E-Paper
Advertisement

Vande Bharat Train: ఫుల్లుగా తాగి ట్రాక్ మీద ఆటోను వదిలేసిన డ్రైవర్, ఒక్కసారిగా వందేభారత్..

Vande Bharat Train: ఫుల్లుగా తాగి ట్రాక్ మీద ఆటోను వదిలేసిన డ్రైవర్, ఒక్కసారిగా వందేభారత్..
Advertisement

Vande Bharat Emergency Stop: వందేభారత్ లోకో పైలెట్ అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. కాసరగోడ్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ (రైలు నం. 20633)కు రాత్రి 10 గంటలకు ఊహించని ఘటన ఎదురయ్యింది.  రైల్వే ట్రాక్ మీద ఆటో అడ్డంగా నిలిపి ఉండటాన్ని గమనించిన లోకో పైలట్ వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో రైలు ఆటోను తగలక ముందే ఆగిపోయిందని అధికారులు తెలిపారు. ఆ ఆటోలో డ్రైవర్, ప్రయాణీకులు లేరని తెలిపారు.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?   

కాసరగోడ్ కు చెందిన సుధి అనే ఆటో డ్రైవర్ నిన్న సాయంత్రం బాగా మద్యం సేవించాడు. తాగిన మైకంలో రాత్రి సమయంలో ఆటోను రైల్వే ట్రాక్ మీదే వదిలేసి వెళ్లిపోయాడు. రాత్రి సుమారు 10.10 ఆ రూట్ లో వందేభారత్ రైలు వచ్చింది. దూరంగా ఉండగానే రైల్వే ట్రాక్ మీద ఆటో ఉన్నట్లు లోకో పైలెట్ గుర్తించాడు. వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేశాడు. రైలు ఆటో దగ్గరికి వెళ్లి ఆగిపోయింది. వెంటనే, ఈ విషయాన్ని రైల్వే అధికారులకు చెప్పాడు. రైల్వే రక్షణ దళం, ఇంజనీరింగ్ విభాగం అధికారులతో పాటు స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనాన్ని ట్రాక్ మీద నుంచి పక్కకు తీశారు. భద్రతా తనిఖీల తర్వాత, రైలు రాత్రి 11:15 గంటలకు తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించి రాత్రి 11:50 గంటలకు తిరువనంతపురం సెంట్రల్‌కు చేరుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని, సాధారణ సేవలకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడలేదని తెలిపారు.

ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

Advertisement

అటు లోకో పైలెట్ చాకచక్యంగా వ్యవహరించడంతోనే ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు వెల్లడించారు. పెను ప్రమాదం నుంచి ప్రయాణీకుల ప్రాణాలను కాపాడిన పైలెట్ ను అభినందించారు. అదే సమయంలో ట్రాక్ మీద ఆటోను వదిలి వెళ్లిన డ్రైవర్ సుధిని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Read Also: 50 ఎకరాల్లో ప్రపంచ స్థాయి వండర్‌ లా.. విశాఖ దశ తిరిగిపోవాల్సిందే!

రైలు ప్రమాదంలో 8 ఏనుగులు మృతి

Advertisement

రీసెంట్ గా అస్సాంలోని లమ్డింగ్ డివిజన్‌లో సైరంగ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ ప్రెస్ రైల్వే ట్రాక్ దాటుతున్న మందను ఢీకొట్టడంతో  ఎనిమిది ఏనుగులు మరణించాయి. దట్టమైన పొగమంచు కారణంగా విజుబులిటీ తగ్గడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు సూచించారు. జమునాముఖ్-కాంపూర్ విభాగంలో తెల్లవారుజామున 2.17 గంటల ప్రాంతంలో దట్టమైన పొగమంచు దృశ్యమానతను తగ్గించిందని, దీని ఫలితంగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లోకోమోటివ్, ఐదు కోచ్‌లు పట్టాలు తప్పాయి. అయితే, ఈ సంఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు ఈ ప్రమాదం కారణంగా అస్సాం, ఈశాన్య ప్రాంతాలలో రైలు సేవలు నిలిచిపోయాయి.

Read Also: హైదరాబాద్ నుంచి ఏపీలోని ఈ నగరాలకు బుల్లెట్ ట్రైన్.. ఎప్పుడు మొదలుకానుందంటే?

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×