E-Paper
Advertisement

Vijayawada Satellite Stations: విజయవాడ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రాయనపాడు, గుణదలలో శాటిలైట్ స్టేషన్లు

Vijayawada Satellite Stations: విజయవాడ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రాయనపాడు, గుణదలలో శాటిలైట్ స్టేషన్లు

Vijayawada Satellite Stations: దేశంలో అత్యంత రద్దీగా రైల్వే స్టేషన్లలో ఒకటైన విజయవాడ జంక్షన్.. చాలా కాలంగా రద్దీ సమస్యను ఎదుర్కొంటుంది. తగినన్ని ప్లాట్‌ఫారాలు లేకపోవడం వల్ల రైళ్లు శివార్లలోనే నిలిచిపోతున్నాయి. సికింద్రాబాద్ నుంచి వచ్చే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, విశాఖపట్నం నుంచి వచ్చే చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి సర్వీసులు తరచుగా లేట్ అవ్వడానికి ఇదే కారణం. స్టేషన్‌లోకి రైలు రావడానికి శివారులో చాలాసేపు వేచి ఉండాల్సి వస్తోంది.

ఈ సమస్యను పరిష్కరించేందుకు దక్షిణ మధ్య రైల్వే రాయనపాడు, గుణదల వద్ద శాటిలైట్ స్టేషన్ల అభివృద్ధిని ప్రారంభించింది. విజయవాడ మెయిన్ జంక్షన్ లో రద్దీని తగ్గించడం, ప్రయాణికుల రాకపోకలను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ స్టేషన్లను ట్రాన్సిట్ హబ్‌లుగా అప్ గ్రేడ్ చేస్తున్నారు. అమృత్ భారత్ పథకం కింద సుమారు రూ.300 కోట్లతో ఈ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రైలు రాకపోకలకు ఏర్పాటు చేయడం, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం.

రాయనపాడు స్టేషన్ రెడీ

రాయనపాడు స్టేషన్ ఫస్ట్ ఫేజ్ పనులు రూ. 19.9 కోట్లతో ఇప్పటికే పూర్తి చేసుకుని ప్రారంభానికి రెడీ అయింది. ఈ స్టేషన్‌లో ఆధునిక వెయిటింగ్ హాల్‌లు, టికెట్ బుకింగ్ కౌంటర్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, విశాలమైన పార్కింగ్ ప్రాంతం ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ పెరిగినా అన్ని విధాలా సన్నద్ధంగా దీనిని అభివృద్ధి చేశారు.

గుణదల స్టేషన్ పనులు

రూ. 35.5 కోట్లతో గుణదల స్టేషన్‌ను మరో శాటిలైట్ స్టేషన్ గా అభివృద్ధి చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా విజయవాడలో సులభమైన రైల్వే రాకపోకల కోసం 100 అడుగుల వెడల్పు గల అనుసంధాన రహదారిని నిర్మిస్తున్నారు.

రైళ్ల మళ్లింపు

విజయవాడ స్టేషన్‌లో రద్దీని తగ్గించడానికి, రైల్వే అధికారులు కొత్త కార్యాచరణను రూపొందించారు. సికింద్రాబాద్ నుంచి వచ్చే రైళ్లు రాయనపాడులో ఆగి, ప్రధాన స్టేషన్‌ను దాటి కొండపల్లి మీదుగా వెళ్తాయి. అదేవిధంగా, విశాఖపట్నం నుంచి వచ్చే రైళ్లు నేరుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే ముందు గుణదలలో ఆగుతాయి. ఈ మళ్లింపుతో ప్లాట్‌ఫారమ్ రద్దీని తగ్గించి, ప్రధాన మార్గాల్లో ఆలస్యాన్ని తగ్గించవచ్చని రైల్వే అధికారులు భావిస్తున్నారు.

కృష్ణా పుష్కరాలకు

2026లో జరిగే కృష్ణా పుష్కరాల కోసం రాయనపాడు, గుణదలను టెర్మినల్ స్టేషన్లుగా పూర్తిస్థాయిలో నిర్మించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది . పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

కనెక్టివిటీ

ఈ శాటిలైట్ స్టేషన్లతో విజయవాడకు నిరంతరం ప్రయాణాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ స్టేషన్ల నుంచి ఆర్టీసీ బస్సులు, ఆటో రిక్షా కనెక్టివిటీని పెంచనున్నారు. దీనివల్ల ప్రయాణికులు విజయవాడకు సులభంగా రాకపోకలు సాగించగలరు. గొల్లపూడి, సింగ్ నగర్‌లలో అదనపు శాటిలైట్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మరిన్ని ప్రతిపాదనలు చేశారు. ఈ కార్యాచరణను అమలు చేస్తే, నున్న, అగిరిపల్లి, నందిగామ ప్రాంతాలలోని నివాసితులు ఇకపై విజయవాడ స్టేషన్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

Also Read:  రైలు 3 గంటలు ఆలస్యమైందా? మీ డబ్బులు వాపస్.. IRCTCలో TDR ఫైలింగ్ గురించి తెలుసా?

కొనసాగుతున్న పనులు

విజయవాడ జంక్షన్ లో పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 10 ప్లాట్‌ఫారాలపై రద్దీ పెరుగుతుండడంతో, శాటిలైట్ స్టేషన్ల అభివృద్ధి రైల్వే రాకపోకలపై ఉపశమనాన్ని కలిగించనుంది.

Related News

సముద్ర గర్భంలో సైకిల్ సవారీ.. విశాఖలో అరుదైన సాహసం!

రైల్వే స్టేషన్ బోర్డుపై ‘సముద్ర మట్టం ఎత్తు’ ఎందుకు రాస్తారో తెలుసా? దీని వెనుక రహస్యం ఇదే!

రిటైర్మెంట్ తర్వాత.. పాత రైళ్లను ఏం చేస్తారో తెలుసా? రూ. కోట్ల బిజినెస్ భయ్యా!

రైలు పట్టాలపై కంకర రాళ్లు ఎందుకు ఉంటాయో తెలుసా? వాటి బెనిఫిట్స్ తెలిస్తే షాకే!

వెయిటింగ్‌ లిస్ట్‌పై కీలక అప్‌డేట్‌… ఇకపై అలా కుదరదు.. ఇవాళ్టి నుంచి మారనున్న రూల్స్

టాయిలెట్ లో ప్లేట్లు కడిగిన రైల్వే సిబ్బంది.. FSSAI సీరియస్, IRCTCకి నోటీసులు!

స్విట్జర్లాండ్‌ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్

అక్కడ పెట్రోల్ కంటే వాటర్ బాటిల్ ధర ఎక్కువ.. జీవితంలో ఒక్కసారైనా ఆ అందమైన దేశానికి వెళ్లి రావాల్సిందే!

Big Stories

×