ఇస్కాన్ ఆలయాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలకు ఆధ్యాత్మికతను అందజేస్తున్నాయి. ఒక్కసారి ఆలయంలోకి వెళ్తే ఎంతో ప్రశాంతత లభిస్తుంది. కృష్ణుడి భక్తులు ఇస్కాన్ ఆలయాల్లో నిత్యం పూజలు, భజనలు చేస్తుంటారు. కల్లోలంగా ఉన్న మనసు ఒక్కసారి ఆలయంలోకి వెళ్లగానే పూర్తి ప్రశాతంత లభిస్తుంది. అందుకే, ఈ ఆలయాలకు వెళ్లే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే, తాజాగా ఓ యువకుడు ఇస్కాన్ ఆలయంలోని రెస్టారంట్ లోకి వెళ్లి KFC చికెన్ తినడం సంచలనం కలిగించింది. సదరు యువకుడిపై భక్తులు నిప్పులు చెరుగుతున్నారు.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
లండన్ లోని ఇస్కాన్ సంస్థ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించింది. నిత్యం ఇక్కడికి వందలాది మంది భక్తులు వస్తారు అక్కడికి వచ్చే వారి కోసం గోవింద రెస్టారెంట్ ఏర్పాటు చేశాడు. అక్కడ కేవలం నాన్ వెజ్ ఫుడ్ మాత్రమే లభిస్తుంది. తాజాగా ఓ ఆఫ్రికన్ సంతతికి చెందిన యువకుడు గోవింద రెస్టారెంట్ లోకి వెళ్తాడు. సిబ్బందితో ఇక్కడ నాన్ వెజ్ ఫుడ్ ఉందా? అని అడుగుతాడు. అయితే, తమ రెస్టారెంట్ లో కేవలం వెజ్ ఫుడ్ మాత్రమే ఉంటుంది సిబ్బంది సమాధానం చెప్తారు. కానీ, ఆ యువకుడు అప్పటికే తనతో పాటు తెచ్చుకున్న KFC బాక్స్ లోని చికెన్ తీసి తినడం మొదలు పెట్టాడు. అంతేకాదు, అక్కడున్న వారందరికీ తన దగ్గర ఉన్న చికెన్ చూపిస్తూ తింటాడు. రెస్టారెంట్ సిబ్బంది అతడిని వద్దని చెప్పినా, ఆపకుండా అలాగే చేస్తాడు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది సాయంతో అతడిని రెస్టారెంట్ నుంచి బయటకు పంపిస్తారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Shameless African-British man forcibly eats chicken at ISKCON Govinda’s restaurant in London.
MAN (Enters): Only veg food here?
STAFF: Yes, only vegetarian food. What would you like?
Then he pulled out KFC chicken and began eating it inside pic.twitter.com/iRhGiQqlNG
— Sumit (@SumitHansd) July 20, 2025
నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు
ఇక ఇస్కాన్ లోకి చికెన్ తెచ్చిన యువకుడిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే అతడు మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. జాత్యంహకార ధోరణిలో, మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ఆ విదేశీయుడు ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. “ఇది ముమ్మాటికీ హిందూమతం పట్ల ద్వేషమే” అని నెటిజన్లు కామెంట్ చేశారు. “సదరు యువకుడు కావాలనే చేశాడు. ముందస్తు ప్లాన్ తోనే వీడియోను కూడా షూట్ చేసే ఏర్పాటు చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకునేందుకు ఈ హీనమైన చర్యకు పాల్పడ్డాడు” అని కామెంట్స్ చేశారు.
రీసెంట్ గా అమెరికాలోని ఇస్కాన్ ఆలయంపై కాల్పులు
ఇస్కాన్ ఆలయాలే లక్ష్యంగా రీసెంట్ గా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. రీసెంట్ గా అమెరికాలోని ఇస్కాన్ రాధాకృష్ణ మందిరంపై కొందరు దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. భక్తులు ఆలయంలో ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో అందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని కలగకపోవడంతో అందరూ రిలాక్స్ అయ్యారు. ఈ ఘటనను భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ చర్యకు పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
Read Also: పిల్ల సైంటిస్టులు.. డ్రింక్ బాటిల్స్‌తో రాకెట్.. గాల్లోకి ఎలా దూసుకెళ్లిందో చూడండి!