Akkineni Sumanth:ఈ మధ్యకాలంలో ఓ సినిమా ఫంక్షన్‌లో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy vanga) మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో ఎంత హీట్ పెంచేశాయో అందరికీ తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ శేఖర్ కమ్ముల సినిమాల హీరోలపై తన అభిప్రాయాన్ని ఓపెన్‌గా చెప్పేశారు.
ఎందుకో తెలియదు.. శేఖర్ కమ్ముల హీరోలు నాకు నచ్చరు. ఆయన సినిమాలో హీరోయిన్స్ అయితే నాకు బాగా నచ్చుతారు. శేఖర్ కమ్ముల సినిమాల్లోని హీరోలు చాలా సాఫ్ట్‌గా, అమాయకంగా, రిజర్వ్డ్‌గా ఉంటారు అన్న విధంగా సందీప్ రెడ్డి వంగా మాట్లాడారు. ఇది పూర్తిగా సందీప్ రెడ్డి వంగా అభిప్రాయం. దీని గురించి శేఖర్ కమ్ముల కూడా పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. కానీ అభిమానులు మాత్రం బాగా సీరియస్ అయిపోయారు.
శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయన కథల్లో హీరో అంటే తప్పనిసరిగా మాస్‌గా, ఫుల్ స్పీడ్‌గా ఉండాల్సిన అవసరం లేదు. నార్మల్ పర్సన్‌గా, చాలా రిజర్వ్డ్‌గా ఉంటూనే సినిమాని హిట్ కొట్టే విధంగా చూపిస్తారు అంటూ శేఖర్ కమ్ములకు బాగా సపోర్ట్ చేస్తూ సందీప్ రెడ్డి వంగాకు కొంతమంది శేఖర్ కమ్ముల అభిమానులు కౌంటర్లు ఇచ్చారు.
అయితే ఇదే ఇష్యూపై రీసెంట్‌గా సుమంత్ స్పందించారు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం మహేంద్రగిరి వారాహి. ఈ సినిమా ప్రమోషన్స్ లో ప్రభావంగా ప్రెస్ మీట్ నిర్వహించగా అందులో శేఖర్ కమ్ముల హీరోలపై వచ్చిన కామెంట్స్‌పై ఆయన స్పందిస్తూ.. నిజానికి శేఖర్ కమ్ముల హీరోల్లో సుమంత్ కూడా ఒకరు. ‘గోదావరి’ సినిమా ఆయన కెరీర్‌ను టర్న్ చేసింది. దీని గురించి ఆయన రియాక్ట్ అవుతూ చాలా పాజిటివ్‌గా మాట్లాడారు. ‘‘ఎవరి అభిప్రాయం వాళ్లకు ఉంటుంది. ఎవరి ఇష్టం వాళ్లకు ఉంటుంది. వాళ్లని మనం ఏమీ తప్పుపట్టాల్సిన పనిలేదు. నాకు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా చాలా చాలా ఇష్టం. నా ఫేవరెట్ మూవీస్‌లో అది కూడా ఇప్పుడు టాప్‌లో ఉంటుంది’’ అంటూ చెప్పుకొచ్చారు.
ALSO READ:బిగ్ బాస్ 10.. చూడట్లేదంటున్న దేబ్జానీ.. కాస్త పట్టించుకోవయ్యా ముఖేష్!
దీంతో సుమంత్ మాటలకు అందరూ ఫిదా అయిపోయారు. అదే సుమంత్ ప్లేస్‌లో వేరే ఏ హీరో ఉన్నా రచ్చ రంబోలా చేసేవాళ్లు.. రాద్ధాంతం చేసేసేవాళ్లు. కానీ సుమంత్ మాత్రం చాలా సాఫ్ట్‌గా మ్యాటర్‌ను క్లోజ్ చేశారు.ఎవరి ఇష్టం వాళ్లది అన్నట్లు జెన్యూన్‌గా మాట్లాడారు. నిజానికి సుమంత్‌కి ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ఎప్పుడూ కాంట్రవర్సీలకు వెళ్లరు. తన పని తాను చూసుకుంటూ పాజిటివిటీకి కేరాఫ్ అడ్రస్‌గా ఉంటారు. అందుకే ఆయనంటే అభిమానులు ఇప్పటికీ లైక్ చేస్తూనే ఉంటారు.
సుమంత్ తనదైన స్టైల్‌లో చెప్పిన ఆన్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. అయితే కొంతమంది అభిమానులు మాత్రం సందీప్ రెడ్డి వంగాకు ఘాటు కౌంటర్లు ఇస్తున్నారు. శేఖర్ కమ్ముల సినిమాలు చాలా బాగుంటాయని, ఆయన సినిమాల్లోని హీరోలు టాప్ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. శేఖర్ కమ్ముల హీరోలపై సందీప్ రెడ్డి వంగా అభిప్రాయం ఏదైనా సరే.. సుమంత్ మాత్రం తన డిగ్నిటీతో ఆన్సర్ చెప్పి సినిమా ఇండస్ట్రీ పరువు కాపాడతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు.