Allu Arjun Case: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. గత కొన్ని రోజులుగా సంధ్యా థియేటర్ కేసులో నిందితుడిగా ఉన్న విషయం తెల్సిందే. ఈ ఘటనలోనే బన్నీపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తరువాత బన్నీ లాయర్ బెయిల్ కు అప్లై చేయగా.. వ్యక్తిగత పూచీకత్తుపైన అలాగే రూ.50 వేల బాండ్ పైన అల్లు అర్జున్ కి నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది.
ఇక బెయిల్ నుంచి బయటకు వచ్చాకా సైలెంట్ గా ఉండకుండా బన్నీ ప్రెస్ మీట్ పెట్టి.. ఇంకా ఆ గొడవను మరింత పెంచాడు. ఎక్కడలేని అబద్దాలు చెప్పి.. పోలీసులు తనకేం చెప్పలేదని చెప్పడంతో.. ఆగ్రహించిన పోలీసులు మళ్లీ విచారణకు పిలిచి బన్నీని విచారించింది.
Bhairavam First Song: శంకర్ కూతురు.. నిజంగా వెన్నెలేరా బాబు.. ఏముంది అసలు
కొన్ని రోజులు నుంచి నాంపల్లి కోర్టులో ఈ కేసుపై వాదనలు విన్న కోర్టు నేడు తీర్పు ఇచ్చింది. బన్నీకి రెగ్యులర్ బెయిల్ ను మంజూరు చేస్తున్నట్లు తీర్పును ఇచ్చింది. రూ. 50 వేల సొంత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈసారి.. ఒకటి కాకుండా రెండు పూచీకత్తులను సమర్పించాల్సిందిగా తెలిపింది. అంతే కాకుండా కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని తెలిపింది. దాంతోపాటు పోలీసులు పెట్టిన కండిషన్స్ అలానే ఉంటాయనిచెప్పింది. ఎప్పుడు విచారణ ఉంటే అప్పుడు రావాలని తెలిపింది. ఇక బన్నీ పెట్టిన ప్రెస్ మీట్ పైన కూడా న్యాయస్థానం స్పందించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసే విధంగా బహిరంగంగా మాట్లాడవద్దని సున్నితంగా వార్నింగ్ ఇచ్చింది.
పుష్ప 2 బెన్ ఫిట్ షో సమయంలో సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో భాగంగా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని ఇదివరకే పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అల్లు అర్జున్ కూడా అరెస్టు చేశారు. ఇప్పటికే తనపై ఉన్న కేసును కొట్టివేయాలని బన్నీ పిటిషన్ దాఖలు చేయగా .. అది విచారణకు కూడా రాకముందే చిక్కడపల్లి పోలీసులు బన్నీ విచారణ నిమిత్తం అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
Sai Durgha Tej : హర్టింగ్ గా ఉంది… మెగా మేనల్లుడి పోస్ట్ వైరల్
మొదటిసారి కూడా తాను రేవతి మృతి వార్త తెలియదని చెప్పి తప్పించుకున్న బన్నీ.. ఆ తరువాత వీడియోలో పుష్ప 2 సినిమా క్లైమాక్స్ వరకు ఉన్నట్లు నెటిజన్స్ చూపించారు. అలా ఒకదాని తరువాత ఒకటి బన్నీ మెడకు బిగుసుకున్నాయి. రేవతి కొడుకు శ్రీతేజ్ ఇంకా హాస్పిటల్ లోనే చికిత్స పొందుతున్నాడు. అతని హాస్పిటల్ బిల్స్ అన్ని బన్నీనే చూసుకుంటున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సైతం శ్రీతేజ్ ఆరోగ్యం గురించి తెలుసుకొని ఆర్థిక సహాయం అందించారు. ఇక లీగల్ కారణాల వలన బన్నీ.. హాస్పిటల్ కి వెళ్ళలేదు అని, ఒకసారి ఈ కేసు క్లోజ్ అయ్యాక ఆ బాబును కలుస్తానని అల్లు అర్జున్ చెప్పుకొచ్చాడు.