BigTV English

Blood River: ఆ నదిలో ఏరులా పారుతున్న రక్తం, దీని వెనుకున్న రహస్యం ఏంటి?

Blood River: ఆ నదిలో ఏరులా పారుతున్న రక్తం, దీని వెనుకున్న రహస్యం ఏంటి?

నదిని చూస్తేనే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మన దేశంలో నదులను దేవతలుగా కొలుస్తారు. జీవాధారమైన నీరు, అది చేసే సవ్వడి, అందమైన ప్రవాహం, ఈత కొట్టే చేపలు… అన్ని అద్భుతంగా ఉంటాయి. కానీ ఇక్కడ చెప్పే నదిని చూస్తే మాత్రం భయంతో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఈ నదిలో నీరు రక్తం రంగులో పారుతుంది. అందుకే ఈ నది దగ్గరికి ఎవరు వెళ్లేందుకు కూడా ఇష్టపడరు.


పెరూలోని పుకామయు నది
ఈ నది పెరూ అనే దేశంలో ఉంది. దీని పేరు పుకామయు నది. ఈ నదిలో నీరు రక్తంలా ఎర్రగా ఉంటుంది. అందుకే దీన్ని తలుచుకుంటేనే చాలామంది భయపడతారు. దాన్ని దగ్గర నుంచి చూసేందుకు కూడా ఎవరు ఇష్టపడరు. కేవలం దూరం నుంచి చూసి వెళ్ళిపోతారు.

ఈ నదిలో రక్తం ప్రవహించడం వల్లే ఆ నది నీటి రంగు మారిందని అక్కడ ప్రజలు భావిస్తూ ఉంటారు. ఈ నదిని బ్లడ్ రెడ్ రివర్ అని లేదా బ్లడ్ ఫాల్స్ అని పిలుస్తారు. అసలు పేరు మాత్రం పుకామయు.


వర్షాకాలంలో చూసే భయపడతారు
ఈ నదిని చూసేందుకు ఎన్నో దేశాల నుంచి పర్యాటకులు వస్తారు. కానీ నదిలో అడుగు మాత్రం పెట్టరు. దూరం నుంచి చూసి వెళ్ళిపోతారు. ముఖ్యంగా వర్షాకాలంలోనే పర్యాటకులు ఈ నది దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ ఎరుపు నది పెరూలో ముఖ్యమైన పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. వానాకాలంలో ఈ నదిని చూస్తే భయమేస్తుంది. నీరు మరింత ఎర్రగా మారిపోతుంది.

నది నీరు ఎర్రగా ఎందుకు?
నిజానికి నీటికి రంగు, వాసన ఉండదు. కానీ ఈ నదిలోని నీటికి మాత్రం రంగు ఉంది. ఇలా ఈ నది నీరు ఎరుపుగా ఉండడానికి కారణం ఇనుము అధికంగా ఉండటమేనని చెబుతారు. ఈ నది నీటిలో ఇనుము శాతం అత్యధికంగా ఉండడం వల్ల అది ఎరుపు రంగులోకి మారిందని అంటారు. దగ్గరలోని పర్వతాలు, కొండల్లో కూడా ఇనుము శాతం అధికంగా ఉందని అందుకే ఈ నది నీరు కూడా ఆ రంగులోకి మారిందని చెబుతారు. వర్షాకాలంలో ఎరుపు రంగు మరింత ఎక్కువగా అయిపోతుంది. ఎందుకంటే కొండలు, పర్వతాల నుంచి నీరు జారి నదిలోకి చేరుతుంది. అంటే ఇనుము ఎక్కువ శాతం నదిలో చేరిపోతుంది. దీనివల్ల మరింత ఎర్రగా నది నీరు మారిపోతుంది. వర్షాకాలం తర్వాత ఆ నీరు కాస్త గోధుమ రంగులోకి మారుతుందని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

ఈ నది దగ్గరికి ఎక్కువ మంది ఫోటోగ్రాఫర్లు వస్తారు. తమ ఫోటోగ్రఫీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఈ నదిని ఉపయోగించుకుంటారు. పర్యాటకులు మాత్రం ఈ నదిని ముందు ఫోటోలు దిగేందుకు అంతగా ఆసక్తి చూపించరు.

ప్రపంచంలో ఇలాంటి వింతలు ఎన్నో ఉన్నాయి. ప్రకృతి చేసే పనుల వల్ల ఇలా వింతలు ఏర్పడుతూ ఉంటాయి. అందుకే పెరూలోని ఈ పుకామయు నది కూడా ప్రకృతి వింతగానే చెప్పుకుంటారు.

Related News

Metro news 2025: ఆ నగరానికి బూస్ట్.. రూ.15,906 కోట్ల భారీ మెట్రో ప్రాజెక్ట్.. ఇక జర్నీ చాలా సింపుల్!

Heartwarming Story: దుబాయ్ లో ఫోన్ పోగొట్టుకున్న ఇండియన్ యూట్యూబర్, సేఫ్ గా ఇంటికి పంపిన పోలీసులు!

Vande Bharat Trains: అందుబాటులోకి 20 కోచ్‌ ల వందేభారత్ రైళ్లు, తెలుగు రాష్ట్రాల్లోనూ పరుగులు!

Railway tunnels: సొరంగాల్లో సైరన్ ప్రతిధ్వని.. నంద్యాల రైల్వే టన్నెల్స్ రహస్యాలు ఇవే!

Women Assaulted: రైల్వే స్టేషన్‌ లో దారుణం, మహిళను తుపాకీతో బెదిరించి.. గదిలోకి లాక్కెళ్లి…

Railway Guidelines: ఆ టైమ్ లో రైల్లో రీల్స్ చూస్తున్నారా? ఇత్తడైపోద్ది జాగ్రత్త!

Big Stories

×