E-Paper
Advertisement

ఈ సక్సెస్ ఒక్క రాత్రిలో వచ్చింది కాదు… నెగిటివిటీ పై కన్నీళ్లు పెట్టుకున్న వైష్ణవి!

ఈ సక్సెస్ ఒక్క రాత్రిలో వచ్చింది కాదు… నెగిటివిటీ పై కన్నీళ్లు పెట్టుకున్న వైష్ణవి!
Advertisement

Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య పరిచయం అవసరం లేని పేరు. ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు అనంతరం కవర్ సాంగ్స్ షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన వైష్ణవి చైతన్య ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడంతో ఈమెకు హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. వైష్ణవి చైతన్య ఆనంద్ దేవరకొండ జంటగా బేబీ (Baby)సినిమా ద్వారా హీరోయిన్ గా ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇలా మొదటి సినిమాతోనే వైష్ణవి చైతన్య ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు..

నెగిటివ్ ట్రోలింగ్ పై వైష్ణవి ఎమోషనల్..

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తదుపరి వరుస సినిమాలలో నటిస్తూ వైష్ణవి చైతన్య ఎంతో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా మరోసారి ఈమె ఆనంద్ దేవరకొండతో కలిసి నటించిన ఎపిక్ సినిమా (Epic Movie)ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే వైష్ణవి చైతన్య వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇలా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన సక్సెస్ గురించి అలాగే తన పట్ల వచ్చిన నెగిటివిటీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

రాత్రికి రాత్రే సక్సెస్ రాలేదు..

Advertisement

బేబీ సినిమా సక్సెస్ అనేది నాకు రాత్రికి రాత్రే వచ్చింది కాదని తెలిపారు. ఆ సక్సెస్ వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయని వైష్ణవి చైతన్య తెలిపారు. కవర్ సాంగ్స్ షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ లలో నటించి ఎంతో కష్టపడుతూ ఇక్కడికి చేరుకున్నాను. ఇక బేబీ సినిమా విడుదలైన తర్వాత సినిమాకు చాలా మంచి సక్సెస్ వచ్చింది ఈ సినిమా సక్సెస్ చూసి బాధపడాలా? లేకపోతే నా పట్ల వస్తున్న విమర్శలు చూసి ఏడవాలో? అర్థం కాని పరిస్థితి నాదని తెలిపారు. బేబీ సినిమా విడుదలైన తరువాత చాలామంది నన్ను ఉద్దేశించి నోటికొచ్చినట్లు గలీజ్ మాటలు మాట్లాడారని ఈమెకు తెలిపారు.

పోస్టర్ పై చెప్పుతో కొట్టారు..

ఇక బేబీ సినిమా తర్వాత చాలామంది సినిమా పోస్టర్ వద్దకు వెళ్లి నా ఫోటో పై చెప్పు తీసుకొని కొట్టారని వాటన్నింటినీ స్వయంగా చూసి తాను ఎంతో కుమిలిపోయానని వైష్ణవి చైతన్య తెలిపారు. ఇలా తన గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో మానసికంగా కృంగిపోయానని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక బేబీ సినిమా తర్వాత దిల్ రాజ్ కుమారుడు ఆశిష్ రెడ్డి తో కలిసి ఈమె లవ్ మీ అనే సినిమాలో నటించారు. అనంతరం సిద్దు జొన్నలగడ్డ జాక్ అనే సినిమాలో నటించారు. ఈ రెండు సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా ఈమె ఆనంద్ దేవరకొండతో కలిసి ఎపిక్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా పర్వాలేదు అనిపించింది.

Advertisement

Also Read: ‘శ్రీకృష్ణుడికే నిందలు తప్పలేదు మేమెంత’? యూట్యూబర్ నందన ఆడియో వైరల్!

Related News

లండన్ వీధులలో జంటగా విజయ్ త్రిష…వీడియో వైరల్!

జిమ్‌లో మాళవిక శర్మ హంగామా ..ఫొటో చూస్తే ఫ్యాన్స్ ఫిదా!

తాప్సీ ఎందుకింత కష్టం.. నీ వల్ల కాదులే – నెటిజన్స్ ట్రోల్స్!

బన్నీతో ఆ ఒక్క సీన్.. వైష్ణవిచైతన్యకి చుక్కలు కనిపించాయట!

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన సుమంత్!

గోవాలో సమీరా రెడ్డి ఫ్యామిలీ హంగామా.. మధ్యలో మొసలి ట్విస్ట్!

మా వైపు తప్పే లేదు.. డాన్సర్స్ అసోసియేషన్ వివాదంపై సుమలత ఫైర్

Big Stories

Advertisement
×