BigTV English

Bigg Boss8 Telugu : కన్నీళ్లు పెట్టుకున్న విష్ణు ప్రియ.. బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి అఖిల్ స్ట్రోక్..

Bigg Boss8 Telugu : కన్నీళ్లు పెట్టుకున్న విష్ణు ప్రియ.. బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి అఖిల్ స్ట్రోక్..

Bigg Boss8 Telugu : బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 రోజు రోజుకు ఆసక్తి పెరుగుతుంది. ఈ సీజన్ దాదాపు చివరి అంకానికి చేరుకుంది. అందుకే రెండు వారాల్లో ఏమైనా జరగొచ్చు అని బిగ్ బాస్ కు ఆదరణ పెరుగుతుంది. అసలు విన్నర్ ఎవరు అవుతారో అనే క్యూరియాసిటి జనాల్లో పెరుగుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహాం లేదు. ప్రస్తుతం హౌస్ లో ‘టికెట్ టూ ఫినాలే’ సాధించి నేరుగా ఫైనల్స్‌కి ఎవరు వెళ్తారో తేల్చేందుకు మాజీ కంటెస్టెంట్లను రంగలోకి దించారు. ఇందులో భాగంగా సీజన్ 4, ఓటీటీ సీజన్ రన్నర్ అఖిల్ సార్థక్, సీజన్ 4 కంటెస్టెంట్ అలేఖ్య హారిక హౌస్‌లోకి వచ్చారు. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన ఆప్షన్స్‌లో స్పీడ్, బ్యాలెన్స్ సెలక్ట్ చేసుకొని వాటిపై హౌస్‌మేట్స్‌ని టెస్ట్ చేశారు.. అయితే హౌస్ లోకి వచ్చిన వీరిద్దరికీ బిగ్ బాస్ ఫుల్ రైట్స్ ఇచ్చారు. దాంతో ఇద్దరు అందరితో గేమ్ ఆడించారు..


అఖిల్, హారికలు హౌస్ ఓ ఇద్దరినీ సెలెక్ట్ చేసుకున్నారు. వాళ్ళు గౌతమ్, రోహిణిలను సెలక్ట్ చేశారు. ఇక వీరు మరో ఇద్దరినీ సెలక్ట్ చేయాలి. దీంతో విష్ణుప్రియ, టేస్టీ తేజలను ఎన్నుకున్నారు. ఇలా ఈ నలుగురికి కలిపి ముందుగా “ది లిమిట్‌లెస్ బ్రిడ్జి” టాస్క్ పెట్టారు అఖిల్-హారిక. ఇందులో ఫాస్ట్ గా బ్రిడ్జి కంప్లీట్ చేసి రోహిణి విన్నర్ అయింది.. గౌతమ్, విష్ణుప్రియ టాస్కు కంప్లీట్ చేశారు. అయితే టేస్టీ తేజ మాత్రం బజర్ మోగే వరకూ పూర్తి చేయలేకపోయాడు.. దాంతో నాకు సపోర్ట్ లేదు అందుకే నేను చెయ్యలేక పోయానని ఎమోషనల్ అవుతాడు. హౌస్ లో తేజను చూసి అందరు ఫీల్ అవుతారు.

మాజీ ka5టికెట్ టూ ఫినాలేలో భాగంగా బ్యాలెన్స్ చెక్ చేయడానికి తర్వాత ‘తులాభారం’ అనే టాస్కు పెట్టాడు బిగ్‌బాస్. ఇందులో భాగంగా చెరో వైపు ఐదు బాక్సులు పెట్టి కంటెస్టెంట్లు బ్యాలెన్స్ చేయాలి. అయితే బ్రిడ్జి గేమ్‌లో గెలిచిన రోహిణికి బిగ్ బాస్ అదిరిపోయే సర్ ప్రైజ్ లు ఇచ్చారు. దాంతో రోహిణి మరో రెండు వారాలు హౌస్ లో సేఫ్ గా ఉంటుందని అర్థమవుతుంది. ఇక ఈ గేమ్‌లో రోహిణి గెలిచింది. గౌతమ్ కూడా ఫినిష్ చేసినప్పటికీ రోహిణి పక్కాగా బ్యాలెన్స్ చేసింది. దీంతో రోహిణిని విజేతగా ప్రకటించి టికెట్ టూ ఫినాలే కంటెండర్ బ్యాడ్జిని ఇచ్చారు అఖిల్-హారిక. అయితే ఈ రెండు టాస్కులను బట్టి మిగిలిన ముగ్గురిలో ఒకరికి బ్లాక్ బ్యాడ్జ్ ఇవ్వాలని బిగ్‌బాస్ చెప్పాడు. వాళ్ళు ఈ రెండు వారాల్లో ఎటువంటి టాస్క్ లను ఆడొద్దు అని చెప్తారు. బ్లాక్ బ్యాడ్జ్‌ని విష్ణుప్రియకి ఇచ్చేశారు. ఇక ఈ బ్యాడ్జ్ ఇచ్చిన తర్వాత విష్ణు కన్నీళ్లు పెట్టుకుంది. పృథ్వీ-నిఖిల్ ఇద్దరూ ఓదార్చారు. ఎందుకు ఏడుస్తున్నావ్.. స్టార్ ఇచ్చినందుకు ఏడుస్తున్నావా.. అంటూ పృథ్వీ అడిగితే నేను తేజ కంటే బాగానే ఆడా కదా అంటూ విష్ణు అంది. నేను ఎప్పుడు ఏడవను అని బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చారా అని అమ్మడు కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..


Tags

Related News

Bigg Boss 9 Telugu: డబుల్ హౌస్.. డబుల్ డోస్..బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

Monal Gajjar : బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గుర్తుందా.? ఇప్పుడేం చేస్తుందో తెలుసా..?

Deepthi Sunaina: జీవితంలో ఇదొక గొప్ప నిర్ణయం.. గుడ్ న్యూస్ చెప్పిన దీప్తి సునైనా.. పెళ్లికి సిద్ధమైందా?

Anchor Ravi: బిగ్ బాస్ రియల్ అంటే చెప్పుతో కొట్టాలి… వివాదానికి అగ్గి రాజేసిన రవి

Aadi Reddy: రెండో కూతురిని పరిచయం చేసిన ఆదిరెడ్డి… ఎంత ముద్దుగా ఉందో?

Aadi Reddy: గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ ఆది రెడ్డి… మహాలక్ష్మి పుట్టిందంటూ?

Big Stories

×