Indian Railways Year Ender 2024: భారతీయ రైల్వే సంస్థ 2024లో మరింత పురోగతి సాధించింది. దేశ వ్యాప్తంగా సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు మరింతగా విస్తరించాయి. వేగవంతమైన, సౌకర్యవంతమైన కనెక్టివిటీని అందిస్తూ ముందుకుసాగుతున్నాయి. ఈ ఏడాది పలు రూట్లలో వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. మరిన్ని ప్రాంతాలను కవర్ చేస్తున్నాయి. వందేభారత్ రైళ్ల ద్వారా ప్రజలు సరికొత్త ప్రయాణ అనుభూతిని పొందుతున్నారు.
2024లో 30కి పైగా వందేభారత్ రైళ్లు ప్రారంభం
భారతీయ రైల్వే సంస్థ 2024లో ఏకంగా 30కి పైగా వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. 2024 చివరి నాటికి దేశ వ్యాప్తంగా మొత్తం 136 వందేభారత్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్లు దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, ప్రాంతాలను అనుసంధానిస్తున్నాయి.
2024లో కొత్త అందుబాటులోకి వచ్చిన కొత్త వందేభారత్ రైళ్లు
⦿ న్యూఢిల్లీ-వారణాసి వందే భారత్ ఎక్స్ ప్రెస్ (20-కోచ్)
⦿ నాగ్‌పూర్-సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ (20-కోచ్)
⦿ చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ మధురై-బెంగళూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ మీరట్ సిటీ-లక్నో వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ టాటానగర్-పాట్నా వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ గయా-హౌరా వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ రూర్కెలా-హౌరా వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ ఆగ్రా-వారణాసి వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ పూణే-హుబ్బల్లి వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ కొల్హాపూర్-పూణే వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ దుర్గ్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ భాగల్పూర్-హౌరా వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ దియోఘర్-వారణాసి వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ టాటానగర్-బ్రహ్మాపూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ జమ్ము తావి-శ్రీనగర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ చండీగఢ్-అమృతసర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ జైపూర్-ఉదయ్‌పూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ అహ్మదాబాద్-రాజ్‌కోట్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ ముంబై-గోవా వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ ముంబై-షిర్డీ వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ హైదరాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ భోపాల్-ఇండోర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ భోపాల్-జబల్పూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ రాయ్‌పూర్-భువనేశ్వర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ కోయంబత్తూరు-కొచ్చి వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ గౌహతి-ఇంఫాల్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ గౌహతి-అగర్తలా వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ కోల్‌కతా-సిలిగురి వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ లక్నో-గోరఖ్‌పూర్ వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ పాట్నా-దర్భంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్
⦿ చెన్నై-కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్ ప్రెస్
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల ప్రత్యేకతలు
వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అత్యంత వేగం, మెరుగైన సౌకర్యాలు, అత్యాధునిక భద్రతతో ప్యాసెంజర్లకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నాయి. ఈ రైళ్లు గరిష్టంగా గంటకు 160 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. ఇందులోని ఆధునిక ఇంటీరియర్స్, చక్కటి సీటింగ్ ఆకట్టుకుంటున్నాయి. ఈ రైళ్లు పవర్ ఫుల్ ఇంజిన్లు, ఆన్ బోర్డ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ను కలిగి ఉన్నాయి. అంతేకాదు, ఈ రైళ్లకు కవచ్ సిస్టమ్ తో భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నది. మొత్తంగా 2019లో అందుబాటులోకి వచ్చిన వందేభారత్ రైళ్లు, ఎప్పటికప్పుడు సరికొత్తగా అప్ డేట్ అవుతూ ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి.
Read Also: అద్భుతమైన పనోరమిక్ రైలు ప్రయాణాలు, జీవితంలో ఒక్కసారైనా జర్నీచేయాల్సిందే!