Indian Railways update: ఇండియన్ రైల్వే మరోసారి ప్రయాణికులకు మంచి వార్త అందించింది. విజయవాడ నుండి లింగంపల్లి మధ్య నడిచే ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (12795/96) రైలుకు శాశ్వతంగా అదనపు బోగీలను జత చేశారు. ఇది రైలులో ఎప్పటికప్పుడు ఎదురవుతున్న రద్దీ సమస్యకు సమాధానంగా మారనుంది. రైల్వే శాఖ ఈ మార్పును శాశ్వతంగా అమలు చేయడం వల్ల, రోజూ ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులకు పెద్ద ఊరటగా మారనుంది.
ఈ మార్పుతో ప్రయాణంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. టికెట్ కోసం ఎదురుచూడటం, వెయిటింగ్ లిస్ట్ కోసం వేచిచూడటం, స్టాండింగ్‌లో ప్రయాణించడం లాంటి ఇబ్బందులకు ఇక శుభంకార్డు పడినట్లే. ఇప్పుడు మరిన్ని సీట్లు లభ్యమవుతున్నాయి కాబట్టి టికెట్ పొందడం సులభంగా మారుతుంది. ప్రయాణం కంఫర్టబుల్‌గా, ప్రశాంతంగా సాగుతుంది. కుటుంబంతో ప్రయాణించేవారికి ఇది మంచి మార్గం అవుతుంది. చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాలకు కూర్చొని వెళ్లే అవకాశం దొరుకుతుంది. అదనంగా, రద్దీ తగ్గడం వల్ల రైలులో భద్రతా పరంగా కూడా ప్రయోజనాలు ఉన్నాయి.
విజయవాడ – లింగంపల్లి మధ్య ఈ ట్రైన్ రోజూ నడుస్తుండటంతో, ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన రైలు సేవగా గుర్తించబడింది. గుంటూరు, నల్లగొండ, భువనగిరి, సికింద్రాబాద్, లింగంపల్లి లాంటి స్టేషన్లను ఈ రైలు కలుపుతూ, నిత్యం వేలాది మంది ప్రయాణికులకు ఉపయోగా పడుతోంది. ఈ మార్పుతో ఇకపై సాధారణ ప్రయాణికులకే కాదు, రోజూ డ్యూటీకి వెళ్లే ప్రభుత్వ ఉద్యోగులకు, కళాశాలలకు వెళ్తున్న విద్యార్థులకు కూడా ప్రయాణం సులభంగా మారనుంది.
ఈ రైలులో ఇప్పటికే కొన్ని కోచ్‌లు చాలా కాలంగా శాతాన్ని మించి నిండిపోతూ వస్తున్నాయి. ముఖ్యంగా పండగల సీజన్, సెలవుల్లో మరింత రద్దీ ఉండేది. ఇప్పుడు అదనపు బోగీలు ఉండటంతో టికెట్ల లభ్యత పెరుగుతుంది. ప్రయాణంలో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. స్టేషన్‌లో తొక్కిసలాటలు, తొందరగా ఎక్కే ప్రయత్నాలు, సీటు కోసం జరిగే వాగ్వివాదాలు తగ్గుతాయి.
Also Read: Srisailam villages name change: ఈ గ్రామాల పేర్లు ఓ వెరైటీ.. అందుకే మార్చారు.. ఇకపై ఇలా పిలవండి!
ప్రస్తుతం టికెట్ బుకింగ్‌ల కోసం ఆన్‌లైన్ ద్వారా ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఎక్కువ మంది ప్రయాణికులు చివరిదాకా టికెట్ దొరకకపోతుందేమో అనే అనుమానం ప్రయాణికుల్లో ఉండేది. కానీ ఇప్పుడు బోగీలు పెరగడంతో అది పెద్దగా సమస్య కాదు. ట్రైన్‌లో స్థలాల పరిమితి పెరగడం వల్ల ప్లానింగ్ బాగా కుదురుతుంది.
ఇండియన్ రైల్వే ఈ మార్పును శాశ్వతంగా ప్రకటించడం మరో మంచి విషయం. ఇది కేవలం టెస్టింగ్‌గా లేదా పండగల సందర్భాల్లో తాత్కాలికంగా తీసుకున్న నిర్ణయం కాదు. ఇకపై ఇదే అమలులో ఉంటుందని రైల్వే తెలిపింది. ఈ మార్పుతో రైల్వే శాఖ తన కృషి ప్రజల కష్టాలను అర్థం చేసుకుని, అనువైన మార్గాల్లో చర్యలు తీసుకుంటున్నదని మరోసారి నిరూపించింది.
మొత్తంగా చెప్పాలంటే, ఈ మార్పు వల్ల ప్రయాణ అనుభవం పూర్తిగా మారనుంది. టికెట్ లభ్యత, కూర్చునే సీటు, అంతరాయం లేని ప్రయాణం ఇవన్నీ ఇప్పుడు సాధ్యం. ఇక ముందుగా ప్లాన్ చేసుకుని, ఈ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో సాఫీగా ప్రయాణించవచ్చు. ప్రయాణం అంటే ఒత్తిడి కాదు.. విశ్రాంతిగా, ఆర్థికంగా, సురక్షితంగా జరిపే అనుభవం అవుతుంది. విజయవాడ – లింగంపల్లి మధ్య ప్రయాణించే వారందరికీ ఇది నిజంగా శుభవార్తే.