E-Paper
Advertisement

Pakistan-IPL: బ్యాన్ ఉన్న‌ప్ప‌టికీ ఐపీఎల్‌ ఆడుతున్న పాకిస్థాన్ ప్లేయ‌ర్లు వీళ్లే..కార‌ణం ఏంటి

Pakistan-IPL: బ్యాన్ ఉన్న‌ప్ప‌టికీ ఐపీఎల్‌ ఆడుతున్న పాకిస్థాన్ ప్లేయ‌ర్లు వీళ్లే..కార‌ణం ఏంటి
Advertisement

Pakistan-IPL:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ మరో 10 రోజుల్లోనే ప్రారంభం కానుంది. మార్చి 28వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీ 2026 టోర్నమెంట్ తొలిదశ ప్రారంభమవుతుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ కూడా ఖరార్ అయింది. అయితే ఈ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య పాప కొనుగోలు చేసిన పాకిస్తాన్ ఆటగాడు అబ్రార్ అహ్మద్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కావ్య పాప పై దేశద్రోహి ముద్ర వేస్తున్నారు జనాలు. అంతేకాదు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పైన ఐదు సంవత్సరాల పాటు బ్యాన్ విధించాలని కూడా కోరుతున్నారు.

Also Read: Pakistan PM: గాజులు వేసుకోని ఇంట్లో కూర్చోండి.. బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మిపై పాక్ ప్ర‌ధాని సీరియ‌స్ !

బ్యాన్ ఉన్నప్పటికీ కూడా ఐపీఎల్ ఆడిన పాకిస్తాన్ ప్లేయర్లు వీళ్లే

Advertisement

2008 నుంచి పాకిస్తాన్ ప్లేయర్లపై బ్యాన్ విధించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. దీంతో అప్పటినుంచి ఐపీఎల్ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ప్లేయర్లు పాల్గొనడం లేదు. కానీ ఈ బ్యాన్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది పాకిస్తాన్ లో పుట్టి పెరిగిన వాళ్లు ఇండియాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఆడుతున్నారు. అలాంటి వారిలో అజర్ మహమూద్ (Azhar Mahmood ) ఒకరు. ఈయనకు బ్రిటిష్ పౌరసత్వం ఉంది. అక్కడి పాస్ పోర్ట్ సంపాదించిన నేపథ్యంలో ఐపీఎల్ ఆడి అవకాశం దక్కించుకున్నారు. ఈ అజర్ మహమూద్ పాకిస్తాన్లోనే పుట్టి పెరిగారు. కానీ వలసలో భాగంగా బ్రిటన్ వెళ్లి అక్కడ సెటిల్ అయ్యారు. అంటే ఆయన ఇంగ్లాండ్ ఆటగాడిగా ఐపీఎల్ కోసం పేరు నమోదు చేసుకున్నారు. అందుకే ఐపీఎల్ ఆడే అవకాశం వచ్చింది. ఇక సికందర్ రాజా కూడా పాకిస్తాన్ లోనే పుట్టి పెరిగిన వాడు.

కానీ 2005 సంవత్సరం సమయంలో సికందర్ రాజా ఫ్యామిలీ మొత్తం జింబాబ్వేలో సెటిల్ అయింది. ఇక అక్కడి పౌరసత్వమే అతడు అందుకున్నాడు. అక్కడే కెప్టెన్ గా కూడా ఎదిగాడు. ఈ క్రమంలోనే జింబాబ్వే ప్లేయర్గా ఐపిఎల్ ఆడుతున్నాడు సికందర్ రాజా ( Sikandar Raza). ఇమ్రాన్ తాహిర్ కూడా పాకిస్తాన్ దేశంలోనే పుట్టి పెరిగాడు. కానీ ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు వలస వెళ్లాడు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికా పౌరసత్వం అందుకొని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో చాలా రోజులపాటు చెన్నై సూపర్ కింగ్స్ దట్టు తరఫున బరిలోకి దిగాడు ఇమ్రాన్ తాహిర్. ఇక ఇప్పుడు మళ్లీ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో మెరుస్తున్నాడు. ఇలా చాలామంది పాకిస్తాన్లో పుట్టి పెరిగి విదేశాలలో సెటిల్ అయినారు. అలాంటివాళ్లు ఇతర దేశాల పౌరసత్వాన్ని అందుకొని, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో ఆడేందుకు అర్హత సాధిస్తున్నారు.

పాకిస్తాన్ ప్లేయర్లపై బ్యాన్ ఎందుకు ?

Advertisement

2008 కంటే ముందు పాకిస్తాన్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడేవారు. కానీ 2008 డిసెంబర్ సమయంలో ముంబై లో పేలుళ్లు సంభవించాయి. దీంతో పాకిస్తాన్ అలాగే ఇండియా మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఐపీఎల్ టోర్నమెంటులో పాకిస్తాన్ ప్లేయర్లు ఆడకుండా బీసీసీఐ ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు కూడా పూర్తిగా రద్దు అయ్యాయి. కేవలం ఐసీసీ టోర్నమెంట్స్ లో ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. అది కూడా తటస్థ వేదికల్లో మాత్రమే జరుగుతోంది.

Also Read: Trolls On Shubman Gill: ఓరి ద‌రిద్రుడా..రోహిత్ శ‌ర్మ సాధించిన ఛాంపియన్స్ ట్రోఫీని ఖాతాలో వేసుకున్నావా ? గిల్ పై దారుణంగా ట్రోల్స్‌

 

?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==

Related News

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

Big Stories

Advertisement
×