దీపావళి, ఛత్ పూజ కారణంగా ఉత్తర భారతంలో రైల్వే స్టేషన్లు అన్ని కిక్కిరిసిపోతున్నాయి. రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. కాలు పెట్టేందుకు జాగా లేనంత మంది రైళ్లు ఎక్కుతున్నారు. ఈ నేపథ్యంలో లక్నోలోని చార్ బాగ్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జనాలతో పూర్తిగా నిండిపోయిన అవధ్ అస్సాం ఎక్స్ ప్రెస్ లో కనీస సౌకర్యాలు లేక ప్రయాణీకులు తీవ్ర అవస్థలు పడినట్లు చూపించింది.
ఈ వీడియో ప్రయాణీకులు తన ఇబ్బందులు చెప్పుకునే ప్రయత్నం చేశారు. కదిలేందుక కూడా స్థలం లేకపోవడంతో కిటికీ దగ్గరే గంటల తరబడి ఇరుక్కుపోయినట్లు చెప్పుకొచ్చాడు. కనీసం నీళ్లు కూడా తాగేందకు వీలుకావడం లేదన్నాడు. వాష్ రూమ్ కు వెళ్లాలనుకున్నా కుదరడం లేదని చెప్పుకొచ్చాడు. రైల్వే అధికారులు ప్రయాణీకులు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పినా, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ రైల్లో ప్రయాణీకులు అవస్థలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రైల్వే తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోను ప్రస్తుతం వేలాది మంది చూశారు. నెటిజన్లు రైల్వే తీరుపై మండిపడుతున్నారు. ప్రయాణీకుల బాధల పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. “12,000 ప్రత్యేక రైళ్లు అని చెప్పే అధికారులు.. ఇక్కడ ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులను ఓసారి చూడాలి. ప్రజలు కనీసం నీళ్లు తాగలేకపోతున్నారు. కనీసం వాష్ రూమ్ కు వెళ్లలేకపోతున్నారు. అమృత్ కాల్ ఎక్స్ ప్రెస్‌లోకి స్వాగతం” అని ఒక వినియోగదారుడు వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. “టాయిలెట్ కు వెళ్లాలని ఉన్నా, సీటు ఎక్కడ మిస్ అవుతుందోననే భయంతో అతడు అలాగే ఉండిపోయాడు. పాపం, ఎంత ఇబ్బంది పడ్డాడో? కనీసం మంచి నీళ్లు కూడా తాగలేకపోయానని చెప్తున్నాడు. నిజంగా దారుణం” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
Onboard Awadh Assam Express, a passanger tells @ashharasrar at Lucknow's Charbagh that he has been sitting in this overcrowded coach for 24 hours now. Hasn't been to the washroom since. "I fear drinking water." pic.twitter.com/7BF5z19uZX
— Piyush Rai (@Benarasiyaa) October 24, 2025
అవధ్ అస్సాం ఎక్స్ ప్రెస్ (15909/15910)ను ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్ నడిపిస్తుంది. ఇది అస్సాంలోని దిబ్రుగఢ్- రాజస్థాన్‌లోని లాల్‌ఘర్ జంక్షన్ మధ్య నడుస్తుంది. దేశంలోని పొడవైన, అత్యంత రద్దీగా ఉండే మార్గాలలో ఒకటి. దీని విస్తృత పరిధి కారణంగా, తరచుగా రైళ్లు ఆలస్యం కావడంతో పాటు రద్దీగా ఉంటాయి. రిజర్వ్ చేయని కోచ్ లు ప్రయాణీకులతో కిటకిటలాడుతాయి. “ఈ రూట్ లో నడిచే రైళ్లలో ప్రయాణీకుల అవస్థల పట్ల పోలీసులు సీరియస్ గా స్పందించాలి. ఓవర్‌లోడింగ్‌ను భద్రతా నేరంగా పరిగణించి, వెంటనే రైల్వే మీద కేసు నమోదు చేయాలి” అని నెటిజన్లు డిమాండ్ చేశారు. “భారతీయ రైల్వే పేదల విషయంలో ఎప్పుడూ ఇలాగే వ్యవహరిస్తుంది. రిజర్వు చేయని సీట్లు లేని వాళ్లు రైళ్లలో ఎప్పుడూ గౌరవంగా ప్రయాణించలేకపోతున్నారు” అని మరో వ్యక్తి రాసుకొచ్చాడు.
Read Also: నల్ల రంగులో వందే భారత్.. బీజేపీ మంత్రి ట్వీట్ చూసి అంతా షాక్, అసలు విషయం ఏమిటంటే?