Bigg Boss 10:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss) గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. దేశవ్యాప్తంగా వివిధ భాషలలో ఈ రియాలిటీ షో ప్రసారం అవుతున్నా.. తెలుగు ఆడియన్స్ ని కూడా ఎప్పటికప్పుడు సరికొత్త టాస్క్ లతో ఈ షో అలరిస్తోంది. అందులో భాగంగానే తెలుగులో 9 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 10వ సీజన్ కూడా ఘనంగా ప్రారంభమైంది అగ్నిపరీక్ష సీజన్ 2 ద్వారా 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టగా.. 10 మంది సెలబ్రిటీలు విచ్చేశారు. మొత్తం 16 మందితో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ఘనంగా ప్రారంభమైంది.
షో ప్రారంభమైన వారంలోనే మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ ఏకంగా ఇద్దరిని హౌస్ నుంచి పంపించేశారు. అందులో ఒకరు కామనర్ కేటగిరీలో హౌస్ లోకి అడుగుపెట్టిన ఆర్జె చరణ్ కాగా, మరొకరు సెలబ్రిటీ జాబితాలో హౌస్ లోకి వచ్చిన చైత్ర రాయ్. వీరిద్దరూ కూడా మొదటి వారమే అందరిని ఆశ్చర్యపరిచారు. వారిలో ముగ్గురు మాత్రమే హౌస్ మేట్స్ గా నిలవగా.. మిగిలిన 11 మంది డేంజర్ జోన్ లో ఉన్నారు. హౌస్ లోకి వైల్డ్ కార్డ్స్ ద్వారా ఏకంగా 8 మంది హౌస్ లోకి రాబోతున్నట్లు వార్తలు వినిపించగా.. అందులో హౌస్ లోకి వచ్చే ఆ ఇద్దరు వీరే అంటూ ఇద్దరి పేర్లు వైరల్ గా మారాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. అగ్నిపరీక్ష సీజన్ 2లో తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ ను మెప్పించిన మిథిలేష్ , అపూర్వ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వెలువడనుంది. మరొకవైపు కామనర్స్ కేటగిరీలో నూకరాజు, రాకింగ్ రాకేష్ లతోపాటు సీరియల్ నటి సౌందర్య పేర్లు వినిపిస్తున్నాయి. మరి హౌస్ లోకి ఎవరు అడుగు పెట్టబోతున్నారో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.
ALSO READ:డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సుమంత్!
ఇదిలా ఉండగా ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ సీజన్ 10 ప్రేక్షకులను అలరిస్తోంది. సాధారణంగా ఎలిమినేషన్ విషయంలోనే అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొదటివారం ఎలిమినేషన్ దాదాపుగా ఉండదు. అలాంటిది మిడిల్ ఎలిమినేషన్ పెట్టారు. పైగా ఇద్దరిని హౌస్ నుంచి పంపించడం ఆశ్చర్యంగా మారింది. అటు ఈ బిగ్ బాస్ షోలో పెట్టే గేమ్స్ కూడా కంటెస్టెంట్స్ ని అయోమయంలో పడేస్తున్నాయి అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. హోస్ట్ నాగార్జున చెప్పినట్టుగానే అన్ని పది రెట్లు ఉండబోతున్నాయి అనే విషయం మాత్రం స్పష్టంగా వ్యక్తమవుతోంది. మరొకవైపు లవ్ ట్రాక్ లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా విడుదల చేసిన ప్రోమోలో దేబ్జానీ.. ముఖేష్ తనను పట్టించుకోవట్లేదు అంటూ చేసిన కామెంట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.