Notice to KTR : ఈ-కార్ రేసు కేసులో బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కు తిప్పలు తప్పేలా కనిపించడం లేదు. ఇప్పటికే.. ఈ కేసులో అనేక మార్లు కోర్టుల నుంచి ఉపశమనానికి ప్రయత్నిస్తున్నా.. విచారణ సంస్థలు మాత్రం ఈ వ్యవహారాన్ని ఓ కొలిక్కితెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా.. తాజాగా కేటీఆర్ కు ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు ప్రయోజనాలు చేకూర్చే విధంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. చట్టాలకు, నిబంధనలకు నీళ్లొదిలి.. ఇష్టారాజ్యంగా కొంత మంది వ్యక్తులకు లబ్ధి చేకూర్చారనే విషయమై.. ఏసీబీ కేసు నమోదు చేయగా ఈ కేసు విచారణలో భాగంగా ఈనెల 6న ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ లోని ఏసీబీ కార్యాలయం లో విచారణకు హాజరుకావాలని ఏసీబీ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది.