్ర మోడీ స్టేడియం ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియాన్ని మొదట 1982లో సర్దార్ వల్లభాయ్ పటేల్ పేరుతో 49 వేల మంది అభిమానులు ఒకేసారి వీక్షించేందుకు వీలుగా నిర్మించారు. ఈ స్టేడియాన్ని 2017 అక్టోబర్ లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ ఈ స్టేడియాన్ని ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన క్రికెట్ వేదికగా నిర్మించాలని సుమారు 800 కోట్ల వ్యయంతో ఈ స్టేడియాన్ని పునర్నిర్మించారు.
2020 ఫిబ్రవరిలో ఈ నిర్మాణం పూర్తయింది. ఈ స్టేడియంలో సుమారు 1.3 లక్షల మంది అభిమానులు క్రికెట్ ని వీక్షించేందుకు వీలుగా పునర్నిర్మించారు. అంతేకాదు అప్పటివరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గా ఉన్న ఆ స్టేడియం పేరును 2020 తర్వాత నరేంద్ర మోడీ స్టేడియంగా మార్చేశారు. ఈ స్టేడియం మోతేరా లో ఉండడం వల్ల మోతేరా స్టేడియం అని కూడా పిలుస్తుంటారు.
Also Read: sameer rizvi fastest double century: ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ బ్యాటర్ సంచలన డబుల్ సెంచరీ
ఆస్ట్రేలియాలోని మేల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ 90 వేల సీటింగ్ కెపాసిటీతో మొదటి స్థానంలో ఉండగా.. దాన్ని మించి 1.3 లక్షల మంది వీక్షించేందుకు వీలుగా ఈ స్టేడియాన్ని నిర్మించడంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానం గా పేరుపొందింది. ఇక ప్రపంచంలోని క్రికెట్ మైదానాలలో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ రెండో స్థానంలో ఉండగా, మూడవ స్థానంలో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్, నాలుగో స్థానంలో రాయ్ పూర్ లోని షాహిద్ వీర్ నారాయణ సింగ్ స్టేడియం, ఐదవ స్థానంలో ఆస్ట్రేలియాలోని పెర్త్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాలుగా ఉన్నాయి.