BigTV English

Allu Arjun Case : సంధ్య థియేటర్ ఘటన ఎఫెక్ట్… బన్నీకి వ్యతిరేకంగా ఉన్న డిమాండ్స్ ఇవే..

Allu Arjun Case : సంధ్య థియేటర్ ఘటన ఎఫెక్ట్… బన్నీకి వ్యతిరేకంగా ఉన్న డిమాండ్స్ ఇవే..

Allu Arjun Case : తానొకటి తలిస్తే దేవుడు ఒకటి తాలిచినట్టు ఉంది అల్లు అర్జున్ పరిస్థితి. పుష్ప 2 అనే బ్లాక్ బస్టర్ హిట్ మూవీ చేశాడు. ఇప్పటి వరకు 1600 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. కానీ సంధ్య థియేటర్ ఘటన వల్ల ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు అల్లు అర్జున్. థియేటర్ వద్ద అంత క్రౌడ్ ఉన్న టైంలో రోడ్ షో చేస్తూ రావడం, పోలీసులు చెప్పినా.. అల్లు అర్జున్ థియేటర్ నుంచి కదలకపోవదడం లాంటివి లీగల్‌గా ఆయనకు పెద్ద మైనస్ అవుతున్నాయి. దీంతో పాటు బెయిల్‌పై వచ్చిన తర్వాత సెలబ్రెటీల లైవ్ పరామర్శలు, ప్రెస్ మీట్ కూడా అల్లు అర్జున్‌కి నెగిటివ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కొన్ని డిమాండ్స్ వస్తున్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్ధాం…


A 1 గా మార్చాలి…

సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. దీనికి కారణం.. పర్మిషన్ లేకపోయినా.. అల్లు అర్జున్ అక్కడికి రావడం అని పోలీసులు చెబుతున్న మాట. అనుమతి లేకుండా థియేటర్‌కి వచ్చినా… సైలెంట్‌గా కాకుండా… రోడ్డు షో చేస్తూ రావడం వల్ల క్రౌడ్ ఎక్కవ అయ్యారని, అందువల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఆనాడు అరెస్ట్ నుంచి నేటి వరకు పోలీసులు అదే చేబుతున్నారు. ముషిరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి సంధ్య థియేటర్ వరకు అల్లు అర్జున్ రోడ్డు షో చేస్తూ వచ్చాడు. అలా థియేటర్ గేట్ వరకు వచ్చిన తర్వాత ఆయన కారుతో పాటు చాలా మంది అభిమానులు థియేటర్ లోపలికి వచ్చారు. దీంతో థియేటర్‌లో క్రౌడ్ పెరిగిపోయి తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో రేవతి చనిపోగా… శ్రీ తేజ్ కు బ్రెయిన్ డ్యామేజ్ అయింది.


రేవతి చనిపోయిన తర్వాత… ఇలా తొక్కిసలాట జరిగిందని, బన్నీ థియేటర్ నుంచి వెళ్లిపోవాలని కోరినట్టు పోలీసులు చెబుతున్నారు. అప్పుడు కూడా అల్లు అర్జున్ మూవీ మొత్తం అయిపోయాకే వెళ్తామని చెప్పారట. ఇసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల వల్ల… పోలీసులు చెబుతున్న దాని ఘటన జరగడానికి ప్రాధాన కారణం అల్లు అర్జునే అని అంటున్నారు నెటిజన్లు.

ఈ నేపథ్యంలో ఈ కేసులో అల్లు అర్జున్ ను A1 మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం అల్లు అర్జున్ ఈ కేసులో A 11 గా ఉండగా, థియేటర్ యాజమాన్యం A 1 ఉన్నారు.

నేషనల్ అవార్డును వెనక్కి తీసుకోవాలి…

పుష్ప పార్ట్ 1లో అల్లు అర్జున్ చేసిన నటనకు గాను ఆయనకు బెస్ట్ యాక్టర్ క్యాటగిరిలో నేషనల్ అవార్డు వచ్చింది. నేషనల్ అవార్డు వచ్చిన నాటి నుంచి దీనిపై కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. ఒక స్మగ్లింగ్ చేసే పాత్రకు నేషనల్ అవార్డు రావడం ఏంటి అని వ్యతిరేకత వచ్చింది. తాజాగా ఇప్పుడు సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ప్రమేయం ఉండటంతో నేషనల్ అవార్డును వెంటనే వెనక్కి తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

రేవతి కుటుంబానికి నష్టపరిహారం…

ఘటన తర్వాత అల్లు అర్జున్ రెస్పాండ్ అయి… రేవతి కుటుంబానికి 25 లక్షల సాయాన్ని ప్రకటించాడు. అలాగే శ్రీ తేజ్ కు హాస్పిటల్ ఖర్చులు అన్నీ భరిస్తానని చెప్పాడు. అయితే దీనిపై చాలా వ్యతిరేకత వచ్చింది. ముష్టి వేస్తున్నారా అనే కామెంట్స్ కూడా వినపడ్డాయి. దీంతో అల్లు అర్జున్ అప్రమత్తమై… డైరెక్టర్, నిర్మాత, హీరో ముగ్గురు కలిసి శ్రీతేజ్ కోసం ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి దాంట్లో 2 కోట్ల వరకు వేయాలని చూస్తున్నారట. ఈ ట్రస్ట్ లో శ్రీ తేజ్ తండ్రితో పాటు టాలీవుడ్ కి చెందిన కొంత మంది పెద్దలు కూడా ఉంటారని సమాచారం.

అయితే దీనిపై కూడా వ్యతిరేకత వస్తుంది. పుష్ప 2 కలెక్షన్స్ లలో దాదాపు 10 శాతం మేర శ్రీతేజ్ కుటుంబానికి ఇవ్వాలని MLC తీన్మార్ మల్లన్న ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఇలాంటి డిమాండ్స్ వస్తున్నాయి. వీటితోపాటు బాధిత కుటుంబానికి కనీసం 5 కోట్లు అయినా ఇవ్వాలి అంటూ కొన్ని డిమాండ్స్ కూడా తెరమీదకి వస్తున్నాయి.

బాయ్ కాట్ అల్లు అర్జున్…

థియేటర్ అంటే… ప్రతి ఆర్టిస్ట్ కి ఓ దేవాలయం లాంటిది. అక్కడే వారి భవిష్యత్తు తెలుస్తుంది. అలాంటి థియేటన్ దగ్గర అల్లు అర్జున్ బాధ్యతాయుతంగా ప్రవర్తించలేదని, థియేటర్‌లో ఒకరు చనిపోయారు అని పోలీసులు చెప్పిన బయటికి రాలేదునే వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఇండస్ట్రీ నుంచి అల్లు అర్జున్ ను బాయ్ కాట్ చేయాలి అనే డిమాండ్స్ కూడా వస్తున్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×