Simbu : ప్రస్తుతం తెలుగు సినిమాలలో శింబు తక్కువగా కనిపిస్తున్నాడు. కానీ కొన్నేళ్ల క్రితం శింబు నటించింది సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యేవి. ఎన్నో సంచలనాత్మకమైన హిట్ సినిమాలు శింబు కెరియర్ లో ఉన్నాయి. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పరిచయం అవుతున్న చాలామంది తమిళ్ హీరోస్ కంటే కూడా ఒకప్పుడు శింబు బాగా ఫేమస్.
అయితే శింబు ఆ మధ్యకాలంలో సినిమాలకు కొంచెం గ్యాప్ ఇవ్వటం. శింబు నటించిన సినిమాలు తెలుగులో విడుదల కాకపోవటం. ఇవన్నీ కూడా అతని మార్కెట్ను కొంతమేరకు దెబ్బతీసాయి. ఇప్పుడు మాత్రం ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు శింబు. వరుసగా సినిమాలు చేస్తూ ఆడియన్స్ కు మరింత దగ్గరవుతున్నాడు. పర్సనల్ గా శింబుకి చాలామంది అభిమానులు ఉన్నారు. శింబు వ్యక్తిత్వం అలాంటిది.
షూటింగ్ లో చనిపోయిన స్టంట్ మాస్టర్
పా రంజిత్ దర్శకత్వంలో ఆర్య నటిస్తున్న ఒక సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక కార్ చేజింగ్ సీన్ చేస్తున్నప్పుడు స్టంట్ మాస్టర్ మోహన్ రాజ్ చనిపోయారు. ఈ వార్తతో ఫిలిం ఇండస్ట్రీ అంతా దిగ్భ్రాంతి చెందింది. ముఖ్యంగా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ. మోహన్ రాజ్ కుటుంబం పట్ల చాలామంది తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ పెద్దలు సంతాపం కూడా తెలియజేశారు. కొంతమంది సాయంగా నిలబడతాను అని ముందుకు కూడా వచ్చారు.. ఇ తరుణంలో శింబు కూడా సాయం చేస్తున్నట్లు ఫోన్లో చెప్పారు అని ఒక వీడియో ఇంటర్నెట్లో హల్చల్ అవుతుంది.
ఎవరికి తెలియకుండా శింబు సాయం
ఈ యాక్సిడెంట్ గురించి తెలియగానే ఫైట్ మాస్టర్ కు శింబు పర్సనల్ గా ఫోన్ చేశారు. ఫోన్ చేసి తను ఒక పెద్ద అమౌంట్ తో చెక్కు ఆ ఫ్యామిలీకి ఇస్తున్నట్లు చెప్పారు. అలానే చెప్పినట్లుగానే లక్ష రూపాయలు ఆ ఫ్యామిలీకి సాయం అందించారు. ఈ విషయం ఇప్పటివరకు ఎవరికీ బయటికి తెలియలేదు. మామూలుగా చాలామంది విరాళాలు అనౌన్స్ చేస్తారు. కానీ శింబు మాత్రం ఎవరికీ తెలియకుండా ఆ ఫ్యామిలీకి ఈ హెల్ప్ చేసినట్లు రీసెంట్ గా వచ్చిన ఒక ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది.
Also Read : Pawan Kalyan: మేకింగ్ వీడియో లో లేకపోయిన క్రిష్ పేరు గుర్తుపెట్టుకున్నాడు, మరి జ్యోతి కృష్ణ ?