BigTV English

Akhanda 2 shooting: నంద్యాల గుహల్లో సినిమా సెట్టింగ్స్.. బాలకృష్ణ రాక ఎప్పుడో?

Akhanda 2 shooting: నంద్యాల గుహల్లో సినిమా సెట్టింగ్స్.. బాలకృష్ణ రాక ఎప్పుడో?

Akhanda 2 shooting: ఏపీలో ప్రసిద్ధి చెందిన గుహలు అవి. ఇప్పుడు ఆ గుహల వద్దకు కేవలం పర్యాటకులే కాదు.. ఓ హీరో అభిమానులు రోజూ తెగ చక్కర్లు కొడుతున్నారు. అందుకు కారణమే.. ఆ గుహల వద్ద భారీ సినిమా సెట్టింగ్స్ వేయడం. తమ అభిమాన హీరో వచ్చే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతుండగా, ఇప్పుడు ఇక్కడ అభిమానుల సందడి నెలకొంది.


నంద్యాల జిల్లాలో ప్రకృతి ఒడిలో తళుక్కుమంటున్న చోటేమిటో తెలుసా? బేతంచర్ల మండలంలోని కొట్టాల గ్రామం వద్ద ఉన్న బిళ్ల స్వర్గం గుహలు. ఈ గుహల్లో ప్రస్తుతం సందడి వాతావరణం నెలకొంది. ఎటు చూసినా సినిమా సెట్టింగ్స్, భారీ లైటింగ్, టెక్నీషియన్ల పరుగులు పరుగులు. ఇక పక్కనే పర్యాటకుల సందడి ఓ వైపు నెలకొంది. ప్రకృతి మాయలో మునిగిపోయిన ప్రకృతి ప్రేమికులు.. మరోవైపు సినిమా టీం సభ్యులతో ఆ ప్రాంతం సందడిగా మారింది.

అఖండ పవర్ గుహల్లోకి?
అఖండ సినిమాతో థియేటర్లను ఊపేసిన నందమూరి నటసింహం బాలకృష్ణ మళ్లీ అదే గెటప్‌లో కనిపించనున్నారని తెలిసినప్పటి నుంచే అఖండ 2పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కోసం ప్రఖ్యాత బిళ్ల స్వర్గం గుహలని ఎంచుకున్నట్లు సమాచారం.


ఇక్కడే చిత్రీకరణ జరుగుతోందా అన్న సందేహం తొలుత స్థానికుల్లో మొదలైంది. కానీ గుహల వద్ద భారీ సెట్టింగ్‌లు, యూనిట్ వాహనాలు, సాంకేతిక బృందం చురుగ్గా పనిచేయడం చూస్తే ఇది చిన్నపాటి సినిమా కాదన్న విషయం స్పష్టమవుతోంది.

సినిమా సెట్టింగ్‌లు ప్రకృతి మధ్యలో..
బిళ్ల స్వర్గం గుహలు సహజసిద్ధంగా ఎంతో దివ్యంగా కనిపిస్తాయి. ఇవి కృష్ణా నదికి దగ్గరగా ఉండటంతో, అటవీ పచ్చదనంతో నిండిపోయిన ప్రదేశమని చెప్పవచ్చు. ఇలాంటి ప్రదేశంలో భారీ స్థాయిలో సెట్టింగ్‌లు వేయడం, మిస్టరీ సీన్‌లు, పవర్‌ఫుల్ కాషాయ నేపథ్యం కలిగిన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించబోతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. సెట్టింగ్‌ను చూసిన స్థానికులు ఇది మామూలు సినిమా కాదండీ! అని ఆశ్చర్యపోతున్నారు.

బాలయ్య వస్తే..
అఖండ సినిమాలో అఘోరా పాత్రతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన బాలయ్య.. ఈ సీక్వెల్‌లో మరింత పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. అయితే సినిమా యూనిట్ మాత్రం ఈ లొకేషన్‌పై అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కారణం.. బాలకృష్ణ షూటింగ్ కోసం వస్తున్నారన్న సమాచారం బయటికి వచ్చేస్తే అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండటమే. అందుకే రహస్యంగా చిత్రీకరణ చేస్తోంది యూనిట్ అని టాక్.

ఇప్పటికే బిళ్ల స్వర్గం గుహలు పర్యాటక ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా గుర్తింపు పొందాయి. ఇప్పుడు సినిమా షూటింగ్ వలన ఈ ప్రదేశం మరింత వెలుగులోకి రానుంది. పర్యాటకులు గుహల అందాన్ని ఆస్వాదించడానికి వస్తే, అదే సమయంలో సినిమా సెట్టింగ్‌లను చూడటానికి అదనపు ఆసక్తి కలుగుతోంది. ఇది టూరిజం ప్లస్ సినిమా అనే వినూత్న అనుభూతిని అందించబోతోంది.

Also Read: The RajaSaab : కళ్లు చెదిరే ధరకు ‘రాజా సాబ్’ నాన్ థియేట్రికల్ రైట్స్.. రిలీజ్‌కు ముందే లాభాలు..!!

సెప్టెంబర్ లో విడుదలా..?
ఈ సెట్టింగ్, షూటింగ్ వేగం చూస్తుంటే ‘అఖండ 2’ సినిమాను వచ్చే సెప్టెంబర్‌లో విడుదల చేయాలన్న ప్లాన్‌లో యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక బోయపాటి శైలిలో తీసిన గుహల యాక్షన్ సీన్లు చూస్తే థియేటర్లలో మళ్లీ ‘జై బాలయ్య’ శబ్దాలు మారుమోగటం ఖాయమనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

బోయపాటి సినిమాల్లో మాస్ తో పాటు మానవతా విలువలు కూడా ఉంటాయన్న సంగతి తెలిసిందే. బిళ్ల స్వర్గం వంటి ప్రదేశాన్ని సినిమాలో చూపిస్తున్నారంటే, జాతీయ స్థాయిలో ఈ గుహలకు స్పెషల్ క్రేజ్ వచ్చే అవకాశముంది. ఇది సినిమాకు మాత్రమే కాకుండా, రాష్ట్ర పర్యాటక రంగానికి కూడా బూస్ట్ కావొచ్చని నిపుణులు అంటున్నారు. అఖండ 2 టీం బిళ్ల స్వర్గంలో తమ దృశ్యాలను చిత్రీకరిస్తుంటే.. ఆ పరిసరాల్లో గాలి సైతం సినిమాటిక్‌గా మోగుతోందన్న భ్రమ కలుగుతోంది.

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×