భారతీయ రైల్వేలో సెమీ హైస్పీడ్ రైలుగా గుర్తింపు తెచ్చుకున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్ ప్రయాణీకులకు అత్యంత వేగవంతమైన ప్రయాణంతో పాటు అత్యాధునిక సౌకర్యాలను కల్పిస్తోంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా సుమారు 150 వందేభారత్ రైళ్లు సేవలు అందిస్తున్నాయి. తాజాగా మరో రెండు రైళ్లు ప్రయాణీకుల ముందుకు వచ్చాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరిని దేశంలోని రెండు ప్రధాన నగరాలను కలుపుతూ ఈ రైళ్లు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. పూరికి వెళ్లాలనుకునే ప్రయాణీకులకు ఈ రైళ్లు మరింత మేలు కలిగించనున్నాయి.
పూరికి తాజాగా రెండు వందేభారత్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఒకటి పూరి–హౌరా ఎక్స్ ప్రెస్ కాగా, మరొకటి పూరి–రూర్కెలా ఎక్స్ ప్రెస్. పూరి-హౌరా ఎక్స్ ప్రెస్ ఒడిశా తీరప్రాంత ఆలయ పట్టణాన్ని కోల్ కతాతో కలుపుతుంది. ఇది యాత్రికులకు, పర్యాటకులకు ముఖ్యమైన కారిడార్గా కొనసాగుతుంది. పూరి-రూర్కెలా సర్వీస్ తూర్పు, పశ్చిమ ఒడిశాను కలుపుతుంది. రాష్ట్రం అంతటా ఉన్న భక్తులకు సజావుగా ఉండేలా దీనిని సెట్ చేశారు.
వందే భారత్ రైళ్లు తీర్థయాత్రలతో పాట పర్యాటక రంగానికి ఎంతో కీలకంగా మారాయి. జగన్నాథ ఆలయానికి ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. భక్తులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు ఈ రైళ్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ప్రీమియం కోచ్‌లు, తగ్గిన ప్రయాణ సమయం, ఎయిర్ కండిషన్డ్ సౌకర్యం యాత్రికులకు ఎంతో ఆహ్లాదకర ప్రయాణాన్ని అందిస్తున్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ రైలు ప్రయాణం ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుంది. రథయాత్ర లాంటి రద్దీ సమయాల్లో, ఈ రైళ్లు వేగవంతమైన టర్నరౌండ్ టైమింగ్స్ ఫాలో అవుతున్నాయి. అదనపు సామర్థ్యాన్ని అందించడం ద్వారా రద్దీకి అనుగుణంగా సేవలు అందిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, పశ్చిమ ఒడిశా నుంచి భక్తులు సులభంగా పూరికి చేరుకుంటున్నారు.
ఈ రెండు మార్గాల్లో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు డిమాండ్ విపరీతంగా ఉన్న నేపథ్యంలో భారత రైల్వే వీటి సామర్థ్యాన్ని పెంచింది. పూరి-హౌరా వందే భారత్ రైలును 20 కోచ్ రేక్‌గా అప్‌గ్రేడ్ చేశారు. ఇందులో 16 AC చైర్ కార్లు, రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయి. అటు పూరి వెళ్లే ప్రయాణికులకు పరోక్షంగా ప్రయోజనం చేకూర్చే రూర్కెలా-హౌరా వందే భారత్ రైలును 8 నుండి 16 కోచ్‌లకు రెట్టింపు చేశారు. ఈ నిర్ణయం రోజువారీ ప్రయాణీకులు, పర్యాటకులకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నాయి. పండుగల సమయంలో అధిక డిమాండ్ కారణంగా ప్రయాణీకులకు ఇబ్బంది కలిగేది. కానీ, ఇప్పుడు వందేభారత్ రైళ్ల రాకతో మరింత వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని పొందుతున్నారు. అంతేకాదు, పూరి స్టేషన్ చుట్టూ మౌలిక సదుపాయాలను మరింత మెరుగు పరిచేందుకు భారతీయ రైల్వే కీలక చర్యలు చేపడుతోంది.
Read Also: ఐఆర్‌సీటీసీలో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ స్టార్ట్ అయ్యేది ఈ టైమ్‌లోనే.. ఇది గుర్తుపెట్టుకోండి!