E-Paper
Advertisement

అప్పటి ప్రజలతో.. రాముడు, కృష్ణుడు ఏ భాషలో మాట్లాడేవారు? బయటపడ్డ అసలు నిజం!

అప్పటి ప్రజలతో.. రాముడు, కృష్ణుడు ఏ భాషలో మాట్లాడేవారు? బయటపడ్డ అసలు నిజం!
Advertisement

Rama Krishna Language: శ్రీరాముడు, శ్రీకృష్ణుడు అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చే భాష సంస్కృతం. రామాయణం, మహాభారతం, భగవద్గీత వంటి గ్రంథాలన్నీ సంస్కృతంలోనే రాయడం వల్ల వారి దైనందిన భాష కూడా సంస్కృతమే అయి ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. అయితే ప్రాచీన భారతదేశంలో ఉన్నత విద్యావంతులు, పండితులు, పూజారులు మాత్రమే ఈ భాషను మాట్లాడేవారు. సామాన్య ప్రజల రోజువారీ సంభాషణలకు సంస్కృతం చాలా దూరంగా ఉండేదట.

మరి సామాన్యుల భాష ఏంటి?

చరిత్రకారుల పరిశోధనల ప్రకారం.. ఆ కాలంలో సామాన్య ప్రజలు సంస్కృతం కాకుండా ప్రాకృత భాషలు (Prakrit) లేదా స్థానిక మాండలికాలను మాట్లాడేవారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నాటికి దేశంలో ప్రాకృత భాషలు బాగా వాడుకలో ఉండేవి. ప్రాచీన సంస్కృత నాటకాలను గమనిస్తే.. రాజులు, పూజారులు సంస్కృతంలో మాట్లాడితే స్త్రీలు, సేవకులు, సామాన్యులు ప్రాకృతంలోనే మాట్లాడేవారు. అశోక చక్రవర్తి కూడా తన శిలాశాసనాలను ప్రజలకు అర్థమయ్యేలా సంస్కృతంలో కాకుండా ప్రాకృతంలోనే రాయించడం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు.

శ్రీరాముడు మాట్లాడిన భాష ఏమై ఉంటుంది?

Advertisement

శ్రీరాముడు ప్రాచీన కోసల రాజ్యానికి (అయోధ్య) చెందినవారు. కాబట్టి ఆయన రోజువారీ సంభాషణల్లో ఆనాటి కోసల ప్రాంతీయ మాండలికాలు లేదా ‘కోసలి’, ‘అర్థమాగధి’ వంటి తొలి ప్రాకృత రూపాలను ఉపయోగించి ఉంటారని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇవే తర్వాతి కాలంలో ఉత్తరాది భాషల ఆవిర్భావానికి పునాదిగా మారాయి.

శ్రీకృష్ణుడు ఏ భాష మాట్లాడి ఉండొచ్చు?

శ్రీ కృష్ణుడి ఉనికి.. మథుర, బృందావనం, ద్వారక ప్రాంతాలతో ముడిపడి ఉంది. మథుర పరిసర ప్రాంతాల్లో ఆ కాలంలో ‘శౌరసేని ప్రాకృతం’ (Shauraseni Prakrit) విస్తృతంగా వాడుకలో ఉండేది. తర్వాతి కాలంలో ఇది హిందీ, పంజాబీ, రాజస్థానీ భాషల ఆవిర్భావానికి దారితీసింది. కాబట్టి కృష్ణుడు ప్రజలతో గోపాలురతో మాట్లాడేందుకు శౌరసేని లేదా స్థానిక యాదవ మాండలికాన్నే ఉపయోగించి ఉంటారని చరిత్రకారులు భావిస్తున్నారు

Advertisement

Also Read: నేపాల్‌లో అద్భుతం.. 1,643 మంది విద్యార్థులను కాపాడిన హెడ్ మాస్టర్.. ఏం జరిగిందంటే?

అయితే వారు సంస్కృతం మాట్లాడలేదా?

రాముడు, కృష్ణులు ఇద్దరూ రాజవంశాలకు చెందినవారు. కాబట్టి వారికి విద్యాభ్యాసంలో భాగంగా సంస్కృతం తప్పక వచ్చి ఉంటుందని చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. పూజలు, వేద మంత్రాలు, పరిపాలనా పరమైన ఉన్నత విషయాల్లో వారు సంస్కృతాన్ని ఉపయోగించినప్పటికీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో, సాధారణ ప్రజలతో మాట్లాడేటప్పుడు మాత్రం ఆయా ప్రాంతాల స్థానిక ప్రాకృత భాషలనే మాట్లాడారని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.

Also Read: ప్రయాణానికి ముందు ఒంటెలకు ఉప్పు ఎందుకు తినిపిస్తారు? దీని వెనకున్న సైన్స్ ఏంటి?

Tags

Related News

మొబైల్ కొట్టేయబోతే.. ప్రాణాల మీదికి వచ్చింది.. రైల్వే స్టేషన్ లో షాకింగ్ ఘటన!

రైలు ప్రయాణంలో నవరాత్రి జోష్.. లోకల్ ట్రైన్‌లో మహిళల ‘గర్భా’ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!

సినిమా చూస్తూ ఆటో డ్రైవింగ్.. డ్రైవర్‌పై సీపీ సజ్జనార్ సీరియస్!

భక్తుల కోసం టీటీడీ కొత్త యాప్.. ‘వేంకటాద్రి’ ప్రత్యేకతలు ఇవే!

బీహార్ యువకుడితో రష్యా యువతి ప్రేమ.. గుడిసెలోనే ఉంటానంటూ ఇండియాకు వచ్చేసి..

ఎయిరిండియా విమానానికి హైజాక్ ముప్పు.. జైపూర్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, అసలు ఏం జరిగింది?

జోగులాంబ దర్శనానికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నుంచి బస్సులు!

డ్రీమ్ కారు కోసం ఇంత పిచ్చా? ఏకంగా వృషణా**లను అమ్మేశాడు!

Big Stories

Advertisement
×