E-Paper
Advertisement

Psychological Thriller OTT: అరణ్యంలో అలుపెరగని పోరాటం… చావు అంచుకు తీసుకెళ్లే సస్పెన్స్

Psychological Thriller OTT: అరణ్యంలో అలుపెరగని పోరాటం… చావు అంచుకు తీసుకెళ్లే సస్పెన్స్
Advertisement

Psychological Thriller OTT : మూడే మూడు పాత్రలతో ముచ్చెమటలు పట్టిస్తోంది ఒక హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ. ఒకటి హీరోయిన్, రెండు విలన్, మూడోది మధ్యలో వచ్చి చచ్చిపోయే వేటగాడు. పెద్దగా డైలాగులు ఉండవు, గ్రాఫిక్స్ ఉండవు ఇందులో. కేవలం అడవిలో ఈ సినిమా మొత్తం ఉత్కంఠగా సాగుతుంది. ఈ సినిమాను అమెరికాలోని ఒరెగాన్ అడవుల్లో షూట్ చేశారు. హీరోయిన్ జూల్స్ విల్‌కాక్స్ నిజంగానే బురదలో పడటం, నీళ్లలో కొట్టుకుపోవడం వంటి సీన్లు చేసింది ఇందులో. షూటింగ్ సమయంలో ఆమె కాలికి దెబ్బ తగిలినా కూడా పట్టుదలతో కంటిన్యూ చేసింది. ఆ రియలిస్టిక్ ఫీల్ వల్లే సినిమా చూస్తున్నప్పుడు మనకు కూడా భయం వేస్తుంది. చాలా తక్కువ బడ్జెట్‌తో తీసినా, ఈ సినిమాకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అలోన్’ (Alone). జాన్ హైమ్స్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో జూల్స్ విల్‌కాక్స్, మార్క్ మెంచాకా లీడ్ రోల్స్ లో నటించారు. ఇది యునైటెడ్ స్టేట్స్‌లో 2020 సెప్టెంబర్ 18న థియేటర్లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. థ్రిల్లర్ ఫ్యాన్స్ కు మంచి మజా ఇచ్చే సినిమా ఇది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

భర్త చనిపోయాడన్న బాధలో ఉన్న జెస్సికా, తన సామాన్లన్నీ సర్దుకుని కారులో వేరే ఊరికి బయల్దేరుతుంది. హైవే మీద వెళ్తుంటే ఆమెకు ఒక సైకో తగులుతాడు. వాడు కారును అడ్డం పెట్టడం, ఓవర్ టేక్ చేస్తూ విసిగించడం చేస్తుంటాడు. ఏదో తేడాగా ఉందని జెస్సికా వాడిని తప్పించుకుని వెళ్దామని చూస్తుంది. కానీ ఒక చోట వాడు ఆమె కారు టైరు పంచర్ అయ్యేలా చేసి, ఆమెను కొట్టి స్పృహ తప్పించి తన అడవిలో ఉన్న ఒక సీక్రెట్ రూమ్ కి తీసుకెళ్లి బంధిస్తాడు. వాడు అసలు సిసలు నరరూప రాక్షసుడు. గతంలో కూడా చాలా మంది ఆడపిల్లల్ని ఇలాగే చంపేశాడని జెస్సికాకు అర్థమవుతుంది.

ఇక ఆ సైకో తనని చంపకముందే తెలివిగా అక్కడి నుండి తప్పించుకుని అడవిలోకి పరుగెడుతుంది. ఆ అడవిలో దారి తెలీదు, కాళ్లకు చెప్పులు లేవు, చేతిలో ఆయుధం లేదు. అయినా సరే ప్రాణం మీద తీపితో బురదలో దాక్కుంటూ, నదులు దాటుకుంటూ వాడి కళ్ళలో పడకుండా తప్పించుకోవాలని చూస్తుంది. మధ్యలో ఒక వేటగాడు కనిపిస్తే సాయం అడుగుతుంది కానీ, ఆ సైకో గాడు వాడిని కూడా దారుణంగా చంపేస్తాడు. చివరికి ఆ సైకో చేతిలో జెస్సికా చచ్చిపోతుందని అందరూ అనుకున్న టైమ్‌లో స్టోరీ మలుపు తిరుగుతుంది. ఆ మలుపు ఏమిటి ? జెస్సికా ప్రాణాలతో బయట పడుతుందా ? ఈ క్లైమాక్స్ ఏమిటి ? అనే విషయాలను, ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.

Advertisement

Read Also : ప్రియురాలి దెబ్బకు బిత్తరపోయే ప్రియుడు… క్రాక్ ఎక్కించే క్రేజీ లవ్ స్టోరీ

Related News

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

సమస్యలతో అల్లాడుతున్న ఐదుగురి జీవితాల్లోకి బాబా ఎంట్రీ… ఎమోషనల్ స్పిరిచువల్ డ్రామా

రాక్షస శక్తుల వలలోపడి రాజ్యాన్ని సర్వనాశనం చేసే చక్రవర్తి… దేవతల ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్…

మంచు తుఫానుతో గడ్డకట్టిపోయే భూగోళం… స్పైన్ చిల్లింగ్ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్

రిజర్వాయర్ నీళ్లలో నక్కిన భయంకరమైన శక్తులు… వణికించే కొరియన్ ఫోక్ హారర్ మిస్టరీ థ్రిల్లర్

Big Stories

Advertisement
×