Visakhapatnam Kirandul Train Additional Vistadome Coach: శీతాకాలంలో అరకు, బొర్రా గుహలు, ఇతర ఏజెన్సీ ప్రాంతాలను చూసేందుకు పర్యాటకులు పోటెత్తుతారు. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పర్యాటకులు అధికంగా తరలివస్తుంటారు. నవంబర్, డిసెంబర్ లో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రద్దీకి అనుగుణంగా రైల్వే అధికారులు విశాఖపట్నం-కిరండూల్ రైలుకు అదనపు కోచ్ లను యాడ్ చేస్తుంటారు. ఎప్పటి లాగే ఈ ఏడాది కూడా అదనంగా విస్టాడోమ్ కోచ్ ను ఏర్పాటు చేయలని అధికారులు నిర్ణయించారు. డిసెంబర్ నెలలో ఈ కోచ్ ను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో అందుబాటులోకి వచ్చే ఈ విస్టాడోమ్ కోచ్ జనవరి మొదటి వారం వరకు ఉంటుందని వెల్లడించారు.
డిసెంబర్ నెలలో అందుబాటులోకి విస్టాడోమ్ కోచ్
వాస్తవానికి అరకు అనగానే అద్దాల రైల్లో విహరిస్తూ పర్యాటకులు ప్రకృతి అందాలను తిలకిస్తారు. విశాఖపట్నం-కిరండూల్ ఎక్స్ ప్రెస్ కు అద్దాల బోగీ ఉంటుంది. ఈ బోగీలో ప్రయాణించేందుకు టూరిస్టులు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాదాపు నెల రోజుల ముందుగానే అద్దాల రైల్లో టికెట్లు బుక్ చేసుకుంటారు. ప్రస్తుతం పర్యాటకుల తాకిడి పెరగడంతో ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలోని వాల్తేర్ డివిజన్ అదనంగా విస్టాడోమ్ కోచ్ ను యాడ్ చేయాలని నిర్ణయించింది. విశాఖపట్నం-కిరండూల్ మధ్య నడిచే రైలుకు అడిషనల్ గా విస్టాడోమ్ కోచ్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. అదనపు విస్టాడోమ్ కోచ్ డిసెంబర్ 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, 31 తేదీల్లో అందుబాటులో ఉంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో అదనపు విస్టాడోమ్ కోచ్ డిసెంబర్ 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, 30, జనవరి 1న కిరండూల్-విశాఖపట్నం రైలుకు యాడ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని వాల్తేరు డివిజన్ మేనేజర్ కె. సాందీప్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన జారీ చేశారు.
@RailMinIndia@EastCoastRail@DRMKhurdaRoad@DRMSambalpur@serailwaykol@SCRailwayIndia Additional Vistadome coach to be attached to Kirandul passenger for the convenience of the tourists, passengers. pic.twitter.com/BRx0OLra3G
— DRMWALTAIR (@DRMWaltairECoR) November 26, 2024
విశాఖపట్నం-కిరండూల్ రైలు టైమింగ్స్, ఛార్జీ వివరాలు
వింటర్ లో అరకు అందాలు చూడాలనుకునే పర్యాటకులు హ్యాపీగా అద్దాల బోగీలో ప్రయాణించేందుకు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇక అరకు వెళ్లే ప్రయాణికులకు విశాఖపట్నం-కిరండూల్ రైలు డైలీ అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ రైలు ఉదయం 6.45 గంటలకు విశాఖలో బయల్దేరుతుంది. ఉదయం 10 గంటల 55 నిమిషాలకు అరకు చేరుకుంటుంది. అటు కిరండూల్-విశాఖపట్నం రైలు మధ్యాహ్నం 3.30 గంటలకు అరకులో బయల్దేరుతుంది. రాత్రి 8.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైళ్లకు అద్దాల బోగీలు అందుబాటులో ఉన్నాయి. ఇక విస్టాడోమ్ బోగీలో ఛార్జీల విషయానికి వస్తే, విశాఖపట్నం నుంచి అరకు వరకు రూ.735, అరకు నుంచి విశాఖపట్నం వరకు రూ.735 ఉంటుంది. సో వింటర్ లో విశాఖ ఏజెన్సీ అందాలను ఆస్వాదించాలనుకునే వాళ్లు వెంటనే అద్దాల రైలులో టికెట్లు బుక్ చేసుకోండి. ఫ్యామిలీతో అరకు అందాలు చూసి ఎంజాయ్ చేయండి.
Read Also: రూ. 8 వేల కోట్లతో 3 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్, ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో తెలుసా?