E-Paper
Advertisement

ఐఆర్సీటీసీ సప్త జ్యోతిర్లింగ టూరిస్ట్ ప్యాకేజీ.. ఏప్రిల్ 14న సికింద్రాబాద్ నుంచే

ఐఆర్సీటీసీ సప్త జ్యోతిర్లింగ టూరిస్ట్ ప్యాకేజీ.. ఏప్రిల్ 14న సికింద్రాబాద్ నుంచే
Advertisement

IRCTC Tourism Package: సికింద్రాబాద్ నుంచి సప్త జ్యోతిర్లింగ దర్శనం పేరుతో IRCTC టూరిస్ట్ ప్యాకేజీ ప్రకటించింది. ఈ యాత్ర ఏప్రిల్ 14న ప్రారంభమై, 24న ముగుస్తుంది. 10 రాత్రులు, 11 రోజుల పాటు కొనసాగే ఈ ప్రయాణంలో మొత్తం 7 జ్యోతిర్లింగ క్షేత్రాలను సందర్శించుకోవచ్చు. మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం, త్రయంబకేశ్వరం, భీమా శంకరం, ఘృష్ణేశ్వరం వంటి జ్యోతిర్లింగ పుణ్య క్షేత్రాలు దర్శించుకోవచ్చు. భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్ లో మొత్తం 702 బెర్త్ లు అందుబాటులో ఉంటాయి. స్లీపర్- 160, 3rd AC- 490, 2nd AC- 52. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఈ ట్రైన్ కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, హుజూర్ సాహిబ్ నాందేడ్, పూర్ణ జంక్షన్ స్టేషన్‌లల్లో ఆగుతుంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవకాశం ఉంది.

7 జ్యోతిర్లింగాల దర్శనం

ముందుగా ఉజ్జయినీలోని మహాకాళేశ్వరం, ఓంకారేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోవచ్చు. అక్కడ ప్రత్యేక పూజలు అనంతరం గుజరాత్ లోని ద్వారకాకు బయలుదేరి వెళ్తారు. అక్కడ నాగేశ్వరం జ్యోతిర్లింగ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. అనంతరం అక్కడి నుంచి సోమనాథ్ చేరుకుని సోమనాథేశ్వరుడిని సేవించుకుంటారు. ఆ తర్వాత మహారాష్ట్రలోని పుణేలోని అక్కడ భీమా శంకరం ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం నాసిక్ సమీపంలో పశ్చిమ కనుమల్లో వెలిసిన త్రయంబకేశ్వరాన్ని చేరుకుంటారు. దీని తర్వాత ఔరంగాబాద్ లోని ఘృష్ణేశ్వరుడిని దర్శిస్తారు. దీంతో ఈ యాత్ర పూర్తవుతుంది. ఔరంగాబాద్ నుంచి తిరిగి సికింద్రాబాద్ కు చేరుకుంటారు.

ఈ ప్యాకేజీలో

  • ఎకానమీ (స్లీపర్ క్లాస్) పెద్దలకు రూ. 17,600 , 5 నుంచి 11 ఏళ్లలోపు పిల్లలకు రూ.16,300
  • స్టాండర్ట్ కేటగిరి 3AC.. పెద్దలకు రూ.26,700, పిల్లలకు రూ. 25,200
  • కంఫర్ట్ కేటగిరి (2AC).. పెద్దలకు రూ. 34,600, పిల్లలకు రూ. 32,800
  • ఈ ప్యాకేజీల్లో రైలు ప్రయాణం, హోటల్ వసతి, బ్రేక్ ఫాస్ట్, లండ్, డిన్నర్, అలాగే స్థానిక దేవాలయాల దర్శనాల కోసం బస్సు సౌకర్యం ఉంటుంది.
Advertisement

IRCTC వెబ్‌సైట్ www.irctctourism.com ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో జ్యోతిర్లింగ దర్శించుకోవాలనుకునే భక్తులకు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మంచి అవకాశం. టికెట్ల అమౌంట్ చెల్లింపులకు ఈఎంఐ సదుపాయం కూడా అందిస్తుంది ఐఆర్సీటీసీ.

Also Read: ఈ సమ్మర్‌లో షిల్లాంగ్ వెళ్తున్నారా.. అయితే మీరు చూడాల్సిన 5 అద్భుత ప్రదేశాలు!

Related News

ట్రెక్కింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? దేశంలో సురక్షితమైన 7 అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రాంతాలివే

ఈ తప్పులు చేస్తే తిరుమలలో రూమ్ దొరకదు.. టీటీడీ కొత్త గైడ్‌లైన్స్ ఇవే!

చివరి నిమిషంలోనూ కన్ఫర్మ్ సీట్.. రైల్వేలో సీక్రెట్ రూల్ గురించి తెలుసా?

12 రోజుల ఆధ్యాత్మిక యాత్ర.. అదీ EMIలో.. IRCTC ప్యాకేజ్ అదిరింది భయ్యా!

నల్లగొండ జిల్లాలో దాగిన ఉన్న అద్భుతాలు.. ఒక్కో చోట ఒక్కో విశేషం!

దుబాయ్ 5 ఏళ్ల మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా.. తక్కువ ధరలోనే.. భారతీయులకు అర్హత వివరాలు

హోటళ్లలో చెక్ ఇన్.. చెక్ అవుట్ ఆ సమయాల్లో ఎందుకు? దీని వెనుక అసలు కారణాలివే?

తాజ్ మహల్ కింద ఉన్న ఆ 22 గదులను ఎందుకు తెరవరు? నిజంగానే అక్కడ నిధులు, విగ్రహాలు ఉన్నాయా?

Big Stories

Advertisement
×