Mystery Thriller series: ఊరికి దూరంగా ఉండే, పాడు బడిన ఇల్లు… అక్కడే ఉండే ఓ పాడుబడిన బావి… అందులోకి తొంగి చూస్తే గొలుసులతో కట్టి పడేసిన చిన్న పిల్లాడు కనిపిస్తే ఏంటి పరిస్థితి ? గూస్ బంప్స్ పక్కా. పరుగో పరుగు అంటూ కాళ్ళకు పని చెప్పి, అరుస్తూ ఊరంతటినీ ఏకం చేస్తారు. కానీ బావిలో ఉన్న పిల్లాడిని చూసిన మరో చిన్న పిల్లాడు ఏం చేశాడో చూస్తే, దానికి గల కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్ళు ఆగవు. ఒక మంచి ఎమోషనల్ థ్రిల్లర్ ను చూడాలనుకునే వారి కోసమే ఈ మూవీ సజెషన్. 2026లో నెట్‌ఫ్లిక్స్‌లో గ్లోబల్‌గా విడుదలై సంచలనం సృష్టిస్తున్న మెక్సికన్ మిస్టరీ-థ్రిల్లర్ లిమిటెడ్ సిరీస్ I’m Not Afraid. మరి ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.
కథ 1986లో ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో మొదలవుతుంది. మిగ్యుల్ అనే 10 ఏళ్ల చురుకైన బాలుడు ఇందులో మన బుల్లి హీరో. వేసవి సెలవుల్లో తన స్నేహితులతో ఆడుకుంటూ గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఒకరోజు ఒక పాడుబడిన, ఎవరూ వెళ్లని పాత ఇల్లు దగ్గర ఒక లోతైన గుంత దగ్గరకు వెళతాడు. అందులోకి తొంగి చూసిన అతనికి ఒక షాకింగ్ సీన్ కనిపిస్తుంది. చిన్న పిల్లాడు గాయపడి, బలహీనంగా, భయంతో కంపిస్తూ అక్కడ బంధించబడి ఉంటాడు. ఆ పిల్లాడి పేరు ఫెలిపే. మిగ్యుల్ మొదట భయపడినా, త్వరలోనే ఫెలిపేను రక్షించాలని నిర్ణయించుకుంటాడు. రోజూ రహస్యంగా ఆహారం, నీళ్లు, మందులు తీసుకెళ్లి అతనికి అందిస్తాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఒక అందమైన, నిర్మలమైన స్నేహం ఏర్పడుతుంది. ఫెలిపే తనను ఒక దయ్యం అని, చనిపోయాడని చెప్పినా మిగ్యుల్ నమ్మడు. నెమ్మదిగా ఫెలిపే నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అతన్ని ఎవరో కావాలనే కిడ్నాప్ చేసి అక్కడ బంధించారని చెప్పేస్తాడు. మిగ్యుల్ చిన్న వయసులోనే ఈ రహస్యాన్ని బాగా అర్థం చేసుకుంటాడు. దాన్ని బయట పెట్టడానికి రహస్యంగా ఆధారాలు సేకరించడం ప్రారంభిస్తాడు. కానీ ఈ విచారణ అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది.
తన ఊరిలో తాను ఎంతో నమ్మిన పెద్దలు, గౌరవప్రదమైన వ్యక్తులు, కాఫీ తోటల యజమానులు, తన సొంత కుటుంబ సభ్యులు కూడా ఈ కిడ్నాప్ కుట్రలో భాగస్వాములని తెలిసి మిగ్యుల్ ప్రపంచం తలకిందులవుతుంది. 1986 మెక్సికోలో ఆర్థిక కష్టాలు, కరవు, రాజకీయ అస్థిరత కారణంగా సాధారణ మనుషులు కూడా ఎంత క్రూరంగా మారగలరో ఈ సిరీస్ లో భయంకరంగా చూపించారు. ఫెలిపేను ఎందుకు కిడ్నాప్ చేశారు ? ఈ కుట్ర వెనుక ఎవరి చేతులున్నాయి ? మిగ్యుల్ తన చిన్న వయసులోనే ఈ భయంకరమైన సత్యాలను ఎదుర్కొని, తన స్నేహితుడిని రక్షించగలడా ? “నేను భయపడను” అంటూ ఆ అమాయకత్వం ఎంత ధైర్యంగా నిలబడింది ? అనేది ఈ సిరీస్ లో హార్ట్ టచింగ్ గా ఉంటుంది.
‘ఐయాం నాట్ అఫ్రైడ్’ ను దర్శకులు నాన్-లీనియర్ టైమ్‌లైన్‌తో ఉత్కంఠభరితంగా నడిపించారు. చిన్నారి నటుల పర్ఫార్మెన్స్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. చిన్న పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సాగే డార్క్ మిస్టరీలు, సామాజిక సమస్యలు ఇష్టపడేవారు మాత్రం పొరపాటున కూడా ఈ సిరీస్ ను మిస్ అవ్వొద్దు. ప్రముఖ రచయిత నికోలో అమ్మానితి నవల ఆధారంగా రూపొందిన ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ (Netflix)లో స్పానిష్ ఒరిజినల్‌తో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్, ఇంగ్లీష్ ఆడియోలో అందుబాటులో ఉంది.
Read Also : ఈ పొగను పీలిస్తే పోతారు మొత్తం పోతారు… దిమ్మతిరిగే కొరియన్ మిస్టరీ హర్రర్ సిరీస్